-
ఓయ్ తాబేలు నాతో పరుగు పోటీకి వస్తావా? నువ్వు పోటీలో గెలిస్తే ఈ అడివిలో నీకు ఏంకావాలన్న ఇస్తాను. మరి నీవు పోటీకి సిద్దమేనా అని సవాలు విసిరింది కుందేలు. ఈ కుందేలు గాడు నాకే సవాలు విసురుతాడా? నన్నే సవాలు చేసి నా అహాన్ని దెబ్బతీస్తాడా? ఈ కుందేలు గాడి సంగతి ఏంటో చూదాం అని సవాలును స్వీకరించింది తాబేలు. కుందేలు మరియు తాబేలు పరుగు పందెం నియమాలు మాట్లాడుకుని, ఎవరైతే ఆ చివరి గీత…
-
ఈ చిత్రాన్ని మన మనసులో ఉంచుకుని ఈ సమాధానాన్ని క్షున్నంగా పరిశీలిదాం …. కొన్ని ప్రత్యేకమైన సంవత్సరాలలో పసిఫిక్ మహాసముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ స్థితి కంటె బిన్నంగా పరిణామం చెందుతాయి. ఈ ప్రక్రియలో సముద్రపు ఉపరితలం మీద జరిగే మార్పులను ఎల్నినో ఆసిలేషన్స్ (ENSO Oscillations), లేదా సథరన్ ఆసిలేషన్స్ (Southern Oscillations) అని వాతావరణ శాస్త్రవేత్తలు సంబోధిస్తారు. పసిఫిక్ సముద్రపు సాధారణ వాతావరణ పరిస్థితి: ఈ ఎల్నినోని మనం అర్ధం చేసుకోవాలంటే ముందుగా మనం పసిఫిక్ సముద్ర ఉపరితల సాధారణ…
-
వాతావరణానికి(weather), వాతావరణ పరిస్థితికి(climate) మధ్య చాలా వ్యత్యాసం ఉంది. రోజూ వారి జీవితంలో మనం అనుభవిస్తున్న వాతావరణాన్ని weather అని అంటాము. ఉదాహరణకు ఈ-టీవీ వార్తల్లో “ఈరోజు తిరుపతిలో రోజంతా వర్షం కురిసి అధిక శాతం వర్షపాతం నమోదయింది” అని చదువుతారు. అంటే ఈరోజు తిరుపతిలో వాతావరణం (weather) రోజంతా వర్షం కురవడం. అదేవిదంగా రేపు తిరుపతిలో వర్షం కొనసాగవచ్చు అనేది weather forecast . సాధారణంగా రాబోయే గంటలో, లేదా ఈరోజు , లేదా రేపు, లేక రాబోయే మూడు రోజుల వాతావరణ మార్పుని మనం weather…
-
రెండు రోజుల క్రితం ఒక ప్రొఫెసర్ గారిని కలవడానికి ఫ్రాంక్ఫర్ట్ నుండి కార్ల్స్రూహే అనే ఊరికి వెళ్ళవలసి వచ్చింది. ప్రొఫెసర్ గారిని కలిసిన తరువాత అక్కడ వారి టీం సభ్యులతో పిచ్చాపాటి సమావేశం ఉదయం 10:00 గంటలకు ఉంది. నేను చేరుకోవాల్సిన ప్రదేశం ఫ్రాంక్ఫర్ట్ నుండి సుమారు గంటా పది నిమిషాల ప్రయాణం. ఉదయం ఆరు ఇంటికే లేచి కొంత చర్చించాల్సిన విషయాలు నోట్ చేసుకొని ఉదయం 08:00 గంటలకు రైలు ఎక్కాను. ఇక్కడ కోవిడ్-19 పరిస్థితులు…
-
ఒకవేళ మనం జీవిత పాఠాలు త్వరగా నేర్చుకోకపోతే, జీవితమే కఠినమైన రీతిలో మనకు పాఠాలు నేర్పుతుంది — ఇది ఇంటర్మీడియట్లో చాలా మర్యాదపూర్వకమైన భాషలో నా డైరీలో రాసుకున్నది. కానీ యవ్వన వయసులో నా అంతరంగం నాకు చెప్పిన మాట — “నీ జీవితం నీకు సరదా తీరుస్తుందిరా నా బట్టా” అని. ఇంతకీ నాకు అప్పుడు ఎందుకు అలా అనిపించింది? సమయానికి తిండి పెట్టె తల్లితండ్రులు ఇబ్బందుల్లో ఉన్నపుడు, మార్కుల కోసం కాదు పిల్లల జీవితం…
-
నా కుటుంబ పూర్వీకుల గురించి, వారు వలస వెళ్లిన ఊర్ల గురించి, కొన్ని రోజుల నుండి నేను చాలా లోతుగా ఆలోచిస్తూ ఉన్నాను. థాంక్స్ టూ Quora! మా కుటుంబ వివరాలలోకి కొంచెం లోతుగా పరిశీలించగా నాకు కొన్ని విషయాలు అర్ధం అయ్యాయి. బహుశా నేను మీకు చెప్పే విషయాలు ఖచ్చితమైనవి కాకపోవచ్చు, కానీ నా అభిప్రాయాలని బలపరచడానికి నాకు కొన్ని ఆధారాలు ఉన్నాయి. మా పూర్వికులలో ఒక బామ్మ గారి పేరు ఆర్ది, ఇంకో బామ్మ…
-
పౌర విమానయాన రంగంలోని ప్రమాదాలతో పోల్చుకుంటే హెలికాప్టర్ ప్రమాదాల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది అని ఉత్తర అమెరికాకు చెందిన సంస్థ, నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు[1] (NTSB) అంచనా వేసింది. నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు (NTSB) రవాణా రంగంలో నెలకొన్న ప్రమాదాలను సమగ్రంగా విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదికలను అందచేస్తుంది. అలాగే బవిషత్తులో ప్రమాద నివారణకు తగు సూచనలను ప్రతిపాదిస్తుంది. అయితే NTSB సంస్థ కేవలం ఉత్తర అమెరికాలో సంభవించిన ప్రమాదాలనే విచారిస్తుంది. మన దేశంలో ప్రముఖ…
-
మా అమ్మగారు చెపుతూ ఉంటారు, నువ్వు పుట్టిన తరువాత నిన్ను నేను తప్ప ఇంక ఎవరు ఎత్తుకున్నా బాగా ఏడ్చేవాడివి నాన్న అని. బహుశా నాకు అప్పుడు ఊహ తెలియకపోయినా, ఆ క్షణం నాకు మా అమ్మ కౌగిలే ఒక ప్రేరణ. చిన్నపుడు బడిలో హోమ్ వర్క్ చేయనందుకు టీచర్ కొడుతుందేమో, మార్కులు సరిగా రాలేదు కనుక ఇంట్లో తిడతారేమో అనే భయంతో అసలు చదువు అంటేనే విరక్తి వచ్చేది. ఆనాడు చదువు నుండి, బడి నుండి…