• ఇస్రో చంద్రయాన్ -2 మిషన్లో పాల్గొన్న శాస్త్రవేత్తలలో దాదాపు 30% మంది మహిళలు ఉండడం మనందరికీ గర్వకారణం. ఈ మిషన్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గ మహిళా శాస్త్రవేత్తలు ముత్తయ్య వనితా మరియు రీతూ కరిదా గారు. ముత్తయ్య వనితా గారు ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అయితే రీతూ కరిదా గారు ఏరోస్పేస్ ఇంజనీర్. వీరిరువురికి ఇస్రో లో డిప్యూటీ డైరెక్టర్ గా పని చేసిన అనుభవం ఉంది. మన దేశ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ గారు ఫిబ్రవరి 28,…

  • వాతావరణ సూచనలు మీద చాలా జోకులు ఉన్న విషయం వాస్తవమేనండి. కొన్ని సార్లు రాబోయా 24 గంటల్లో భారీ వర్ష సూచన అని టీవిలో చెప్తే, రేపు బాగా ఎండ కాస్తుంది, వర్షం ఆచూకీ కూడా ఉండదు. ఇలాంటివి చాలా సందర్భాలలో మనం గమనించి ఉండొచ్చు. వ్యక్తిగతంగా మనకు అనుభవం అయ్యుండొచ్చు. ఇది కేవలం రాబోయే వాతావరణాన్ని కచ్చితంగా అంచనా వేయలేకపోవడం వలన జరిగే తప్పిదం మాత్రమే. ఇందులో టీవీల్లో వార్తలు చదివే వారి తప్పేమి లేదండో!…

  • రాత్రంతా వెన్నెలలో సేదతీర్చుకున్న ఎర్రమందారం ఉదయాన్నే రెట్టింపు ఉత్సాహంతో సూర్యునివైపు చూడసాగింది. నెమలి పురివిప్పినట్టుగానే, తన ఎర్రని రేకులను విప్పి తన స్నేహితుడైన తేనెటీగకు ఆహ్వానం పంపింది. హరివిల్లును ధరించిన సీతాకోకచిలుక ఎర్రమందారంకు శుభోదయం చెప్పటానికి ఎగురుకుంటూ వచ్చేసింది. ఇంతలో పెరట్లో మొక్కలకు నీళ్లుపోయడానికి వచ్చిన శ్యామల మందారచెట్టుకు నీళ్లుపోస్తూ ఇంతటి అందమైన మందారం పూసిందని సంతోషపడింది. పొలానికి సమయమైంది పోవాలి అని గబా గబా కొడవలి, టిఫిన్ డబ్బా తయ్యారు చేసుకుని ఇంటి బయటకు నడవసాగింది…

  • శాటిలైట్ వ్యవస్థ రాబోయే వాతావరణాన్ని అంచనా వేయడంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. అలాగని శాటిలైట్ వ్యవస్థ పూర్తిగా వాతావరణ శాస్త్రం లో ఉన్న సమస్యలన్నీ తీర్చలేదు. శాటిలైట్ వ్యవస్థకు చాలా పరిమితులు ఉన్నవి. అవి ఏంటో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మన భారత వాతావరణ శాఖ (IMD) మన దేశంలో వాతావరణ అంచనా నివేదికను ఇస్తుంది. వాతావరణ అంచనాను మనం కొన్ని విభాగాలుగా విభజించవచ్చు. అవి, పిక్చర్ క్రెడిట్స్: Weather Satellite Images: If the…

  • నాకు ఊహ తెలిసినప్పటి నుండి నాస్తికుడ్ని. నాస్తికుడిలా చనిపోతాను అనే విశ్వాసం (confidence) నాకు ఉంది! నాకు సైన్స్ పట్ల ఆసక్తి కూడా ఉంది కనుక ఈ ప్రశ్నకు నాకు సమాధానం ఇవ్వడానికి అర్హత ఉంది అని అనుకుంటున్నాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే తప్ప హేతువాదుల అందరి తరుపున ఇచ్చే సమాధానం కాదు అని మనవి. నేషనల్ జియోగ్రఫీ (2016) లో వచ్చిన ఒక వ్యాసం ప్రకారం “The World’s Newest Major Religion: No Religion”,…

  • “గురుత్వాకర్షణ తరంగాలను గుర్తుంచడం మరియు నమోదుచేయడం మానవ చరిత్రలో ఒక గొప్ప మైలురాయి అని చాలా మంది ఖగోళ శాస్త్రవేత్తలు చెపుతుంటారు.” అసలు గురుత్వాకర్షణ తరంగం అంటే ఏమిటి? దానిని కనుగొనడం నిజంగా అంత గొప్ప పరిణామమా? గురుత్వాకర్షణ తరంగంను నమోదుచేయడం ద్వారా మనకు ఈ విశ్వం గురించి ఏమి తెలుస్తుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమిచ్చే ప్రయత్నం చేస్తాను. గురుత్వాకర్షణ శక్తి గురించి న్యూటన్ వివరణ మనందరికీ తెలిసినదే. కొంత నిర్దిష్ట దూరంలో ఉన్న రెండు ద్రవ్యరాశి…

  • నా వివాహం ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం జరిగింది. ఆ క్రమంలో జరిగిన కొన్ని విషయాలు నాకు చాలా అర్థరహితంగా అనిపించాయి. అవి ఇక్కడ పంచుకునే ప్రయత్నం చేస్తాను. అయితే నాకు అర్థరహితం అనిపించినంత మాత్రనా అవి నిజంగానే అందరికి అర్థరహితం అని అనిపించక పోవచ్చు, గమనించ గలరు! మీకు కొంచెం నాగురించి చెప్పి, ఈ సమాధానం మొదలుపెడతాను. నేను చిన్నప్పటినుండి హేతువాదిని! హేతువాద ఆలోచనలతోనే బ్రతికాను. కాబట్టి నేను చూసే ప్రపంచం కొంత వేరుగా…

  • విమానాలు దాదాపు ఎక్కువ శాతం తేమ, వర్షం, ఐస్ పదార్దాలు కలిగిఉన్న మేఘాలలోకి వెళ్లకుండా ఫ్లైట్ పాత్ ప్లానింగ్ చేసుకుంటారు. వాతావరణ నిపుణుల సూచన మేరకు Air Traffic Controllers (ATC) పైలెట్స్ కి విమానం దట్టమైన మేఘాలలోకి వెళ్లకుండా ఆదేశాలు ఇస్తుంటారు. అంతే కాకుండా పైలెట్స్ కేబిన్ లో ఉన్న రాడార్ సహాయం తో పైలెట్స్ విమానం దట్టమైన మేఘాలలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకవేళ మేఘాలపై నుండి వెళితే వర్షం విమానం మీద కురిసే…

“If one does not know to which port one is sailing, no wind is favorable”. — Lucius Annaeus Seneca.