• సుమారు 13 సంవత్సరాల వయసు అప్పుడు నేను ఆత్మహత్య చేసుకోడానికి ఇంటి నుండి మా ఊరి రైల్వే స్టేషన్ దగ్గరకకు నా సైకిల్ వేసుకుని బయలుదేరాను. రైల్వే స్టేషన్లో నా సైకిల్ వదిలేసి హౌరా ఎక్సప్రెస్ ఎక్కి, ఎక్కడికో వెళ్ళిపోయి, ఎవ్వరికీ తెలియకుండా ఏదైనా చేసుకోవాలని గొప్ప ప్లాన్ వేసుకున్నాను షెర్లాక్ హోమ్స్ లాగా. ఈ సంఘటనకు ముందు సరిగ్గా పదిరోజుల క్రింద నా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు మా బడి పంతులు. మా క్లాసులో నేను…

  • కవరింగ్ లెటర్ అంటే ఏమిటి? ఈ లెటర్ రాయడానికి నియమ, నిబంధనలు ఏమిటో వివరించగలరా? ఒక ఉద్యోగానికి లేదా ఒక కోర్స్ నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్నపుడు మన అప్లికేషన్తో పాటు మన ఆసక్తి తెలుపడానికి ఒక కవర్ లెటర్ రాయవలసి ఉంటుంది. కవర్ లెటర్ రాయడానికి ఒక నిర్దిష్టమైన నియమ నిబంధనలు నాకు తెలిసినంతవరకు ఏమి లేవు. మన కవర్ లెటర్లో మనకు ఆ ఉద్యోగం పట్ల ఎంత ఆసక్తి ఉందొ, ఆ ఉద్యోగం ఒకవేళ మనకు వస్తే మనం…

  • విద్యావ్యవస్థలో మార్పులు సూచించే అంత గొప్ప ఆలోచనలు నాకు లేవు. నేను లెక్చరర్ గా (ఇంజనీరింగ్ విద్యార్థులకు) మంగళూరులో కొన్ని రోజులు పనిచేసాను. అక్కడ నా అనుభవాలు రాస్తాను. అప్పుడు నా వయసు సుమారు 24 సంవత్సరాలు అనుకుంట! మొదటి రోజు పాఠం చెప్పడానికి క్లాసుకి బయలుదేరాను. కొంత భయం వేసింది! కానీ మొత్తానికి ఏదోలా క్లాసులోకి వెళ్ళాను. నన్ను చూడగానే వీడు లెక్చరర్ ఏంటి అనుకున్నారేమో! ఎందుకంటే అప్పుడు నేను చాలా చిన్నగా ఉండేవాడిని. I…

  • కీర్తి తొందరగా వచ్చి ఈ దోస తిను, ఎంత సేపు రెడీ అవుతావు? మీ నాన్న నీ గురించి కింద ఎదురుచూస్తున్నారు అని కీర్తి వాళ్ళ అమ్మ హడావిడి చేయసాగింది. ఎప్పటినుండో నేషనల్ వాలీబాల్ అండర్ 16 టోర్నమెంట్ లో పాల్గోవాలన్న కీర్తి ఆశ రేపు నిజం కాబోతుంది. పైగా కీర్తి మిత్రుడు గోపి కూడా ఆ టోర్నమెంట్ కోసం తనతో పాటు వస్తున్నాడన్న ఆలోచన కీర్తికి మరింత ఆనందాన్ని కలిగించింది. గోపి పట్ల ఆకర్షణ గత…

  • శ్యామల పెద్దాపురంలో పేరు పొందిన రికార్డింగ్ డాన్సర్. వాళ్ళమ్మ, అమ్మమ్మలు ఆ రోజుల్లో పెద్దాపురం చుట్టుపక్కల గ్రామ్మాన్ని ఒక ఊపు ఊపారు. వారిద్దరికంటే శ్యామల పదిరెట్లు అందంగా ఉంటుంది. ఊరిలో వారందరు పెద్దాపురం మాధురి దీక్షిత్ అనేవారు శ్యామలను. పెద్ద పండక్కి పెద్ద పెద్ద వాళ్లంతా వారి ఊర్లకి పిలిపించుకుంటారు శ్యామలను. పక్క ఊర్లల్లో పెసిడెంట్ దగ్గరనుండి తాగుబోతు రాయుళ్లదాకా అందరు శ్యామల అందానికి మంత్రముగ్దులు అయినవాళ్లే! శ్యామల “ఆ అంటే అమలాపురం” పాటకు స్టెప్పు ఏస్తే…

  • సాయంత్రం కొంత సేపు సేద తీర్చుకోడానికి మా ఇంటి మేడమీదకు వెళ్ళాను. అంతా చీకటి, నిశబ్దం. మా ఇంటి పక్కనే ఉన్న పొలం నుండి చల్లటి గాలి నన్ను తాకుతూ ఉంది. ఆ పొలంలో మిడతల దండు నిశబ్దానికి భంగం కలిగించేలా అప్పుడపుడు శబ్దాలు చేయసాగాయి. మా వీధి కుక్క నేను కూడా ఉన్నాను అని చెప్పడానికి అరవడం మొదలుపెట్టింది. ఆ రోజు అమావాస్య కావడంతో చంద్రుడు ఆ రోజు తనకి తాను సెలవు ప్రకటించుకున్నాడు. నల్లటి…

  • ముందుగా ఒకసారి చిరపుంజి వంటి ప్రదేశంలో భౌగోళిక విశేషాలను చూదాం. Image Source: (a) Map North-East India (b) Cherrapunji hills [3] ఇక విషయం లోకి వెళ్తే, దాదాపు కొండలు ఉన్న ప్రదేశాల్లో ఒరొగ్రఫీ లిఫ్టింగ్ జరుగుతుంది. అంటే కొండలవైపు బలంగా వీస్తున్న గాలి కొండ కింద భాగం నుండి మొదలయ్యి కొండ పైభాగం వరకు ప్రయాణం చేస్తుంది. గాలి ప్రయాణించే ప్రక్రియలో తనతో పాటె తేమను కొండపైకి మోసుకు వెళ్తుంది. కొండ పైభాగంలో వాతావరం చల్లగా ఉంటుంది కనుక ఆ తేమ…

  • నాది ప్రేమ వివాహం, భారత క్రైస్తవ చట్టం, 1872 ప్రకారం నా శ్రీమతిగారి కుటుంబం, నా కుటుంబం కోరిక మేరకు జరిగింది. నేను హేతువాదిని కాబట్టి చర్చలో పెళ్లి చేసుకోవడం పెద్దగా ఇష్టంలేకపోయినా, మా ఇరు కుటుంబాలు కోరికమేరకు చేసుకున్నాను. నేను ఎదుటివారి అభిప్రాయాలను గౌరవిస్తాను, కానీ పెళ్లి పీటలు (ఇక్కడ పెళ్లి స్టేజి అనమాట, మాకు పీటలు ఉండవు కదా) మీద నాకు కలిగిన భావాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ కూడా నాకు ఉంది, అందుకనే రాయాలనిపిస్తుంది….

“If one does not know to which port one is sailing, no wind is favorable”. — Lucius Annaeus Seneca.