వాతావరణానికి(weather), వాతావరణ పరిస్థితికి(climate) మధ్య చాలా వ్యత్యాసం ఉంది.
రోజూ వారి జీవితంలో మనం అనుభవిస్తున్న వాతావరణాన్ని weather అని అంటాము. ఉదాహరణకు ఈ-టీవీ వార్తల్లో “ఈరోజు తిరుపతిలో రోజంతా వర్షం కురిసి అధిక శాతం వర్షపాతం నమోదయింది” అని చదువుతారు. అంటే ఈరోజు తిరుపతిలో వాతావరణం (weather) రోజంతా వర్షం కురవడం. అదేవిదంగా రేపు తిరుపతిలో వర్షం కొనసాగవచ్చు అనేది weather forecast . సాధారణంగా రాబోయే గంటలో, లేదా ఈరోజు , లేదా రేపు, లేక రాబోయే మూడు రోజుల వాతావరణ మార్పుని మనం weather changes అని సంబోదించాలి. ఉదాహరణకు, weather ఎలా ఉండబోతుందో అనే అంచనా ద్వారానే మనతో పాటు గొడుగు తీసుకువెళ్లాలో లేదో ఒక నిర్ణయానికి వస్తాము.
PC:[1]
మరి వాతావరణ పరిస్థితికి (climate) అంటే ఏంటి?
ఒక ఉదాహరణ తీసుకుందాం,
మీరు విశాఖపట్నంలో చదువుకుంటున్నారు. మీకు రెండు ఉద్యోగం అవకాశాలు వచ్చాయి అనుకుందాం.
- హైదరాబాదులో ఒక ఉద్యోగం అవకాశం వచ్చింది.
- కెనడాలో ఒక ఉద్యోగం అవకాశం వచ్చింది.
ఈ రెండు ఉద్యోగాలలో ఎక్కడికి వెళ్ళాలి అనే నిర్ణయం మీ జీతం, ఖర్చులు, జీవన నాణ్యత మొదలైన ప్రముఖ కారణాల బట్టి ఉంటుంది. ఇంకో ముఖ్యమైన అంశం హైదరాబాద్ లేదా కెనడాలో వాతావరణ పరిస్థితి (climate).
అంటే చలికి తట్టుకోలేని వాళ్ళు, లేదా చలంటే ఇష్టం లేని వాళ్ళు కెనడా వెళ్ళడానికి ఇష్టపడరు. ఈ నిర్ణయం మీరు దీర్ఘకాలికంగా కెనడాలో వాతావరణ పరిస్థితిని (climate) తెలుసుకునే నిర్ణయం తీసుకుంటారు. అంటే కొన్ని దశాబ్దాలపాటు కెనడాలో వాతావరణం సగటున ఏ రకంగా ఉందొ మనం పరిగణంలోకి తీసుకుంటాం. ఉదాహరణకు మన ఉద్యోగం కోసం కొన్ని సంవత్సరాలు వలస వేళ్ళవలసినప్పుడు మనం రేపు కెనడాలో వాతావరణం (weather) కంటే దీర్ఘకాలిక వాతావరణ పరిస్థితిని(climate) అధికంగా పరిగణంలోకి తీసుకుంటాం!
- ఒక్కమాటలో చెప్పాలంటే రేపు ఏమి జరుగుతుందో అనేది weather , దీర్ఘకాలికంగా (సుమారు 30 సంవత్సరాల వాతావరణ సగటు) ఒక ప్రదేశంలో నెలకొన్న వాతావరణ పరిస్థితి climate.
ఫుట్‌నోట్స్
[1] Charcoal Drawings Of People | Pencil and charcoal drawing with the red umbrella painted in oil. 18 … | Art drawings sketches, Pencil art drawings, Umbrella painting