ఆర్థుర్ షోపెన్హవర్ (Schopenhauer) అనే పాశ్చాత్య తత్వవేత్త గౌతమ బుద్ధుడు బోధించిన “life is a suffering” అనే తత్వ కోణాన్ని సమర్థిస్తూ పాశ్చాత్య భాషలో అనేక రచనలు చేసారు. వాస్తవానికి జీవితంలో నుండి దుఖ్కాన్ని , దుఖంలో నుండి జీవితాన్ని వేరు చేయలేమన్న సంగతి మనందరికి తెలిసిన ఒక వాస్తవం.
దుఖ్కాన్ని మన జీవితంలో సాధ్యమైనంతవరకు నివారించడానికి బుద్ధుడు మరియు ఆర్థుర్ షోపెన్హవర్ మన ఆశలను, కోరికలను ఎంత తక్కువగా ఉంచగలిగితే, జీవితంలో దుఖ్కాన్ని అంత నివారించవచ్చు అని చెప్పారు (“limiting of desire and resignation from life”). వాస్తవమే, మనం ఆశలు కోరికలను సాధ్యమైనంతవరకు అదుపు చేసుకోగలిగితే కొంతమేరకు దుఖ్కాన్ని దూరం చేయగలుగుతాం.
కానీ ప్రస్తుత ఆధునిక జీవిన సైలిలో వచ్చిన సమస్యల్లా, ఎంత వరకు మనం మన ఆశలను నియత్రించుకోవాలి అని?
ఉదాహరణకు, మనం పరీక్షల్లో చాలా సార్లు ఫెయిల్ అయ్యాము అనుకోండి, ఈ ఫెయిల్యూర్ వల్ల మనకు కలిగిన దుక్కాన్ని తగ్గించుకోడానికి మనం పై చదువులు చదవాలి అనే ఆశను వదులుకోవాలా? ఆధునిక జీవితంలో డబ్బులేనిదే రోజు గడవదు, డబ్బుపై ఉన్న ఆశను మనం తగ్గించుకోవాలా? కాలేజీలో కలిగే ఆకర్షణలను అణిచివేసుకోవాలా? మనం చేసిన యూట్యూబ్ వీడియో కి వ్యూస్ రాలేదని , ప్రయత్నం ఆపేస్తామా ? ఇవన్నీ నా జీవితంలో నాకు కలిగిన కొన్ని ప్రాక్టికల్ ప్రశ్నలు.
పైన ప్రశ్నలు అన్నిటికి ఒక సమాధానం “కొంత వరకు ఆశను నియంత్రించుకోవచ్చు” అని తేలికగా చెప్పవచ్చు. కానీ ఆ కొంత ఎంత అనేదే నాకు వచ్చిన సమస్య!
వ్యక్తిగతంగా నా జీవితంలో ఎన్నో ఆటుపోటులను, ఫెయిల్యూర్స్ ని, ఆకలిని, నిద్రలేని రాత్రులను, అవమానాలను , నమ్మక ద్రోహాలను చూసాను. కానీ పైన చెప్పిన సంఘటనల వలన కలిగిన దుఃఖం నాకు అనేక పాఠాలు నేర్పి , జీవితంలో వచ్చిన ఒడిదుడుకులను ఎదురుకునే శక్తిని ఇచ్చింది తప్పితే, కోరికల నియంత్రించుకోవాలని చెప్పిన షోపెన్హవర్ ఆలోచన ఎప్పుడు కలగలేదు.
ఆర్థుర్ షోపెన్హవర్ శిష్యుడు Nietzsche, మన జీవితం దుఃఖం తో నిండివున్న విషయం వాస్తవమే అయినప్పటికీ , తన గురువు షోపెన్హవర్ చెప్పిన విదంగా దుఃఖం నుండి తప్పించుకోడానికి మనం ఆశలను, కోరికలను వదులుకుని శూన్యవాదాన్ని ఆశ్రయించకుండా, దుఃఖం జీవితంలో ఒక భాగంగా చూసి, అందులోనుండి మన వక్తిత్వాన్ని మెరుగు పరుచుకుని, మన జీవితానికి ఒక అర్ధం వెతుకున్నే ప్రయత్నం చేసి, ఆత్మ విశ్వాసంతో మన జీవితాన్ని బ్రతకాలని చెప్పాడు.
ఆధునిక జీవితంలో మానవుడు ఎంతో పురోగతి సాధించినా, దుఃఖం (suffering) నుండి మనం ఎప్పటికీ తప్పించుకోలేం. కానీ Nietzsche చెప్పినట్టు: “depth and meaning of life will come from overcoming suffering” అనే వాక్యాన్ని మనం గుర్తుపెట్టుకుని ముందుకు నడవాలి అనేది నేను తెలుసుకున్న ఒక జీవిత సత్యం. అందుకే నా దృష్టిలో, జీవితంలో అత్యంత విలువైనది — “suffering “.