-
రామ్ గోపాల్ వర్మ గారు మన ఇండియన్ సినిమాకి చేసిన/చేస్తున్న కాంట్రిబ్యూషన్ మెచ్చుకోవలసినదే! తాను ఎంచుకున్న వైవిధ్యమైయిన కధలు ప్రసంశనీయం (మాఫియా, ప్రేమ, సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ మొదలగునవి). కొన్ని కధలోని పాత్రలు వాస్తవికతకు దగ్గరగా వుంటాయి, ఉదాహరణకు రంగీలా, సత్య, వీరప్పన్ మొదలగునవి. తాను తీసిన కొన్ని సినిమాలు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు. రామ్ గోపాల్ వర్మ గారు చాలా మంది నూతన దర్శకులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసారు (కృష్ణ వంశీ,…
-
నమస్కారం, నాపేరు ఆర్థర్ ఫ్లెక్ (Arthur Fleck). మా అమ్మగారి తో కలసి గోతం (Gotham ) పట్టణములో నివసిస్తుంటాను. నేను జోకర్ గా ఒక్క కంపెనీలో పనిచేస్తున్నాను. మాది చాలా నిరుపేద కుటుంబం. మా అమ్మగారు, ఎప్పుడు నా ముఖంలో చిరునవ్వు వుండాలని, అందరిని నవ్విస్తూ వుండమని చెప్పారు. మా అమ్మగారిని నేనే చూసుకుంటాను. స్టాండప్ (stand up) కమెడియన్ గా ఎదగాలని చిన్నప్పటి నుండి నా ఆశ. అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్న…
-
వాతావరణ నమూనాలను రెండు విధాలుగా విభజించవచ్చు. ముందుగా Weather Models (స్వల్పకాలిక వాతావరణ నమూనాలు) గురించి రెండు ఉదాహరణల ద్వారా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను: 1999వ సంవత్సరం అక్టోబర్ 29 నా ఒడిశా రాష్ట్రమును ఒక పెను తుఫాను అల్లకల్లోలం చేసింది. సుమారు గంటకు 260 కిలోమీటర్ల వేగంతో ఈదురులుగాలీ, భారీగా వర్షపాతం, పిడుగులు, సముద్రపు నీళ్లు (storm surge) ముందుకు రావడంతో భారీగా ప్రాణనష్టం జరిగింది. కరెంటు తీగలు తెగిపోవడం, చెట్లు కింద పడిపోవడం, రోడ్లు, ఇళ్లు…
-
ఒక రోజు యధావిధిగా నా పనిలో పడిపోయా ఆఫీస్ లో. అప్పుడు ఒక ఇ-మెయిల్ వచ్చినట్టు గమనించా. ఇ-మెయిల్ (e-mail): మీరు మాకు పంపిన సైంటిఫిక్ పేపర్ (science paper) మా సమావేశంలో చర్చించడానికి మిమ్మలను ఆహ్వానిస్తున్నాం. ఈ సమావేశం ఫ్రాన్స్-పారిస్ (France-Paris) నగరంలో జరుగుతుంది. మీకు హోటల్ మరియు ట్రావెలింగ్ అలోవెన్సు (traveling allowance) మేమె ఇస్తాం అని ఉoది. సమావేశం చాలా పెద్దది మరియు పారిస్ నగరంలో జరుగుతుంది కనుక ఒక మంచి అవకాశంగా భావించి, నేను వస్తాను,…
-
ఈ సమాధానం కోసం, ఖగోళశాస్త్రం కు సంబందించిన ఇద్దరు ప్రముఖ శాస్త్రవేత్తలు (వీరు మనందరికీ సుపరిచితులే ) ప్రతిపాదించిన సిదంతాలను మీ ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. ఐజాక్ న్యూటన్ 1687 వ సంవత్సరం లో గురుత్వాకర్షణకు సంబంధించిన సిద్ధాంతమును Philosophiæ Naturalis Principia Mathematica అనే గ్రంధములో పొందుపరిచారు. మాస్( ద్రవ్యరాశి) ఉన్న ప్రతీ పదార్ధము, ఇతర పదార్థములను ఆకర్షిస్తుంది, ఈ ఆకర్షణనే గురుత్వాకర్షణ శక్తి అని న్యూటన్ ప్రతిపాదించారు. గురుత్వాకర్షణ శక్తి రెండు పధార్ధాల యొక్క…
-
మంచు కరిగి, నీరుగా ప్రవహించి, ఒక పంటను నిలబెట్టి నట్టు, కరిగిపోతున్న తన జీవితానితో పోరాడుతూ, తన స్నేహితుల జీవితాలను తీర్చిదిద్దిన ఒక మహిళతో నన్ను ప్రేమలో పడేసారు! మీ మంచు పల్లకి నా గుండెల్లో ఇంకా కరగలేదు! పంజరంలో (కోటలో ) చిలుక (రాజకుమారి) స్వేచ్చకు సంకెళ్ళు వేసిన తన కుటుంభ పరువు ప్రతిష్టలను బద్దలుకొట్టడానికి వచ్చిన పగటి వేషగాడు, వాళ్ళిద్దరి మధ్యలో వెలసిన ప్రేమ, ఒక మహా కావ్యం సార్! రాజకుమారిని మాకు సీతార గా చూపించి, మీ అద్భుతమయిన…
-
మీరు పాకిస్థాన్ నుండా? లేదు ఇండియా నుండి! మా రైలు ప్రయాణం లో రెండు నిముషాల నిశ్శబ్దం. మూడు సంవత్సరాల క్రితం నేను, మా శ్రీమతిగారిని కలవడానికి, ఫ్రాంక్ఫర్ట్ (Frankfurt am Main) నుండి తను పీహెచ్డీ చేస్తున్న నగరం హాంబర్గ్ (Hamburg) కి బయలుదేరా. ప్రయాణ సమయం సుమారు నాలుగు గంటలు. రైలు బయలుదేరే అయిదు నిముషాల ముందు రైల్వే స్టేషన్ కు చేరాను. నేను ఎక్కవలసిన రైలు ఏ ప్లాట్ఫారం మీద ఉందొ చూసుకుని,…
-
నేను ఎడొవ తరగతి చదువుతున్నపుడు, మా స్కూల్ టీచర్ నాతో, మీ నాన్న గారు స్కూలు కీ వచ్చారు, ప్రిన్సిపాల్ తో మాట్లాడుతున్నారు, కొంత సేపు తరువాత టీచర్స్ మీటింగ్ కు మన ప్రిన్సిపాల్ గారు మా అందరిని పిలిచారు అని చెప్పారు. నాకు భయం మొదలయింది. అక్కడ ఏమి జరుగుతుందో నాకు అర్ధం కాలేదు. మా నాన్నగారు రావడం ఏంటి, మా ప్రిన్సిపాల్, టీచర్స్ మీటింగ్ కు పిలవడం ఏంటి అని! ఉదయం నుండి మధ్యాహ్నం…