-
మన చదువుల్లో నాణ్యత లేదు అనేది ఒక వాదన అయితే, మన దేశం “ఎక్సపోర్ట్ అఫ్ స్కిల్డ్ లేబర్ ” అని చెప్పుకునే వాదన మరొకటి. డిగ్రీలు పొంది మన ఊత్తు (యూత్) పెద్దగా ఇకింది ఏమిలేదు అని కొన్ని నివేదికల్లో చెప్తుంటే, భారతదేశం నుండి చదువుకున్న ఊత్తు ఈరోజు ప్రపంచాన్ని ముందుకు నడుపుతున్నారు అని కొన్ని నివేదికలు చెప్తున్నాయి. రెండిటిలోను కొంత వాస్తవం ఉంది, రెండుటిలోను కొంత కల్పితం ఉంది. ఇక నా అభిప్రాయం మూడో…
-
ఓరోజు సాయంత్రం ఇంటి పక్కన వీధిలో నా స్నేహితులతో క్రికెట్ ఆడుకుంటున్నాను, ఇంతలో జోనాథన్ మామ డాన్స్ ఆడే సమయం వచ్చేసింది అని కబురు వచ్చింది. ప్రతి డిసెంబర్ నెలలో మా కాలనీలో డాన్స్ ప్రోగ్రాములు నిర్వహించడం ఓ ఆనవాయితి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అందరం పరుగు తీసాం జోనాథన్ మామ డాన్స్ చూడడానికి. జోనాథన్ మామకు మా కాలనీలో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. మామ సుమారు ఆరు అడుగులు ఉండేవాడు, కాలనీ అంతటిలో…
-
లెక్కల పరీక్ష గంట ముందే ముగించి నా బడి సంచి వెనకాల తగిలుంచుకుని పరిగెత్తుకుంటూ మా స్కూల్ యెల్లో బస్సు దగ్గరకు చేరాను. సీట్ నెంబర్ మూడు, కిటికీ దగ్గర నా సంచి అడ్డం పెట్టి, దాని పక్క సీట్లో నేను కూర్చున్నాను. అంజు (పేరు మార్పు ) వస్తుందేమో అని ఎదురుచూస్తూ అలానే ఆ పక్క సీటులో ఒక అరగంట ఆలోచిస్తూ గడిపేసాను. “సీట్ నెంబర్ మూడుకి ఏమి ప్రత్యేకత ఉందొ నాకు తెలియదు గాని,…
-
మా ఊరి రధంబజారులో చివరాకరిన ఉన్న బాదంపాల కొట్టు గొప్ప పేమస్సు. మా కాలేజీ ఆడలేడిసు ఒకరయినా కనపడకపోతారా అని మా ఊరి “ఇమాక్సు” – అన్నపూర్ణ థియేటర్ మీదగా నా చైకుల్ని తొక్కుకుంటు పోయేవాడ్ని రధంబజారుకి. అందానికి అతీతంగా ఆడలేడీస్ ను గౌరవించడం మా విమిశ్యం లోనే ఉంది. అలాంటి ఆశలతో నా చైకుల్ని తొక్కుకుంటూ రాధంబజారులో ఉన్న గడియారస్తంభం చేరుకునేవాడ్ని. మా ఊరికి ఆ గడియారస్థంభం ఒక తాజ్ మహల్ లేదా ఒక రామమందిరం…
-
ఆ రోజుల్లో యేసుప్రభు బెత్లహేమును ఎంత ఆశీర్వదించారో నాకైతే తెల్వదు గాని, మా కాలనీని మాత్రం అద్భుతంగా బ్లెస్స్ చేసారు. బహుశా అయన రెండో రాకడ మా కాలనీలోనే ఏమో! మా కాలనిలో క్రిస్టమస్ సంబరాలు గొప్ప హైలెట్టు. క్రిస్టమస్ సంబరాల్లో చెప్పుకోదగ్గ అద్భుతమైన ఘట్టం : “కిస్మిస్ పేషల్ డ్రామా” ! మా కాలనీ పెసిడెంటు, సెక్రటరీ, పెద్దలు ఆ పేషల్ డ్రామా తాలూకూ స్క్రిప్ట్ రైటర్సు . వారి మధ్యలో తెల్లవార్లూ ఈస్టోరీ డిస్కషన్లు…
-
అది ఒక చీకటి రాత్రి …. రాత్రి ఎప్పుడు చీకటిగానే ఉంటుంది, ఈ చీకటి రాత్రి ఏంటి బాబు అని నన్ను అపార్థం చేసుకోకండి! విషయం ఏంటంటే, మరుసటిరోజు నాకు అర్ధంకాని హిందీ పదో తరగతి ఫైనల్లింగ్ పరీక్ష అనమాట. మన హిందీ లేవులు “ఏక్ గావ్ మె కిసాన్ రెహత్తాత“ మాదిరి! అందుకే అది చీకటి రాత్రి అని వర్ణించాను. అసలు మా వమిఁశ్యం లో హిందీ పాసు అయినట్టు చరిత్రలోనే లేదు. మాది చరిత్ర…
-
సాయంత్రం ఊరికి బయలుదేరాలి, అన్ని సామాన్లు సర్దుకున్నానా లేదా? ఉండేది మూడురోజులే కదా, కొంత సామాను సరిపోతుందిలే! ఇంతకీ అసలు ట్రైన్ టిక్కెట్టు ఈరోజుకేనా లేక రేపటికా? ఈ ప్రశ్న తలుచుకుంటే ఒక్క క్షణం నా గుండె కలుక్కుమంది. టిక్కెట్టు మరోసారి చూసుకున్నాక గుండె తిరిగి నెమ్మదించింది. బహుశా ప్రయాణం ముందర అందరికి ఎదురయ్యే ప్రశ్నలే ఏమో ఇవ్వన్నీ! మొత్తానికి ఇంటినుండి బయలుదేరి స్విట్జర్లాండ్ లో ఉన్న ఒక రైల్వే స్టేషన్ కి చేరుకున్నాను. చుట్టూ జనం,…
-
మా కాలని ని ఆనుకునే రైలు పట్టాలు ఉండేవి. ఇటుపక్క పట్టాలేమో మద్రాసు పోయే బండ్లుకు అటుపక్క పట్టాలు బెజవాడ, కలకత్తా పోయే బండ్లుకు అనమాట! రైలు బండి శబ్దం వినిపించగానే పరిగెత్తుకుంటూ పోయి ఏ బండి పోతుందో కనిపెట్టుడు చిన్నప్పటి ఒక అలవాటు మాకు! పొద్దుగాల పొద్దుగాల ఒంగోలు పాసెంజరు నుండి రాత్రి మద్రాసు పోయే సర్కారు ఎక్సప్రెస్స్ దాకా బండ్లను లెక్కపెట్టుడు చిన్నపటి ఒక సరదా! PC: Indian Railways. వచ్చిపోయే అన్ని బండ్లలో…





