-
ఎయిర్ ఇండియా ఢిల్లీ ప్రయాణికులకు చివరి విజ్ఞప్తి, తమ బోర్డింగ్ పాస్ తీసుకుని 19వ గేట్ దెగ్గరికి వెళ్లవలెను అని చివరి సారి హెచ్చరించింది అక్కడున్న విమానాశ్రయ సిబంది. అప్పటికే సగం నిద్రలోఉన్న నేను, నా బ్యాగును మరొక్కసారి సర్దుకుని విమానం ఎక్కడానికి చిన్న చిన్న అడుగులు వేసాను. చలికాలం కావడంతో నా జాకెట్ పూర్తిగా ధరించి, నిదానంగా విమానంలోకి చేరుకున్నాను. అప్పడు సమయం సుమారు రాత్రి ఎనిమిది కావస్తున్నది. నల్లరంగు ఎలా ఉంటుందో నాకు ఆ…
-
ETH Zürich యూనివర్సిటీ, స్విట్జర్లాండ్ లో ఐన్ స్టీన్ ఇరవై సంవత్సరాల వయసు విద్యార్థిగా ఉన్నపుడు ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ తన ఆఫీసుకు రమ్మని ఐన్ స్టీన్ కు కబురు పెట్టాడు. ఏదో జరగబోతుంది అని ఐన్ స్టీన్ కు భయం వేసింది. కొంత సేపటి తరువాత ఆఫీసుకు వచ్చిన ఐన్ స్టీన్ తో “నువ్వు ఫిజిక్స్ కోర్స్ హాజరు కానందుకు, మరియు అందులో తక్కువ మార్కులు వచ్చినందుకు”నిన్ను ఫెయిల్ చేస్తున్నాను అని చెప్పాడు[1] . దీనికి కారణం…
-
1916 లో ఆల్బర్ట్ అయిన్‌స్టయిన్ తాను దశాబ్దం పాటు శ్రమించి కనిపెట్టిన సాధారణ సాపేక్షత సిద్ధాంతమును (theory of relativity) ఈ ప్రపంచానికి ప్రతిపాదించాడు. అతని సిద్ధాంతము gravitation and space time curvature గురించి వివరిస్తుంది (దీని గురించి వివరణ ఇప్పుడు అప్రస్తుతం). ఆ రోజుల్లో ఖగోళ శాస్త్రవేత్తలకు అంతుచిక్కని బుధుడి కక్ష్య (orbit of mercury) గణనలో ఉన్న చిన్న అస్థిరతను (44 నిమిషాలు) ఆల్బర్ట్ అయిన్‌స్టయిన్ తన సాధారణ సాపేక్షత సిద్ధాంతం ద్వారా…
-
మీరు ఒప్పుకుంటే మిమల్ని పెళ్ళిచేసుకోవాలని అనుకుంటున్నా అని మా కాలేజీ జూనియర్ ఒక అమ్మాయితో చెప్పాను. పెద్దగా తనతో పరిచయం లేని నేను, అలా మాట్లాడేసరికి, తను ఒక్కసారి నా వంక కింగ్ కాంగ్ సినిమాలో మొదట హీరోయిన్ కింగ్ కాంగ్ ను చూసి ఎలా షాక్ అయ్యిందో , నా వంక తను కుడా అలానే చూసినట్టు నాకు అనిపించింది. అసలు విషయం ఏమిటంటే, నేను ఎం.టెక్ అయినా తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. చాలా రోజులనుండి ఆ…
-
సంవత్సరం: 1991 నగరం : అంగెల్స్ (Angeles), ఫిలిపైన్స్ ( Philippines ) ఇద్దరు యువకులు, జేవియర్ మరియు పింటో వారి ఇంటి ఆవరణలో ఎంతో సంతోషంగా ఫుట్ బాల్ ఆడుకుంటువున్నారు. ఈ విశ్వం లోతుపాతులు గ్రహించలేని లేత వయసు వారి ఇరువురిది. ఆ లేత వయసులో వారి స్నేహం, అటవీ తేనెగూడు లోని స్వచ్ఛమైన తేనె వలే, నైరుతి రుతుపవనాలు ద్వారా జాలు వారిన తొలకరి చినుకు వలే, స్వచ్ఛమైన స్నేహం! ఇంతలోనే Pinatubo పర్వతం…
-
ముందుగా ఎమ్మెస్సీ ఫిజిక్స్ పూర్తి చేసినందుకు మీకు అభినందనలు. పీహెచ్డీ చేయాలనీ అనుకోవడం చాలా మంచి నిర్ణయం. సగటు పీహెచ్డీ విద్యార్థిగా నేను మీ నిర్ణయంతో పూర్తిగా ఏకీభవిస్తాను. ముందుగా పీహెచ్డీ గురించి నాకు తెలిసినది నేను ఇక్కడ ప్రస్తావిస్తాను. పీహెచ్డీ చేయాలి అనే నిర్ణయం కంటే ముందు: మీకు సైన్స్ మీద పూర్తిగా ఆసక్తి , మంచి బేసిక్స్ , జ్ఞానం సంపాదించడమే కాక సైన్స్ యొక్క సరిహద్దులను విస్తరింపచేయాలనే తపన (push science boundaries),…
-
శర్వానంద్: చంపు ….. ఇంకా నిజమేంటో తెలియని భ్రమలో ఉన్నాను….నిజాన్ని జీర్ణించుకునే లోపు చంపు! చావుకన్నా నిజమే భారమని వదిలేస్తున్నావా? పాతికేళ్ళు నువ్వు చేసిన పాపాన్ని, చేసిన గూటిలోనే పాతిపెట్టావ్….. ఎన్ని పురాణాలూ వెతికిన నిన్ను తెలగొట్టే పాత్రలేదు. నీకు తీర్పు ఇచ్చే శాశనం లేదు. సాయి కుమార్: ఒక్కసారి ఆ పురాణాలూ దాటివచ్చి చూడు, అవసరాలకోసం దారులు తొక్కే పాత్రలు తప్ప, హీరోలు విలన్లు లేరు ఈ నాటకం లో! మనిషిలో కూరుకుపోయిన ధర్మం ఒక్కటే ….. అహం… ప్రతి…
-
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చాలా ప్రశ్నలు నన్ను నిద్రపట్టకుండా చేసేవి. అందులో ముఖ్యమైనవి ప్రేమ, ఆకర్షణ, పెళ్లి, జీవితం, కామం (సెక్స్), స్వేచ్ఛ. నేను చిన్నప్పటినుండి క్రిస్టియన్ స్కూల్లో చదివాను. నేను మా సిస్టర్స్ (sisters/nuns) ని అడిగిన ప్రశ్నలు వారిని కూడా నిద్రపట్టనివ్వకుండా చేసాయి అని చాలా సార్లు నాతో చెప్పారు కూడా. మా నాన్నగారికి కంప్లైంట్స్ కూడా చేసారంట (విశ్వసనీయమైన సమాచారం మేరకు! “మా అమ్మగారి ద్వారానే లెండి”). ఒక సందర్భంలో ఒక…