Category: Telugu Articles

  • పాతిక పంచాయతీ గంటలు :

    మన పక్క వీధిలో సారమ్మ చనిపోయింది రఘుమామ, కాస్త అ సూరిగాడు ఎక్కడ ఉన్నాడో కనుక్కో, మన పంచాయతీ బండలో 60 గంటలు కొట్టారు. పాపం 60 ఏళ్లకే కాలం చేసింది సారమ్మ, మనవళ్ళు పెళ్లి చూసుకోలేకపోయింది అని రఘుమామతో చెప్పింది లక్ష్మి. రాయుడి గారి పని మీద సూరిగాడు పొద్దునే పట్నంకి వెళ్ళాడు లక్ష్మి, ఇంకో గంటలో వచ్చేతాడులే, రాగానే అటు దిక్కు పంపిస్తా అని లక్ష్మితో అన్నాడు రఘుమామ. రఘుమామ ఊళ్ళో పెద్ద మనిషి,…

  • ఎప్పటికైనా?

    ఒక రొజు ఆఫీసులో బాగా అలసిపోయి పట్నం చివరిలో విమానాశ్రయం దగ్గర ఉన్న ఒక ప్రదేశానికి ఏకాంతంగా గడపడానికి వెళ్ళాను. ఊరి చివర్లో ఒక చిన్న అడవి, అ అడవి అవతలి పక్క విమానాల రన్వే. అ అడవి లోపలకు వెళ్లి ఒక చెట్టుకింద కూర్చుని, వచ్చి పోయే విమానాలను చూస్తూ ఉండడం నాకు అలవాటు. నేను ఏకాంతంగా ఉన్నా, నన్ను నిరంతరం తాకుతూ తనలో ఒక భాగం చేసుకునేది అ చల్లటి అడవి గాలి. అలా…

  • జర్మనీ లో విద్య ఉచితమా?

    ఇక మొదటి పాయింట్ మీద కొంచెం సేపు మనం మాట్లాడుకుందాం: జర్మనీలో ప్రభుత్వ స్కూల్స్ , కాలేజీలలో చదివే విద్యార్థులకు ఫీజులు ఎక్కువ ఉండవు. స్కూల్స్ లో ఉచిత విద్య ఉన్నా , కాలేజీ లెవల్లో కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటి గమనించాలి. ప్రభుత్వ యూనివర్సిటీలలో మాత్రమే విద్య ఉచితం, కానీ ప్రైవేట్ యూనివర్సిటీలలో ఎక్కువ మొత్తం ఫీజులు కట్టాల్సిందే. జర్మనీ ప్రజల తత్వం ప్రకారం, విద్య అనేది ఒక non-commercial…

  • స్వీయ మూల్యాంకనం!

    ఎటువంటి పరిస్థితులలోనూ మీరు తప్పకుండా పాటించేవి, మీకు మీరే పెట్టుకున్న నియమాలు ఏమిటి? నా అంతరాత్మ: మాస్టారు, సమయం వచ్చింది, ఇక మోగించండి…. భలే మంచి ప్రశ్న. చాలా నియమాలు పెట్టుకున్నాను అండి. అందులో కొన్ని ముఖ్యమైనవి మీ ముందుకు తీసుకువస్తాను. నా అంతరాత్మ: ముందుకి తీసుకురావడానికి నువ్వేమన్నా TV9 యాంకర్ వా , తెలుగు చలన చిత్ర నిర్మాతవా? ఎక్కువ చేయకుండా ముందు మొదలెట్టు…. నా అంతరాత్మ: నీకు అంత సీను ఉందారా? శుక్రవారం సాయంత్రమే…

  • ఓ తాబేలు కుందేలు కథ !

    ఓయ్ తాబేలు నాతో పరుగు పోటీకి వస్తావా? నువ్వు పోటీలో గెలిస్తే ఈ అడివిలో నీకు ఏంకావాలన్న ఇస్తాను. మరి నీవు పోటీకి సిద్దమేనా అని సవాలు విసిరింది కుందేలు. ఈ కుందేలు గాడు నాకే సవాలు విసురుతాడా? నన్నే సవాలు చేసి నా అహాన్ని దెబ్బతీస్తాడా? ఈ కుందేలు గాడి సంగతి ఏంటో చూదాం అని సవాలును స్వీకరించింది తాబేలు. కుందేలు మరియు తాబేలు పరుగు పందెం నియమాలు మాట్లాడుకుని, ఎవరైతే ఆ చివరి గీత…

  • ఎల్నినో అంటే ఏమిటి? అది భారతదేశ వాతావరణంపై చూపే ప్రభావము ఏమిటి?

    ఈ చిత్రాన్ని మన మనసులో ఉంచుకుని ఈ సమాధానాన్ని క్షున్నంగా పరిశీలిదాం …. కొన్ని ప్రత్యేకమైన సంవత్సరాలలో పసిఫిక్ మహాసముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ స్థితి కంటె బిన్నంగా పరిణామం చెందుతాయి. ఈ ప్రక్రియలో సముద్రపు ఉపరితలం మీద జరిగే మార్పులను ఎల్నినో ఆసిలేషన్స్ (ENSO Oscillations), లేదా సథరన్ ఆసిలేషన్స్ (Southern Oscillations) అని వాతావరణ శాస్త్రవేత్తలు సంబోధిస్తారు. పసిఫిక్ సముద్రపు సాధారణ వాతావరణ పరిస్థితి: ఈ ఎల్నినోని మనం అర్ధం చేసుకోవాలంటే ముందుగా మనం పసిఫిక్ సముద్ర ఉపరితల సాధారణ…

  • What is Weather and Climate?

    వాతావరణానికి(weather), వాతావరణ పరిస్థితికి(climate) మధ్య చాలా వ్యత్యాసం ఉంది. రోజూ వారి జీవితంలో మనం అనుభవిస్తున్న వాతావరణాన్ని weather అని అంటాము. ఉదాహరణకు ఈ-టీవీ వార్తల్లో “ఈరోజు తిరుపతిలో రోజంతా వర్షం కురిసి అధిక శాతం వర్షపాతం నమోదయింది” అని చదువుతారు. అంటే ఈరోజు తిరుపతిలో వాతావరణం (weather) రోజంతా వర్షం కురవడం. అదేవిదంగా రేపు తిరుపతిలో వర్షం కొనసాగవచ్చు అనేది weather forecast . సాధారణంగా రాబోయే గంటలో, లేదా ఈరోజు , లేదా రేపు, లేక రాబోయే మూడు రోజుల వాతావరణ మార్పుని మనం weather…

  • ఓ రైలు ప్రయాణం!

    రెండు రోజుల క్రితం ఒక ప్రొఫెసర్ గారిని కలవడానికి ఫ్రాంక్ఫర్ట్ నుండి కార్ల్స్రూహే అనే ఊరికి వెళ్ళవలసి వచ్చింది. ప్రొఫెసర్ గారిని కలిసిన తరువాత అక్కడ వారి టీం సభ్యులతో పిచ్చాపాటి సమావేశం ఉదయం 10:00 గంటలకు ఉంది. నేను చేరుకోవాల్సిన ప్రదేశం ఫ్రాంక్ఫర్ట్ నుండి సుమారు గంటా పది నిమిషాల ప్రయాణం. ఉదయం ఆరు ఇంటికే లేచి కొంత చర్చించాల్సిన విషయాలు నోట్ చేసుకొని ఉదయం 08:00 గంటలకు రైలు ఎక్కాను. ఇక్కడ కోవిడ్-19 పరిస్థితులు…

  • మన ప్రేమలో మనం!

    ఒకవేళ మనం జీవిత పాఠాలు త్వరగా నేర్చుకోకపోతే, జీవితమే కఠినమైన రీతిలో మనకు పాఠాలు నేర్పుతుంది — ఇది ఇంటర్మీడియట్లో చాలా మర్యాదపూర్వకమైన భాషలో నా డైరీలో రాసుకున్నది. కానీ యవ్వన వయసులో నా అంతరంగం నాకు చెప్పిన మాట — “నీ జీవితం నీకు సరదా తీరుస్తుందిరా నా బట్టా” అని. ఇంతకీ నాకు అప్పుడు ఎందుకు అలా అనిపించింది? సమయానికి తిండి పెట్టె తల్లితండ్రులు ఇబ్బందుల్లో ఉన్నపుడు, మార్కుల కోసం కాదు పిల్లల జీవితం…

  • మా కుటుంబ పూర్వికులు

    నా కుటుంబ పూర్వీకుల గురించి, వారు వలస వెళ్లిన ఊర్ల గురించి, కొన్ని రోజుల నుండి నేను చాలా లోతుగా ఆలోచిస్తూ ఉన్నాను. థాంక్స్ టూ Quora! మా కుటుంబ వివరాలలోకి కొంచెం లోతుగా పరిశీలించగా నాకు కొన్ని విషయాలు అర్ధం అయ్యాయి. బహుశా నేను మీకు చెప్పే విషయాలు ఖచ్చితమైనవి కాకపోవచ్చు, కానీ నా అభిప్రాయాలని బలపరచడానికి నాకు కొన్ని ఆధారాలు ఉన్నాయి. మా పూర్వికులలో ఒక బామ్మ గారి పేరు ఆర్ది, ఇంకో బామ్మ…