Author: Praveen Kumar
-
భూమి వేడిగా అంతరిక్షం చల్లగా …..
భూమి మీద వాతావరణం సూర్యుడి ద్వారా వేడెక్కుతుంది అన్నది నిజం. కానీ మీరు ఈ ప్రశ్నలో ఊహించినట్టు సూర్యుని కిరణాలు ముందు అంతరిక్షమును తాకి తరువాత భూమీ మీద వాతావరణాన్ని తాకుతాయి కాబట్టి, అంతరిక్షంలో ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండి, కిందకు, అంటే భూమి మీదకు వచ్చేసరికి ఉష్ణోగ్రతలు తగ్గాలి అనే ఊహ సాధారణంగా అందరికి రావచ్చు. కానీ ఇందులో వాస్తవం లేదు. మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మన భూమి ఉపరితలం మీద సగటు ఉష్ణోగ్రత…
-
సునామి
డబ్ల్యు. జే. మోర్గాన్ మన భూగోళపు అశ్మావరణ౦ ఏడు పెద్ద పలకలుగా విభజించబడినది అని, ఈ ఏడు పెద్ద పలకల (or 10 small plates) మధ్య స్థిరమైన కదలికలు ఉన్నవని 1967 లో పలక విరూపణ సిద్ధాంతం (Plate Tectonic Theory) ద్వారా తలియచేసారు. సాధారణంగా పలకల కదలికల ద్వారా ఏర్పడిన తీవ్రమయిన వత్తిడి వలన భూకంపాలు సంబవింస్తాయి అని మనకు తెలిసిన విషయమే. వివరాలకోసం ఈ సమాధానం చుడండి (అగ్నిపర్వతం ఎలా ఏర్పడుతుంది? చివరకు…
-
ఖగోళ శాస్త్రవేత్తలు
క్రీస్తు పూర్వం కొన్ని దశాబ్దాలదాకా భూమి చదునుగా (flat) ఉంటుందని నమ్మేవారు. గ్రీకు రాజ్యానికి చెందిన పైథాగరస్ (Pythagorus) భూమి గుడ్రంగా ఉంటుందని గ్రహణముల ఆధారంగా కనుగున్నారు. ఇది మానవులు ప్రపంచాన్ని చూసే దృక్కోణము మార్చివేసింది. చిత్ర మూలం: వికీపీడియా క్లాజుడిస్ టోలెమీ (Tolemy) 2 AD (క్రీస్తు తర్వాత రెండో దశాబ్దంలో), జియోసెంట్రిక్ థియరీ (Geocentric theory) , అంటే మన భూమి విశ్వం మధ్యలో ఉండి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు భూమి చుటూ గుండ్రంగా తిరుగుతున్నాయి అని ప్రతిపాదించాడు….
-
మా స్నేహితుడి పెళ్లికని వెళ్లి ….
నా స్నేహితుడు ఒక రోజు పొద్దున్నే ఫోన్ చేసాడు, “నా పెళ్లి కుదిరిందిరా, నువ్వు తప్పకుండ రావాలి, అనూకి కూడా చెప్పాను, ఇద్దరు టికెట్స్ బుక్ చేసుకోండి” అని చెప్పాడు. నేను, వాడు, అనూ ఎంటెక్ క్లాసుమేట్స్. మేమందరం మంచి స్నేహితులం. పీహెచ్డీ చేయడానికి నేను అనూ జర్మనీకి వచ్చాం, వాడు మాత్రం ఇండియాలోనే పీహెచ్డీ చేస్తున్నాడు. అప్పటికి నేను అనూ ఒకరినొకరం ఇష్టపడుతున్నాం. కానీ అనూ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నేను నచ్చకపోవడంతో నన్ను వద్దు…
-
FLAMES
నేను పదో తరగతిలో ఉన్నపుడు ఒక రోజు నా స్నేహితుడు హడావిడిగా వచ్చాడు. ఏమైందిరా అంత హడావిడిగా ఉన్నావ్ అని వాడిని అడిగాను. వాడు, అరేయ్ నీకు ఒకటి చూపించాలిరా, ఇప్పుడే నేర్చుకుని వచ్చా. వాడి హడావిడి చూసి, అబ్బో వీడేదో చాలా గొప్ప విషయం నేర్చుకుని వచ్చాడు అనుకున్నా. వాడు, అరేయ్ నీ పూర్తి పేరు చెప్పు అని అడిగాడు. నేను ప్రవీణ్ కుమార్ అని చెప్పాను. వాడు చాలా ఏకాగ్రతతో ఒక పేపర్ మీద…
-
మేఘమథనం
నా సమాధానం కోసం మీకు కొంచెం క్లౌడ్ మిక్రోఫీసిక్స్ (cloud microphysics) పరిచయం చేస్తాను. మేఘాలు ఎలా ఏర్పడతాయి, వాటిలోని వర్షపుచుక్కలు, వడగళ్ళు, ఐస్ ఎలా ఏర్పడుతుందో క్లౌడ్ మిక్రోఫీసిక్స్ ద్వారా మనకు తెలుస్తుంది. ముందుగా చిన్న ఉదాహరణ చెప్పి క్లౌడ్ మిక్రోఫీసిక్స్ ని ప్రారంభిస్తాను. మనం ఒక పాత్రలో చల్లని నీళ్లని తీసుకుని పొయ్య మీద వేడి చేద్దాం. మీరు కొంచెం సేపు ఆగిన తర్వాత గమనిస్తే, కింద బాగా వేడి ఎక్కిన నీళ్లు పైకి బుడగలగా వస్తూవుంటాయి….
-
గ్లేషియర్స్
విశాలంగా ఏర్పడిన మంచు పలకలను మనం గ్లేషియర్స్ అని అనవచ్చు. అధిక మంచు ఒక ప్రాంతంలో కురవడం వలన గ్లేషియర్స్ ఏర్పడతాయి. ఈ గ్లేషియర్స్ చాలా నిదానంగా కదులుతూ ఉంటాయి. గ్లేషియర్స్ను కొన్ని రకాలుగా మనం విభజించవచ్చు. వ్యాలీ (Valley) గ్లేషియర్స్: ఇవి ఎక్కువగా పర్వతాలమీద ఏర్పడుతాయి. పర్వతాలు మీద మంచు ఎక్కువగా పేరుకుపోవడంతో ఆ పర్వతాల మీద మంచు పలకలు ఏర్పడతాయి. అలా కొన్ని దశాబ్దాల పాటు ఈ మంచు పేరుకుపోవడంతో కింద ఉన్న మంచు…
-
బటర్ ఫ్లై ఎఫెక్ట్ అంటే ?
కొన్ని సినిమాలలో కూడా ఈ వాక్యాన్ని వాడారు. ( ఉదాహరణకు జురాసిక్ పార్క్, నాన్నకు ప్రేమతో) (చిత్ర మూలం: A monarch butterfly in Vista, Calif. Gregory Bull/AP) ఇందులో వాస్తవం ఉందా లేదా? ఈ సమాధానంలో నేను సైన్స్ లో ఈ చర్చ ఎలా మొదలయింది, దీనిని శాస్త్రవేత్తలు ఎలా అర్ధం చేసుకున్నారు, సమాజం దానిని ఎలా అర్ధం చేసుకుందో వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రకృతిలో జరుగుతున్న అంశాలను అర్ధం చేసుకోడానికి సైన్స్ ప్రయత్నిస్తుంది….
-
తుఫానులు
ముందుగా తుఫానులు రావడానికి కారణం ఏంటో వివరించే ప్రయత్నం చేస్తాను . సముద్రము ఉష్ణ శక్తిని (heat energy) ఎక్కువ రోజులు నిలువచేసుకో కలిగే సామర్థ్యం కలిగి ఉంది (కొన్ని సంవత్సరాలు). అలాగే మన వాతావరణం కూడా ఉష్ణ శక్తిని నిలువచేసుకో కలిగే సామర్థ్యం కలిగి ఉంది (కొన్ని రోజులు మాత్రమే), కానీ సముద్రంతో పోలిస్తే మన వాతావరణం ఉష్ణ శక్తిని ఎక్కువ రోజులు నిల్వ చేసుకోలేదు. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం, చలి కాలంలో…
-
బిగ్ బాస్ సర్కస్
సర్కస్ కి జనాలు ఎక్కువ మంది రావడం మానేశారు : అనగనగా ఒక సర్కస్ లో పెద్ద ఇల్లు కట్టారు. ఆ ఇంటికి ఒక యజమానిని మరియు ఒక కాపలాదారుడిని ఆ సర్కస్ యజమానులు నియమించారు. ఆ యజమాని పేరు “పెద్ద అయ్యా” ! ఈ మధ్య సర్కస్ కి జనాలు ఎక్కువ మంది రావడం మానేశారు అని ఆ యజమానులు ఒక వినూత్న ప్రయత్నం చేసారు. అదేమిటంటే, ఆ పెద్ద ఇంటికి ఒక పది కోతులను రప్పించీ,…