Author: Praveen Kumar

  • వాతావరణ నమూనాలు

    వాతావరణ నమూనాలను రెండు విధాలుగా విభజించవచ్చు. ముందుగా Weather Models (స్వల్పకాలిక వాతావరణ నమూనాలు) గురించి రెండు ఉదాహరణల ద్వారా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను: 1999వ సంవత్సరం అక్టోబర్ 29 నా ఒడిశా రాష్ట్రమును ఒక పెను తుఫాను అల్లకల్లోలం చేసింది. సుమారు గంటకు 260 కిలోమీటర్ల వేగంతో ఈదురులుగాలీ, భారీగా వర్షపాతం, పిడుగులు, సముద్రపు నీళ్లు (storm surge) ముందుకు రావడంతో భారీగా ప్రాణనష్టం జరిగింది. కరెంటు తీగలు తెగిపోవడం, చెట్లు కింద పడిపోవడం, రోడ్లు, ఇళ్లు…

  • నా జీవితం లో ఒక సినిమా

    ఒక రోజు యధావిధిగా నా పనిలో పడిపోయా ఆఫీస్ లో. అప్పుడు ఒక ఇ-మెయిల్ వచ్చినట్టు గమనించా. ఇ-మెయిల్ (e-mail): మీరు మాకు పంపిన సైంటిఫిక్ పేపర్ (science paper) మా సమావేశంలో చర్చించడానికి మిమ్మలను ఆహ్వానిస్తున్నాం. ఈ సమావేశం ఫ్రాన్స్-పారిస్ (France-Paris) నగరంలో జరుగుతుంది. మీకు హోటల్ మరియు ట్రావెలింగ్ అలోవెన్సు (traveling allowance) మేమె ఇస్తాం అని ఉoది. సమావేశం చాలా పెద్దది మరియు పారిస్ నగరంలో జరుగుతుంది కనుక ఒక మంచి అవకాశంగా భావించి, నేను వస్తాను,…

  • గురుత్వాకర్షణ శక్తి

    ఈ సమాధానం కోసం, ఖగోళశాస్త్రం కు సంబందించిన ఇద్దరు ప్రముఖ శాస్త్రవేత్తలు (వీరు మనందరికీ సుపరిచితులే ) ప్రతిపాదించిన సిదంతాలను మీ ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. ఐజాక్ న్యూటన్ 1687 వ సంవత్సరం లో గురుత్వాకర్షణకు సంబంధించిన సిద్ధాంతమును Philosophiæ Naturalis Principia Mathematica అనే గ్రంధములో పొందుపరిచారు. మాస్( ద్రవ్యరాశి) ఉన్న ప్రతీ పదార్ధము, ఇతర పదార్థములను ఆకర్షిస్తుంది, ఈ ఆకర్షణనే గురుత్వాకర్షణ శక్తి అని న్యూటన్ ప్రతిపాదించారు. గురుత్వాకర్షణ శక్తి రెండు పధార్ధాల యొక్క…

  • ఐ హేట్ యు వంశి !

    మంచు కరిగి, నీరుగా ప్రవహించి, ఒక పంటను నిలబెట్టి నట్టు, కరిగిపోతున్న తన జీవితానితో పోరాడుతూ, తన స్నేహితుల జీవితాలను తీర్చిదిద్దిన ఒక మహిళతో నన్ను ప్రేమలో పడేసారు! మీ మంచు పల్లకి నా గుండెల్లో ఇంకా కరగలేదు! పంజరంలో (కోటలో ) చిలుక (రాజకుమారి) స్వేచ్చకు సంకెళ్ళు వేసిన తన కుటుంభ పరువు ప్రతిష్టలను బద్దలుకొట్టడానికి వచ్చిన పగటి వేషగాడు, వాళ్ళిద్దరి మధ్యలో వెలసిన ప్రేమ, ఒక మహా కావ్యం సార్! రాజకుమారిని మాకు సీతార గా చూపించి, మీ అద్భుతమయిన…

  • మా రైలు ప్రయాణం లో రెండు నిముషాల నిశ్శబ్దం

    మీరు పాకిస్థాన్ నుండా? లేదు ఇండియా నుండి! మా రైలు ప్రయాణం లో రెండు నిముషాల నిశ్శబ్దం. మూడు సంవత్సరాల క్రితం నేను, మా శ్రీమతిగారిని కలవడానికి, ఫ్రాంక్ఫర్ట్ (Frankfurt am Main) నుండి తను పీహెచ్డీ చేస్తున్న నగరం హాంబర్గ్ (Hamburg) కి బయలుదేరా. ప్రయాణ సమయం సుమారు నాలుగు గంటలు. రైలు బయలుదేరే అయిదు నిముషాల ముందు రైల్వే స్టేషన్ కు చేరాను. నేను ఎక్కవలసిన రైలు ఏ ప్లాట్ఫారం మీద ఉందొ చూసుకుని,…

  • నా జీవితాన్ని సమూలంగా మార్చిన బాల్యపు సంఘటన

    నేను ఎడొవ తరగతి చదువుతున్నపుడు, మా స్కూల్ టీచర్ నాతో, మీ నాన్న గారు స్కూలు కీ వచ్చారు, ప్రిన్సిపాల్ తో మాట్లాడుతున్నారు, కొంత సేపు తరువాత టీచర్స్ మీటింగ్ కు మన ప్రిన్సిపాల్ గారు మా అందరిని పిలిచారు అని చెప్పారు. నాకు భయం మొదలయింది. అక్కడ ఏమి జరుగుతుందో నాకు అర్ధం కాలేదు. మా నాన్నగారు రావడం ఏంటి, మా ప్రిన్సిపాల్, టీచర్స్ మీటింగ్ కు పిలవడం ఏంటి అని! ఉదయం నుండి మధ్యాహ్నం…

  • Blacky ప్రేమ

    నా 14వ ఏట, నా స్నేహితుడి ఇంట్లో ఉన్న పావురాలు నాకు చాల నచ్చాయి. పావురాలు కోసం నా స్నేహితుడు, వాళ్ళ ఇంటి ముందు ఉన్న పెద్ద చెట్టుకి డబ్బాలు అమర్చాడు (వాటికి గూడు లాగ). ఆ చెట్టుపైన పావురాలు చాల ఉండేవి. అవి ఎంత దూరం ఎగిరినా తిరిగి మల్లి వాడి ఇంటికి చేరేవి. మా నాన్నగారిని ఒప్పించి ఒక జత పావురాలని (చిన్న పిల్లలు) మా ఇంటికి తెచ్చాను. అందులో ఒక నల్లని పావురం…

  • విమాన ప్రయాణాల్లో టర్బులెన్స్

    ద్రవం (fluid) యొక్క గమనాన్ని రెండు విధాలుగా విభజించవచ్చు. 1. లామినార్ ఫ్లో (Laminar Flow) 2. టర్బులెంట్ ఫ్లో (Turbulent flow) లామినార్ ఫ్లో యొక్క గమనం చాల స్మూత్ గా, స్థిరముగా ఉంటుంది (smooth and steady). టర్బులెంట్ ఫ్లో యొక్క గణమం స్థిరముగా ఉండదు, చాల గజి బిజిగా (erratic and chaotic) ఉంటుంది. రేయినాల్డ్స్ (Reynolds) అనే పరిశోధకుడు ఈ రెండు ఫ్లోల మధ్య తేడాను గమనించారు. ఒక ఫ్లో లామినార్ లేదా టర్బులెంట్…

  • ఓ జీవిత సత్యం

    హరిత ఆదివారం సాయంత్రం లేడీ బర్డ్ సైకిల్ మీద తన తాతగారిని కలవడానికి వెళ్తుంది. ఆదివారం సాయంత్రం కావడంతో చాల మంది జనాలు చల్లని సముద్రపు గాలి కోసం బీచ్ రోడ్ కి చేరుకున్నారు. ఐస్ క్రీం బండ్లతో, బుడగలు అమ్మేవారితో, గులాబీ పూలు అమ్మేవారితో, మసాలా మురి చేసేవాళ్ళతో కిటకిటలాడుతోంది బీచ్ రోడ్. సినిమా షూటింగ్ కూడా జరుగుతుండడం తో ఏగిరిఏగిరి చూస్తున్నారు కొంత మంది జనాలు. హరితకి తెల్లరంగు అంటే బాగా ఇష్టం. అందుకని…

  • తుఫాన్ల పేర్లు

    1990 సంవత్సరం బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను మచిలీపట్నంను తాకి అల్లకల్లోలం చేసింది. ఆ తుఫాను పేరు TC 02B. కాకినాడ తీరమును 1996 సంవత్సరంలో మరో తుఫాను తాకింది. దాని పేరు 07B. ఈ రెండు తుఫాన్లు మనకు గుర్తులేవు. కాని హుద్ హుద్ (HudHud) తుఫాను లేదా ఫైలిన్ (Phailin) తుఫాను అంటే గుర్తొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అంకెలు కన్నా మనకు పేర్లు బాగా గుర్తుంటాయి కనుక. 1990 సంవత్సరం నుండి ప్రపంచ వాతావరణ…