-
నేను పదో తరగతిలో ఉన్నపుడు ఒక రోజు నా స్నేహితుడు హడావిడిగా వచ్చాడు. ఏమైందిరా అంత హడావిడిగా ఉన్నావ్ అని వాడిని అడిగాను. వాడు, అరేయ్ నీకు ఒకటి చూపించాలిరా, ఇప్పుడే నేర్చుకుని వచ్చా. వాడి హడావిడి చూసి, అబ్బో వీడేదో చాలా గొప్ప విషయం నేర్చుకుని వచ్చాడు అనుకున్నా. వాడు, అరేయ్ నీ పూర్తి పేరు చెప్పు అని అడిగాడు. నేను ప్రవీణ్ కుమార్ అని చెప్పాను. వాడు చాలా ఏకాగ్రతతో ఒక పేపర్ మీద…
-
నా సమాధానం కోసం మీకు కొంచెం క్లౌడ్ మిక్రోఫీసిక్స్ (cloud microphysics) పరిచయం చేస్తాను. మేఘాలు ఎలా ఏర్పడతాయి, వాటిలోని వర్షపుచుక్కలు, వడగళ్ళు, ఐస్ ఎలా ఏర్పడుతుందో క్లౌడ్ మిక్రోఫీసిక్స్ ద్వారా మనకు తెలుస్తుంది. ముందుగా చిన్న ఉదాహరణ చెప్పి క్లౌడ్ మిక్రోఫీసిక్స్ ని ప్రారంభిస్తాను. మనం ఒక పాత్రలో చల్లని నీళ్లని తీసుకుని పొయ్య మీద వేడి చేద్దాం. మీరు కొంచెం సేపు ఆగిన తర్వాత గమనిస్తే, కింద బాగా వేడి ఎక్కిన నీళ్లు పైకి బుడగలగా వస్తూవుంటాయి….
-
విశాలంగా ఏర్పడిన మంచు పలకలను మనం గ్లేషియర్స్ అని అనవచ్చు. అధిక మంచు ఒక ప్రాంతంలో కురవడం వలన గ్లేషియర్స్ ఏర్పడతాయి. ఈ గ్లేషియర్స్ చాలా నిదానంగా కదులుతూ ఉంటాయి. గ్లేషియర్స్ను కొన్ని రకాలుగా మనం విభజించవచ్చు. వ్యాలీ (Valley) గ్లేషియర్స్: ఇవి ఎక్కువగా పర్వతాలమీద ఏర్పడుతాయి. పర్వతాలు మీద మంచు ఎక్కువగా పేరుకుపోవడంతో ఆ పర్వతాల మీద మంచు పలకలు ఏర్పడతాయి. అలా కొన్ని దశాబ్దాల పాటు ఈ మంచు పేరుకుపోవడంతో కింద ఉన్న మంచు…
-
కొన్ని సినిమాలలో కూడా ఈ వాక్యాన్ని వాడారు. ( ఉదాహరణకు జురాసిక్ పార్క్, నాన్నకు ప్రేమతో) (చిత్ర మూలం: A monarch butterfly in Vista, Calif. Gregory Bull/AP) ఇందులో వాస్తవం ఉందా లేదా? ఈ సమాధానంలో నేను సైన్స్ లో ఈ చర్చ ఎలా మొదలయింది, దీనిని శాస్త్రవేత్తలు ఎలా అర్ధం చేసుకున్నారు, సమాజం దానిని ఎలా అర్ధం చేసుకుందో వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రకృతిలో జరుగుతున్న అంశాలను అర్ధం చేసుకోడానికి సైన్స్ ప్రయత్నిస్తుంది….
-
ముందుగా తుఫానులు రావడానికి కారణం ఏంటో వివరించే ప్రయత్నం చేస్తాను . సముద్రము ఉష్ణ శక్తిని (heat energy) ఎక్కువ రోజులు నిలువచేసుకో కలిగే సామర్థ్యం కలిగి ఉంది (కొన్ని సంవత్సరాలు). అలాగే మన వాతావరణం కూడా ఉష్ణ శక్తిని నిలువచేసుకో కలిగే సామర్థ్యం కలిగి ఉంది (కొన్ని రోజులు మాత్రమే), కానీ సముద్రంతో పోలిస్తే మన వాతావరణం ఉష్ణ శక్తిని ఎక్కువ రోజులు నిల్వ చేసుకోలేదు. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం, చలి కాలంలో…
-
సర్కస్ కి జనాలు ఎక్కువ మంది రావడం మానేశారు : అనగనగా ఒక సర్కస్ లో పెద్ద ఇల్లు కట్టారు. ఆ ఇంటికి ఒక యజమానిని మరియు ఒక కాపలాదారుడిని ఆ సర్కస్ యజమానులు నియమించారు. ఆ యజమాని పేరు “పెద్ద అయ్యా” ! ఈ మధ్య సర్కస్ కి జనాలు ఎక్కువ మంది రావడం మానేశారు అని ఆ యజమానులు ఒక వినూత్న ప్రయత్నం చేసారు. అదేమిటంటే, ఆ పెద్ద ఇంటికి ఒక పది కోతులను రప్పించీ,…
-
సంజయ్ తన జీవితంలో మొదటి సారి ఊరుని వదిలి ఇంజనీరింగ్ చదువు కోసం హైదరాబాద్ నగరానికి చేరుకున్నాడు. మొదటి రోజు కళాశాల చాలా కొత్తగా అనిపించింది. ఉరుకుల పరుగుల జీవనంతో ఏదో కొత్తలోకంలోకి వచ్చిన అనుభవం. సంజయ్ ఎప్పుడు ఒంటరితనాన్ని ఇష్టపడేవాడు, ఎక్కువ మాట్లాడడు. ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎంతో నిదానంగా ఆలోచించే వ్యక్తి. ఇంజనీరింగ్ చదువుకంటే సాహిత్య పుస్తకాలంటే మక్కువ. చివరి బెంచులో కూర్చుని చదువుకుంటూ వుంటాడు. సంజయ్ ని ఒక సంవత్సరం పాటు…
-
మన దేశం అంటార్కిటికా వాతావరణ పరిస్థితుల మీద పరిశోధన జరపడానికి నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ రీసెర్చ్ సంస్థను గోవా నగరం లో స్థాపించింది. మన దేశంలోని శాస్త్రవేత్తలు అంటార్కిటికా లో మనం ఏర్పరుచుకున్న రెండు శాస్త్రీయ ప్రయోగశాలలు “భారతి” మారియు “మైత్రి” లకు వెళ్లి ప్రతీ సంవత్సరం పరిశోధనలు జరుపుతుంటారు. మీకు ఆసక్తి ఉంటె ఈ పేజీ ని చదవవచ్చు, (NATIONAL CENTRE FOR POLAR AND OCEAN RESEARCH). అంటార్కిటికాలో అంత తక్కువ ఉష్ణోగ్రతలు…