చిన్నవయసులో నాకు కొన్ని సార్లు స్కూల్ కి వెళ్లాలంటే భయం వేసేది. సాధారణంగా స్కూల్ లో బాగా చదివేవారికి, లేదా ఆటల్లో , డాన్స్ లలో , నాటకాల్లో బాగా ఉత్సాహంగా పాల్గొనేవారికి ఎక్కువ అటెంషన్ ఉండడం, వారికి ఒక ఐడెంటిటీ ఉండడం చాలా సాధారణం. కానీ నాకు పెద్దగా ఇలాంటివి ఏవి లేకపోయినందువలన నాకంటూ ఒక ఐడెంటిటీ ఎప్పుడు ఉండేది కాదు. అందుకని కొన్ని సార్లు నాకు స్కూల్ లో ఆత్మనూన్యతా భావం ఎక్కువగా కలిగేది.
కానీ మనకంటూ ఐడెంటిటీ ఉండాలని మన సామాజం మనకు ఎప్పుడు చెపుతుంది. నా అనుభవంలో మనకంటూ ఒక ఐడెంటిటీ లేకపోతే ఈ సమాజం మనలను ఆత్మనూన్యతా భావంలోకి నెట్టివేస్తుంది కూడా.
ఉదాహరణకు, మన ఉద్యోగాన్ని బట్టి ఈ సమాజం ఒక ఐడెంటిటీ ఇస్తుంది, లేదా జీతం బట్టి , లేదా సమాజంలో మన స్థాయిని బట్టి, మనం కొన్న ఇల్లుని బట్టి , కారును బట్టి మనకంటూ ఒక ఐడెంటిటీని ఇస్తుంది. కొంచెం లోతుగా ఆలోచిస్తే ఈరోజుల్లో,
“ఐడెంటిటీ = సక్సెస్ “
ఈ ఐడెంటిటీ కోసం సమాజం మొత్తం పరుగులు తీస్తుంది! కొన్నిసార్లు మన ఐడెంటిటీని ఇతరులతో పోలుస్తూ స్వయం సంతృప్తి చెందుతూ ఉంటాం కూడా!
దాదాపు నా చదువు తరువాత పది సంవత్సరాలు ఈ సమాజం డిఫైన్ చేసిన సక్సెస్ నాకు లేకపోవడం, నన్ను బాగా కృంగదీసింది. నేను ఈ ఐడెంటిటీ క్రైసెస్ తో సంవత్సరం పైగా డిప్రెషన్ కి లోనయ్యాను! అదో నరక వేదన. ఆ సంవత్సరాల ఆవేదనలో నాకు అర్ధమైంది , నిజానికి సమాజం గుడ్డిది అని, తాను డిఫైన్ చేసిన ఐడెంటిటీ కేవలం సమాజం మీద దానికి ఉండే అపనమ్మకం , భయంతోనే నని!
నా వరకు, “ఐడెంటిటీ అంటే → సెల్ఫ్ ఐడెంటిటీ”
నాకు నామీద , నా భలం-బలహీనత మీద పూర్తి అవగాహనతో నాకంటూ ఒక ఐడెంటిటీని ఏర్పరుచుకున్నాను. అందువలనే నేను ఏ పని చేసిన అది నేరుగా నా మనసు నుండి వచ్చేలానే ప్రయత్నిస్తాను . నా జీవితం అలాగే కొనసాగిస్తాను! సమాజం డిఫైన్ చేసిన ఐడెంటిటీతో నేను పోటీ పడలేను, పరిగెత్తలేను. కేవలం నాకు సంతోషాన్ని ఇచ్చే లైఫ్ బ్రతకడం నేర్చుకున్నాను.
అయితే ఒకరి సెల్ఫ్ ఐడెంటిటీ గురించి ఒకరికి ఎలా తెలుస్తుంది? అనే ప్రశ్న మీకు కలగవచ్చు.
నా దగ్గర ఈ ప్రశ్నకు కచ్చితమైన సమాధానం లేదు. మనగురించి మనం తెలుసుకునే ప్రయాణం నేను ఎన్నో సంవత్సరాలముందు మొదలుపెట్టాను. ఆ ప్రయాణంలో నా సెల్ఫ్ ఐడెంటిటీ లో చాలా లక్షణాలు నేను తెలుసుకున్నాను. మీరు మీ ప్రయాణం మొదలుపెట్టండి మరి. ఈ ప్రయాణం కోసం ఎక్కడికో పోనవసరం లేదు. సైకిల్ మీద మీకు సాధ్యమైనంత దూరం ఒక్కరే వెళ్ళండి, ఏకాంతాన్ని అనుభవించండి, మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నం మొదలు పెట్టండి అని మాత్రమే చెప్పగలను.
PS : ఒక్కరోజులో నా 100KM ప్రయాణం. జీవితం అంతా ఒక సైకిల్ ప్రయాణం అయ్యి , మనగురించి మనం ఆలోచించుకునే ఏకాతం ఉంటె ఎంత బాగుంటుందో కదా!