అగ్నిపర్వతాలు

సంవత్సరం: 1991

నగరం : అంగెల్స్ (Angeles), ఫిలిపైన్స్ ( Philippines )

ఇద్దరు యువకులు, జేవియర్ మరియు పింటో వారి ఇంటి ఆవరణలో ఎంతో సంతోషంగా ఫుట్ బాల్ ఆడుకుంటువున్నారు. ఈ విశ్వం లోతుపాతులు గ్రహించలేని లేత వయసు వారి ఇరువురిది. ఆ లేత వయసులో వారి స్నేహం, అటవీ తేనెగూడు లోని స్వచ్ఛమైన తేనె వలే, నైరుతి రుతుపవనాలు ద్వారా జాలు వారిన తొలకరి చినుకు వలే, స్వచ్ఛమైన స్నేహం! ఇంతలోనే Pinatubo పర్వతం నుండి జనాలు పరుగు పరుగున కింది వైపుకు పరుగులు తీస్తున్న సంగతి జేవియర్ మరియు పింటో గమనించారు. కొంతసేపు వరకు జేవియర్ మరియు పింటోకు అక్కడ ఏమి జరుగుతుందో అంతుచిక్కలేదు.

మనీలాలోని అగ్నిపర్వత ఇన్స్టిట్యూట్ యొక్క శాస్త్రవేత్త ప్రొఫెసర్ కెల్లీ బ్రూక్లిన్ లాబ్లో వున్న పరికరాలు గత గంట నుండి సుమారు 400 భూకంప ప్రకoపలను నమోదు చేస్తూ ఉన్నాయి. సుమారు గత 600 సంవత్సరాలనుండి చాలా ప్రశాంతంగా వున్న Pinatubo పర్వతం ఒక్కసారిగా ఇలాంటి అలజడులకు గురికావడం ప్రొఫెసర్ కెల్లీ బ్రూక్లిన్ కు ఊపిరాడనివ్వకుండా చేసింది. ప్రపంచలో అగ్నిపర్వతాలు మీద పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తల అందరికి ప్రొఫెసర్ కెల్లీ బ్రూక్లిన్ ఈ సమాచారాన్ని అందించాడు. చుట్టుపక్కల సుమారు 6 మైళ్లు దూరం లో ఉన్నవారందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించమని ఫిలిపైన్స్ ప్రభుత్వానికి కెల్లీ బ్రూక్లిన్ మరో సందేశాన్ని పంపారు, “Pinatubo పర్వతం అగ్నిపర్వతముగా మార్పుచెందడానికి మనకు బహుశా 4 రోజుల సమయమే వుంది — ప్రొఫెసర్ కెల్లీ బ్రూక్లిన్”.

తేనెగూడుకి పొగ పెట్టాక తేనెటీగలు ఎలా పరుగులు పెడతాయో, జేవియర్ మరియు పింటో వారి ఇళ్లకు కూడా అలానే పరుగు పరుగున చేరుకున్నారు. ఈలోగా జేవియర్, తన ఇంటి కిటికీ నుండి Pinatubo పర్వతం మీద అలుముకున్న నల్లని మబ్బులు, దుమ్మును చూసి తన తండ్రికి ఈ విషయం చెప్పాడు. ఒక్కసారి ఈ దృశ్యాన్ని చుసిన జేవియర్ తండ్రి, ఇల్లును ఖాళీ చేసి వారి పెద్ద లారీ లో బయలుదేరదామని, ఇంటిలో ఉన్న వారందరిని సామాన్లు సార్ధమని కోరాడు.

అసలు Pinatubo పర్వతం లోపల ఏమి జరిగింది?

ముందుగా ఒక్కసారి ఈ వీడియోను చుడండి!

ఇందులో మీరు మన భూగోళం కొన్ని దశాబ్దాలుగా ఎలా మారుతూ వస్తుందో గమనించివుంటారు. మన భారత దేశం కొన్ని వందల దశాబ్దాల క్రితం ఇప్పుడు ఎక్కడయితే ఉందొ, అప్పుడు ఇక్కడ లేదు! ఇది అన్ని దేశాలకు, ఖండాలకు వర్తిస్తుంది. దీని బట్టి మనం అర్ధం చేస్కోవాల్సిందేంటంటే మన౦ ఇప్పుడు నించున్న భూగోళం నిరంతరంగా కదలిక స్థితిలో (constant state of motion) ఉన్నది. 1967 లో డబ్ల్యు. జే. మోర్గాన్, పలక విరూపణ సిద్ధాంతం (Plate Tectonic Theory) ద్వారా మనకు ఈ విషయాన్ని తలియచేసారు. మన భూగోళపు అశ్మావరణ౦ (Lithosphere), 7 పెద్ద పలకలుగా విభజించబడినది అని, ఈ 7 పెద్ద పలకల (or 10 small plates) మధ్య స్థిరమైన కదలికలు ఉన్నవని పలక విరూపణ సిద్ధాంతం చెపుతుంది.

ఈ పలకలు కదులుతూ ఉన్నపుడు, అవి ఒకదానితో మరొకటి ఢీ కొట్టవచ్చు, లేదా ఒకదానికొకటి దూరంగా జరగవచ్చు లేదా ఒకదానికొకటి సమాంతరంగా జరగవచ్చు. ఇందువల్ల, ఈ పలకలు సరిహద్దులలో తీవ్రమైన వత్తిడి ఏర్పడుతుంది. సరిహద్దులలో జరిగే పరిణామాలని బట్టి, ఆ సరిహద్దులను పలక విరూపణ సిద్ధాంతం, అభిసరణ సరిహద్దులు (Convergent Boundary), అపసరణ సరిహద్దులు (Divergent Boundary) మరియు సమాంతర సరిహద్దులుగా (Transform Boundaries) విభజించడం జరిగింది.

ఇప్పుడు మనం అభిసరణ సరిహద్దులు గురించి తెలుసుకుందాం. మన భూగోళపు అశ్మావరణ౦ (Lithosphere) మీద ఉన్న పెద్ద పలకలు ఒకదానితో మరొకటి ఢీ కొట్టినపుడు అభిసరణ సరిహద్దు ప్రాంతం ఏర్పడుతుంది. మనం ఇప్పుడు చూస్తున్న పెద్ద పెద్ద పర్వతాలు ఈ అభిసరణ సరిహద్దు ప్రాంతంలో ఏర్పడినవే. తీవ్రమైన వత్తిడి వలన ఈ పలకలు ఒకదాని మీద ఒక్కటి జరుగుతూవున్నపుడు, కింద ఉన్న పలక అధికమైన ఒత్తిడి గురువుతూ, తీవ్రమయిన ఉష్ణోగ్రతల వలన కరుగుతుంది (high pressure/stress and temperatures). ఇందువలను భూభాగములో మాగ్మా (Magma) తయారవుతుంది. ఈ మాగ్మా (Magma) అధిక ఉష్ణోగ్రతల వలన ద్రవ స్థితికి (liquid state) చేరుకుంటుంది. ఒక పర్వతం కింద ఈ మాగ్మా (Magma) చేరుకొని, పర్వతం లో చిన్న చిన్న రంధ్రాల ధ్వారా పోగలను, విషవాయువులు వదులుతూ ఉంటుందు. భూభాగములో తీవ్రత కొన్ని వందల సంవత్సరాలనుండి పేరుకుపోవడంతో , ఒక్కసారి ఆ పర్వతం బద్దలు అయ్యి కింద ఉన్న మాగ్మా (Magma), పొగ, దుమ్ము, ధూళి బయటకు వచ్చేస్తాయి! (“మన సినిమాలో హీరో, తన సోదరిని కానీ ప్రేమికురాలిని కానీ క్లైమాక్స్ లో విల్లన్ తీసుకుపోయినప్పుడు తన గుండెల్లో అగ్ని పర్వతం ఎలా పేలుతుందో అలా అనమాట“!) .

సరిగ్గా Pinatubo పర్వతంలో ఇదే జరిగింది!

చివరిగా ……

జేవియర్ వాళ్ళ కుటుంబం పెద్ద లారీలో బయలుదేరినప్పుడు, జేవియర్ తన స్నేహితుడు పింటోని కూడా తమతో తీసుకుపోదాం అని మారం చేస్తే, జేవియర్ తండ్రి సహృదయంతో పింటో మరియు తన కుటుంబాన్ని సురక్షిత ప్రాతాలకు చేర్చారు. ఒక వారం తరువాత, మన ప్రపంచం లో రెండో అతి పెద్ద అగ్ని పర్వతం Pinatubo బద్దలయింది. జేవియర్ మరియు పింటో కొన్ని నెలలతర్వాత (పర్వతం కింద మాగ్మా అయిపోయిన తర్వాత) వారి ఇంటికి వెళ్లి చూడగానే, అక్కడన్ని ఇళ్ల శిధిలాలు, పశువుల మృతదేహాలు, కాలిపోయిన చెట్లు, దుమ్ము ధూలే మిగిలినవి అని గమనించారు! ఎంతో మంది మరణం చెందారు. స్నేహం తాలూకా బలమో ఏమో కానీ జేవియర్ మరియు పింటో సురక్షితంగా బయటపడ్డారు! ప్రొఫెసర్ కెల్లీ బ్రూక్లిన్ కి తన పరిశోధన నిమిత్తం మంచి గౌరవం దక్కింది!


ఫుట్ నోట్స్ :

  1. Mount Pinatubo – Wikipedia
  2. Volcano Story
  3. పలక విరూపణ సిద్ధాంతం – వికీపీడియా
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x