ముందుగా ఎమ్మెస్సీ ఫిజిక్స్ పూర్తి చేసినందుకు మీకు అభినందనలు. పీహెచ్డీ చేయాలనీ అనుకోవడం చాలా మంచి నిర్ణయం. సగటు పీహెచ్డీ విద్యార్థిగా నేను మీ నిర్ణయంతో పూర్తిగా ఏకీభవిస్తాను. ముందుగా పీహెచ్డీ గురించి నాకు తెలిసినది నేను ఇక్కడ ప్రస్తావిస్తాను.
పీహెచ్డీ చేయాలి అనే నిర్ణయం కంటే ముందు:
మీకు సైన్స్ మీద పూర్తిగా ఆసక్తి , మంచి బేసిక్స్ , జ్ఞానం సంపాదించడమే కాక సైన్స్ యొక్క సరిహద్దులను విస్తరింపచేయాలనే తపన (push science boundaries), సైన్స్ లో కొత్త కోణాలను అన్వేషించాలని ఆసక్తి, సమాజానికి సైన్స్ ద్వారా మేలు చేయాలన కోరిక ఉంటె మీరు తప్పకుండ పీహెచ్డీ చేయాలి.
పీహెచ్డీ వలన మీకు ఏమి లభిస్తుంది:
పీహెచ్‌డీని మీరు విజయవంతంగా పూర్తి చేస్తే మీకు అత్యున్నత విశ్వవిద్యాలయ డిగ్రీ లభిస్తుంది. డాక్టర్ అనే బిరుదు కూడా! మంచి జ్ఞానంతో పాటు, ప్రాబ్లెమ్ సొల్వింగ్ కెపాసిటీని మీకు పీహెచ్డీ అనుభవం ద్వారా లభిస్తుంది. ఇండిపెండెంట్ థింకింగ్‌కు (independent thinking) మీరు అలవాటు పడతారు. దీనితో పాటు మీ కొత్త ఆవిష్కరణలు సమాజం లోకి ఏవింధంగా తీసుకువెళ్లలో కూడా నేర్పుతుంది. మీ ఫలితాలను ప్రచురించగలిగే సామర్ధ్యాన్ని కూడా మీరు నేర్చుకోగలుగుతారు (communication through academic journals).
పీహెచ్డీ తరువాత:
మీరు ప్రొఫెసర్ అవ్వడానికి పీహెచ్డీ పట్టా చాలా ఉపయోగపడుతుంది. భవిషత్తులో సైంటిస్ట్ ఉద్యోగాలకు కూడా మీకు పీహెచ్డీ పట్టా బాగా తోడ్పడుతుంది. ఇప్పుడు చాలా ప్రైవేట్ కంపెనీలు పీహెచ్డీ గలవారిని నియామక౦ చేయడానికి కుడా ముందుకు వస్తున్నాయి. ప్రమోషన్ కోసం కుడా పీహెచ్డీ చేయవచ్చు.
పీహెచ్డీ కొరకు కొన్ని త్యాగాలు:
పీహెచ్డీ ఉతీర్ణత శాతం కొంచెం తక్కువే. ముందు మొదలు పెట్టి, తరువాత వారి ప్రయత్నం విరమించుకున్న వారు శాతం చాలా ఎక్కువ. ఇందుకు చాలా కారణాలు ఉన్నవి. ముందుగా ఆర్ధికంగా తక్కువ స్కాలర్షిప్ తో మన జీవితంలో ముఖ్యమైన రోజులు గడపవలసివస్తుంది. శ్రమ మరియు వత్తిడి చాలా అధికముగా ఉంటాయి. చాలా ఓర్పు సహనం కావలసి వస్తుంది. మీరు పరిశోధనలో వచ్చిన కొత్త ఫలితాలు ఒక పరిశోధన వ్యాసంగా ప్రచురించడానికి చాలా సమయము పడుతుంది. మీ ఫలితాలను అనుభవమున్న ప్రొఫెసర్లు మరియు సైంటిస్టులు పరిశీలనలో దాదాపు చాలా సమయం వాటిమీద చర్చ జరుగుతుంది (your research has to go through peer review process). దీనికి తోడు జీవితం లో స్థిరపడానికి సమాజము నుండి మరియు కుటుంబం నుండి వత్తిడి సహజం. పెళ్లికి సమయమును కేటాయించడం కొంచెం కష్టమే.
కొన్ని మంచి యూనివర్సిటీలు:
మీరు మన దేశం లో పీహెచ్డీ చేయాలని నిర్ణయించుకుంటే, ఈ క్రమంలో వాటికి మీ అప్లికేషన్ ని పంపి ఇంటర్వ్యూ ద్వారా పీహెచ్డీ సీట్ పొందవచ్చు.
1. ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ (IISC Bangalore)
2. ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీస్ (IITs through out the country)
3. నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీస్ (NITs through out the country)
4. టాటా ఇన్స్టిట్యూట్ అఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR)
5. సెంట్రల్ యూనివర్సిటీ (Central Universities like Delhi, Hyderabad, Jadavpur University etc.,)
6. స్టేట్ యూనివర్సిటీ (State Universities like JNTU etc.)
7. ప్రైవేట్ యూనివర్సిటీస్ (Private Universities)
లేదా మీరు బయట దేశాలకు ప్రయత్నించాలని అనుకుంటే, వేరు వేరు దేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి వేరు వేరు నియమాలు ఉన్నాయి. ఉదాహరణకు అమెరికా లో మీ మార్కులు తో పాటు మీ GRE మరియు TOEFL స్కోర్ ని బట్టి మీకు సీట్ ఇవ్వడం జరుగుతుంది. ఆస్ట్రేలియా, Europe, న్యూజిలాండ్ లో అయితే IELTS స్కోర్ అవసరం. మీరు ఎమ్మెస్సీ ఫిజిక్స్ లో ప్రచురించిన పరిశోధన వ్యాసం ను బట్టి కూడా సెలక్షన్ జరుగుతుంది. ముందుగా చాలా మంది ప్రొఫెసర్ గురించి తెలుసుకుని, వారికి ఇమెయిల్ ద్వారా తమకు PhD చేయాలని ఉందని తెలియచేస్తారు. మీ ప్రపోసల్ (scientific proposal) కనుక ప్రొఫెసర్ కి నచ్చితే ఆయన మీకు తిరిగి బదులు ఇస్తారు (then you can start your application process to that university). Albert Einstein PhD application was rejected by few universities!
ఎమ్మెస్సీ ఫిజిక్స్ కి పీహెచ్డీ కి మధ్య వ్యత్యాసం:
ముఖ్యముగా ఎమ్మెస్సీ ఫిజిక్స్ కి పీహెచ్డీ కి చాలా వ్యత్యాసం వుంటుంది. ఎమ్మెస్సీ ఫిజిక్స్ లో మీకు ఒక అకాడమిక్ క్యాలండర్ మరియు ఫ్రేమ్ వర్క్ (frame work) ఉంటాయి, కానీ పీహెచ్‌డీలో అలాంటివి వుండవు (PhD typically takes 3 to 6 years) , మీరు చాలా ఇండిపెండెంట్ గా, వంటరిగా రీసెర్చ్ చేయవలసి వస్తుంది. మీకు ఒక ప్రొఫెసర్ పీహెచ్డీ లో తోడుగా వుంటారు (వారిని గైడ్/Guide అంటారు), కానీ మీకు దగ్గరుండి అన్ని నేర్పించవలసిన భాద్యత మాత్రం ఆయనది కాదు. మీరు మీకు ఎం పరిశోధన చేయాలని ఉందొ ఆయనతో చర్చించి సలహాలు మాత్రమే తీసుకోగలుగుతారు. పని, పరిశోధన, కష్టం మీదే, ఎందుకంటే అది మీ పీహెచ్డీ కనుక!