ఐ హేట్ యు వంశి !

మంచు కరిగి, నీరుగా ప్రవహించి, ఒక పంటను నిలబెట్టి నట్టు, కరిగిపోతున్న తన జీవితానితో పోరాడుతూ, తన స్నేహితుల జీవితాలను తీర్చిదిద్దిన ఒక మహిళతో నన్ను ప్రేమలో పడేసారు! మీ మంచు పల్లకి నా గుండెల్లో ఇంకా కరగలేదు!

పంజరంలో (కోటలో ) చిలుక (రాజకుమారి) స్వేచ్చకు సంకెళ్ళు వేసిన తన కుటుంభ పరువు ప్రతిష్టలను బద్దలుకొట్టడానికి వచ్చిన పగటి వేషగాడు, వాళ్ళిద్దరి మధ్యలో వెలసిన ప్రేమ, ఒక మహా కావ్యం సార్! రాజకుమారిని మాకు సీతార గా చూపించి, మీ అద్భుతమయిన నైపుణ్యం తో మాకు ఓ అందమయిన మైనాను పరిచయం సార్!

“జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా

కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా

మిల మిల మెరిసిన తార, మిన్నులవిడిన సితార

మిల మిల మెరిసిన తార, మిన్నులవిడిన సితార

మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా

కలలను పెంచకు కలతలు దాచకు ఏ మైనా… ఓ మైనా!!”

గోదారి అందాలు, పాపికొండల సొగసులు, పక్షుల రాగాలు, గోదావరి ప్రాంత ప్రజల ప్రేమానురాగాలు, పడవ ప్రయాణాలు, అలల సవ్వడులు, మొక్కల సోయగాలు, మీలాగా ఎవరు చూపించగలరు! చూపించడమే కాక, మాకు మీ సినిమాలో అద్భుతమయిన బాణీలతో మా కళ్ళముందు ఆవిష్కరింపచేస్తారు సార్!

“వెన్నెల్లో గోదారి అందం.. నది కన్నుల్లో కన్నీటి దీపం

వెన్నెల్లో గోదారి అందం.. నది కన్నుల్లో కన్నీటి దీపం

అది నిరుపేద నా గుండెలో..

చలి నిట్టూర్పు సుడిగుండమై..

నాలో సాగే మౌనగీతం..

వెన్నెల్లో గోదారి అందం… నది కన్నుల్లో కన్నీటి దీపం!”

“కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి

విశ్వనాథ పలుకై అది విరుల తేనె చినుకై

కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై

పచ్చని చేల పావడగట్టి కొండమల్లెలే కొప్పునబెట్టి

వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని”

ఇలాంటి ఎన్ని పాటలు నా గుండెల్లో మోగుతున్నాయి మీకు చెప్పలేను సార్ !

ఆస్తులు అంతస్థులతో స్వచ్చమయిన ప్రేమకు దూరమయిన ఒక కుర్రాడికి, ప్రేమను పరిచయం చేసి, ఆ ప్రేమ దక్కక పోవడం, అతను పిచ్చివాడిగా మారడం, చివరికి తన ప్రేమను పొందలేక, చనిపోతూ తన ప్రేమికురాలితో చెప్పినా మాటలు “సుచిత్ర, నేను గెలిచే వెళుతున్నాను, పోయాడనుకున్న నీ బిడ్డను క్షేమంగా తిరిగి ఇవ్వగలగడమే ప్రేమికుడిగా నా గెలుపు సుచిత్రా! సుచిత్ర ఒకటి మాత్రం నిజం, మీ ప్రేమను పొందటానికి నేను ఎన్నుకున్న మార్గాలు తప్పు ఏమో నాకు తెలీదు, కానీ నా ప్రేమ మాత్రం నిజం. ఆ….. నీ ప్రేమను పొందే మార్గం తెలిసింది, వచ్చే జన్మలో నీ కొడుకుగా పుట్టించే వరం ప్రసాదించు సుచిత్రా” అని పిచ్చి వాడిని మహర్షీ గా తీర్చిదిదిన విధానం నా గుండెను బరువు చేసింది సార్!

“మాట రాని మౌనమిది, మౌనవీణ గానమిది,

గానం మీది, నీ ధ్యానం మీది, ధ్యానములో నా ప్రాణమిది,

ప్రాణమయిన మూగ గుండె రాగం ఇది,

మాట రాని మౌనమిది, మౌనవీణ గానమిది”

మీ కళను, ప్రతిభను వర్ణించడానికి నా దగ్గర మౌనమే మిగిలివుంది సార్!

పక్షుల కిలకిలారావాల నుంచే సంగీతం పుట్టిందని అన్వేషించడానికి హేమను అడవిలోకి పంపి మమ్ములను హడలగొట్టేరు మీ అన్వేషణ తో!

మీ ఆలాపన తోనె నా జీవన రైలు ప్రయాణం సాగుతుంది సార్!

లేడీస్ టైలర్ లో మా సుందరంను “జపరే జమ” చేసి, తన చేత కవితలు చెప్పించి, నన్ను నవ్వించారు, కవ్వించారు!

“సుజాత, మే మర్జాత,

తుమార చుట్టూ పిర్జాత, అది నా తలరాత,

మే పడ, తుమారీ తొడ, మచ్చ , బహుత్ అచ్చా,

మే బాచ్చా, బట్టల సత్యం లుచ్చా”

జోకర్ సినిమాలో మీ మ్యూజిక్ తో నా మనసు గెలిచి, నన్ను మీ పాత్రలతో ప్రేమలో పడేసారు!

“స్వాగతము సుస్వాగతము, పలికినది ఈ సుమము,

విహితులకు విరహితము..సాహితులకు సలలితము,

గోపిలోలుని ధ్యానము, ఇది గాలి బాలుని గానము”

ఒకరినొకరు చూసుకోకుండా ప్రేమలేఖల ప్రేమ కథలు, అవును వాళ్లిదరు ఇష్టపడ్డారు, గోపి గోపిక గోదావరి, ఎంత చక్కగా తీశారో! మీ వెన్నెల్లో హాయ్ హాయ్ సినిమా లో ప్రేమ ప్రయాణం నాకు మీ మీద ఉన్న ప్రేమను రేటింపు చేసింది!

మీ సినిమాలో మగువల బొట్టు, కట్టుకి నా మనసులో గుడి మెట్టులు కట్టుకున్నాను సార్! వారిలో ఎవరితో ప్రేమలో పడాలో అర్ధమవక తల పీక్కోవాల్సి వస్తుంది అప్పుడప్పుడు! మగువలు ఇంత అందంగా చూపించడం మీ వల్లనే సాధ్యం! మన చీర కట్టులో ఉన్న అందం ఇంక ఎక్కడ ఉంటుంది సార్?

మీ క్రియేటివిటీ నా జోహార్లు, మీచక్కని తెలుగు కథలకి నా వందనములు! మన ప్రజల బ్రతుకులు, జీవితాలు, సంస్కృతులు, ప్రేమలు మిమ్మల్ని ఆవాహన చేసుకున్నాయి ఏమో సార్! మీరు ఈ ప్రపంచాన్ని అందంగా చూడగలగడం ద్వారా నె మీ సినిమాలు అంత అందంగా ఉంటాయి కాబోలు!

“ప్రతి దినం మీ దర్శనం నాకు దొరకునా దొరకునా” లాంటివి కాకపోయినా,

“నువ్వ అక్కడ ఉండి నేను ఇక్కడ ఉంటె, ప్రాణం విల విల” లాంటివి కాకపోయినా,

ఒక్కసారి మిమ్మల్ని కలవాలని వుంది సార్!

కానీ మితభాషి అయిన మీరు నాతో ఎం మాట్లాడతారు చెప్పండి!

ఐ హేట్ యు వంశి గారు,

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x