నా జీవితాన్ని సమూలంగా మార్చిన బాల్యపు సంఘటన

నేను ఎడొవ తరగతి చదువుతున్నపుడు, మా స్కూల్ టీచర్ నాతో, మీ నాన్న గారు స్కూలు కీ వచ్చారు, ప్రిన్సిపాల్ తో మాట్లాడుతున్నారు, కొంత సేపు తరువాత టీచర్స్ మీటింగ్ కు మన ప్రిన్సిపాల్ గారు మా అందరిని పిలిచారు అని చెప్పారు. నాకు భయం మొదలయింది. అక్కడ ఏమి జరుగుతుందో నాకు అర్ధం కాలేదు. మా నాన్నగారు రావడం ఏంటి, మా ప్రిన్సిపాల్, టీచర్స్ మీటింగ్ కు పిలవడం ఏంటి అని! ఉదయం నుండి మధ్యాహ్నం దాకా మీటింగ్ జరిగింది. మా స్నేహితులు అంత నాతో “ఎం చేసావురా, స్కూల్లో ఇలా ఎప్పుడు జరగలేదు, తరగతులు అన్ని ఆపేసి ఇలా టీచర్స్ మీటింగ్ ఏమిటి అని“. నాకు ఇంకా భయం పెరిగిపోయింది.

మధ్యాహ్నం మూడు గంటలకు మాకు నోటీసు వచ్చింది ” All the workbooks and guides we issued will be revoked and only text books shall be followed from here on for this academic year”. అంటే మీకు మేము అందించిన వర్కుబూక్స్ అండ్ గైడ్ పుస్తకాలు అన్ని ఈ క్షణం నుండే రద్దు చేస్తున్నాం, ఇక నుండి మీరు టెక్స్ట్ బుక్స్ (government text books) నే చదవాలి అని.

అప్పుడు నాకు కిందటి రాత్రి మా ఇంట్లో జరిగిన విషయం గుర్తొచ్చింది. మా స్కూల్ టీచర్ మాకు సైన్స్ వర్కుబూక్ లో ప్రశ్నలు జవాబులు చదవమని ముఖ్యమయిన ప్రశ్నలను మార్క్ చేసి పెట్టారు (important questions). నేను వర్కుబూక్ లో ప్రశ్నలు చదవడం చూసి, మా నాన్నగారు అందులో నీకు ఏమి అర్ధమయిందో చెప్పమ్మన్నారు, నేను చెప్పలేక పోయాను.

తరువాత సైన్స్ టెక్స్ట్ బుక్ (physics text book) తీసి ఆ పాఠం మొత్తం నన్ను చదవమని, దాన్ని అర్ధం చేసుకుని, మా నాన్నగారికి అర్ధం అయ్యేలా చెప్పమ్మన్నారు. నేను అలాగే చెప్పాను. అప్పుడు మా నాన్న గారు “చూసావా, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఊరికినే ముద్రించరు, మీరు చదివి అర్ధం చేసుకోవాలని ఎంతో పరిశోధన చేసి ముద్రిస్తారు” అని చెప్పారు. వర్కుబూక్స్ అండ్ గైడ్ పుస్తకాలు మార్కులు కి తప్ప జ్ఞానానికి తోడ్పడవు అని చెప్పారు.

ఆ రోజు నుండి మా నాన్న గారు ప్రతి రోజు నేను చదివిన ఏదొక పుస్తకం గురుంచి చెప్పమనే వాళ్ళు. తరువాత అయన ఏమి అనుకుంటున్నారో కూడా నాకు చెప్పేవారు. ఆలా నేను చదివే దృష్టికోణం మారిపోయింది. క్లాస్ లో నాకు ఎప్పుడు ముందు ర్యాంకులు రాలేదు, కానీ మా నాన్నగారు ఎప్పుడు పట్టించుకోవద్దు అని చెప్పే వారు. మా ఇంట్లో ఉన్న పుస్తకాలు అన్ని చదవడం నేర్చుకున్న (ఒక పెద్ద అరక మొత్తం పుస్తకాలు ఉండేవి like readers digest, national geography, philosophy etc).

ఒకరోజు సాయంత్రం మా ఇంట్లో నేను చదువుకుంటున్న, మా నాన్నగారు ఇంట్లో లేరు. హట్టాతుగా, మా ఇంటి చుట్టు ఉన్న జనాల పరుగులు కేకలు వినపడ్డాయి, ఏంటా అని హడావిడిగా ఇంట్లోనుండి బయటకు పరిగెత్తాను. చూస్తే మా ఇంటి ముందున్న ఒక ఆవిడా కిరసనాయిలు తాగి ఆత్మహత్య చేసుకుందట. అందరూ కేకలు, ఏడుపులు. నేను తిరిగి మా ఇంటికి పరిగెత్తుకు వెళ్లి మా ఇంట్లో ఉన్న “Where there is no doctor” అనే పుస్తకం తీసి, చక చక కిరోసిన్ తాగిన వాళ్లకు ఫస్ట్ ఎయిడ్ (first aid) ఎం చేస్తారో చదివాను. పేషెంట్ ను పల్స్ గమనించి, ఆవిడా స్పృహలోనే ఉంటె కూర్చో పెట్టి, గోరు వెచ్చని ఉప్పు నీరు తాగించి, కొంచెం సేపు తర్వాత వాంతులు అయ్యేలా నోట్లో వేలు పెట్టి వాంతి అయ్యేలా ప్రయత్నించాను (స్పృహలో లేకపోతే ఇంకోలాగా చేయాలనీ రాసుంది, నాకు జ్ఞాపకం ఉన్నంతవరకు). తరువాత ఆవిడను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అదృష్టవశాత్తు ఆవిడ బ్రతికింది! అక్కడ ఉన్న వారంతా ఏడో తరగతి చదువుతూ బాగానే అర్ధం చేసుకోగలిగాడే అని మా అమ్మగారితో అన్నారట!

అప్పుడు అర్ధమయింది, మా నాన్న గారు ఎందుకు చదివింది అర్ధం చేసుకోవాలీ అని చెప్పారో. అప్పటి నుండి ఇప్పటిదాకా, నేను చదివిందాన్ని అర్ధం చేసుకోడానికి ప్రాధాన్యం ఇచ్చాను. నా అలవాటు వలన ఎగ్జామ్స్ లో చాల సార్లు కష్టంగా పాస్ అయ్యేవాడిని, కొన్ని సార్లు (మన చదువులో ఎక్కువ బట్టి పట్టి సమాధానాలు రాయడం సులభం, మార్కులు ఎక్కువ రావడానికి కూడా తేలిక మార్గంగా నాకు అనిపించేది). కొన్ని సార్లు ఇంటర్లో, లో చాల నిరాశకు గుర్రయ్యను, ఆ మార్కుల పోరాటం లో!

ఏదయినా సరే అర్ధం చేసుకోవడానికే నా ప్రాధాన్యం. స్కెప్టిక్ థింకింగ్ (Skeptic Thinking) నాకు అప్పటి నుండే అలవాటు అయ్యింది. ఈ రోజు నేను పరిశోధకునిగా పనిచేస్తున్నాను అంటే మా నాన్న గారు నాకు చూపిన బాట వలెనే . ఈ విషయం లో మా నాన్నగారిని తలుచుకుంటే చాల భావోద్వేగాయానికి లోనూ అవుతాను. ఆయన గోవేర్నమేంట్ ప్రైమరీ టీచర్ (primary teacher) గా పనిచేస్తున్నారు.

ఇది అండీ నా జీవితాన్ని సమూలంగా మార్చిన బాల్యపు సంఘటన!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x