సునామి

డబ్ల్యు. జే. మోర్గాన్ మన భూగోళపు అశ్మావరణ౦ ఏడు పెద్ద పలకలుగా విభజించబడినది అని, ఈ ఏడు పెద్ద పలకల (or 10 small plates) మధ్య స్థిరమైన కదలికలు ఉన్నవని 1967 లో పలక విరూపణ సిద్ధాంతం (Plate Tectonic Theory) ద్వారా తలియచేసారు.

సాధారణంగా పలకల కదలికల ద్వారా ఏర్పడిన తీవ్రమయిన వత్తిడి వలన భూకంపాలు సంబవింస్తాయి అని మనకు తెలిసిన విషయమే. వివరాలకోసం ఈ సమాధానం చుడండి (అగ్నిపర్వతం ఎలా ఏర్పడుతుంది? చివరకు ఏమవుతుంది?).

సముద్రగర్భములో కూడా పలకలు నిరంతరం కదిలికలకు గురి అవ్వుతూ ఉంటాయి. 
కొన్ని సందర్భాలలో ఈ పలకలు తీవ్రమయిన వత్తిడికి గురి అయ్యి, సముద్రపు గర్భములో భూకంపాలకి కారణమవుతాయి. ఈ భూకంపాల వలన విడుదలయిన శక్తి సముద్రములో కొంతభాగపు నీళ్లను పైకి ఎత్తడంతో ఒక అలజడిని సృష్టిస్తుంది.

ఈ అలజడితో పైకి ఎగిసిపడిన నీళ్లను గురుత్వాకర్షణశక్తి మళ్ళీ కిందకు లాగుతుంది. ఈ ప్రక్రియ ఒక పెద్ద అలను సృష్టిస్తుంది. ఈ పెద్ద అలను లాంగ్ వేవ్ (long wave ) అని అంటారు. సునామి అలకి, మిగతా అలలకు చాల తేడా ఉంటుంది. ఉదాహరణకి, గాలి వలన సముద్రములో అలలు ఏర్పడుతాయి, కానీ అవి కేవలం సముద్ర ఉపరితలం మీద ఉన్న నీళ్లనే కదప గలవు, కానీ సునామి సముద్ర ఉపరితలం నుంచి సముద్ర లోతువరకు నీళ్లను కదపగలదు. చంద్రుని వలన ఏర్పడిన అలలు వేరు, సునామి వేరు. సునామి సముద్రములో భూకంపము ద్వారా, లేదా సముద్రములో అగ్నిపర్వతం పేలడం ద్వారా సంభవిస్తుంది. మనం ఎప్పుడు సముద్రములో చూసే అలలు చంద్రుని గురుత్వాకర్షణ శక్తి ద్వారా ఏర్పడతాయి. బాగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, సముద్ర గర్భములో సునామి అల మనకు కనపడదు (నీళ్లు ఎత్తుగా కనపడవు, లాంగ్ వేవ్ లెంగ్త్ వలన దీని ప్రభావం తెలియదు), కానీ తీరం దగ్గర వచ్చేసరికి పెద్ద ఎత్తులో నీళ్లను పైకిలేపి, తీరమును తాకుతుంది. అందువలనే దీని పేరు తీరపు అల, జపాన్ భాషలో Tsu = తీరము, nami =అల అని అర్ధం.

ఈ సునామి అల దాదాపు విమానం ప్రయాణించినంత వేగంగా సముద్ర లోపలనుండి తీరానికి ప్రయాణించగలదు. దీని వేగం సుమారు గంట 600 -800 KM /hr . సముద్రపు లోతుని బట్టి దీని వేగం కనుకొనడం చాల సులువు.

సునామి వేగం = వర్గమూల ( సముద్రపు లోతు *గురుత్వాకర్షణ త్వరణం).

Tsunami Speed = squareroot(ocean depth (d) X gravity acceleration (g))

చిన్న లెక్క చేదాం:

మన బంగాళాఖాతం సుమారు 5 కిలోమీటర్లు (KM) లోతు అనుకుంటే, గురుత్వాకర్షణ త్వరణం (g) =9.81 m/sec2 కాబట్టి, బంగాళాఖాతంలో సునామి వేగం దాదాపు sqrt (5000 *9 .81) =220m/sec= 800KM /hr . అంటే దాదాపు గంటకు ఎనిమిది వందల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అనమాట. ఒకవేళ పసిఫిక్ మహాసముద్రములో సునామి ఏర్పడితే కేవలం గంటలో మన తీరం తాకగలదు.

26 డిసెంబర్ 2004 లో మన తీరని తాకిన సునామి చాల మంది ప్రణాళలు బలి తీసుకుంది. Ministry of Earth Sciences- India, 2007 లో భారతీయ సునామి ప్రారంభ హెచ్చరిక వ్యవస్థ (ITEWS) ను స్థాపించే బాధ్యతను చేపట్టింది. ITEWS హైదరాబాద్ లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS) వద్ద ఉంది.


చిత్ర మూలం:

Stock Photos, Vectors and Royalty Free Images from 123RF

ఫుట్ నోట్స్ :

https://www.researchgate.net/publication/263929836_Facts_about_Tsunami_Its_origin_earthquake_link_and_prediction_An_Opinion

ESSO-INCOIS-Indian National Centre for Ocean Information Services

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x