బాహుబలి సినిమా భౌగోళిక ప్రదేశాలు ..

బాహుబలి సినిమా లోని చూపించిన కొన్ని భౌగోళిక ప్రదేశాలు మన నిజ ప్రపంచంలో ఉండే వీలు తప్పకుండా ఉంది. కాని మనం గుర్తు పెట్టుకోవాలన్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే బాహుబలి సినిమా ఒక అందమయిన ఊహ! అది సైన్స్ సినిమా కాదు కాబట్టి ఆ ప్రాంతాలు ఎలా దృశ్యమానం (visualize) చేసుకున్నారో లాజికల్గా ఆలోచించడం కొంతవరకు అవసరం లేదు. కానీ ఈ సమాధానంలో కొంత లాజికల్గా సైన్స్ దృక్కోణం చూసి ఇక్కడ రాస్తున్నాను (ముందు ముందు ఇలాంటివి దృష్టిలో పెట్టుకుని సినిమాలో ప్రాంతాలు దృశ్యమానం చేసుకోవచ్చు కదా అని నా ఉద్దేశం).

  1. ఈ సన్నివేశంలో, బాహుబలి సినిమా ప్రారంభ దశలో మాహిశ్మతి సామ్రాజ్యం చుట్టుపక్కల ఉన్న భౌగోళిక ప్రదేశాలను చూపించే ప్రయత్నం చేసారు. కింద ఉన్న చిత్రపటం బాగా గమనిస్తే మహిశ్మతి రాజ్యం చుట్టుపక్కల ఎత్తుఅయిన కొండలలో మంచు కురుస్తుంది, కానీ మహిశ్మతి రాజ్యం ఆ మంచు కొండలకన్నా ఎత్హుగా ఉన్నాకూడా అక్కడ మంచు ఏర్పడలేదు. ఇది అసాధ్యం! ఎత్తుయైన ప్రదేశాలలలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడం వలన మంచు పేరుకుంటుంది. కానీ మంచు కొండలకన్నా ఎత్తుగా ఉన్న మాహిశ్మతి సామ్రాజ్యంలో మీద మంచు లేకపోవడం గమనార్హం!

2. కింద ఉన్న చిత్రపటంలో ఎత్తుయైన మంచుకొండల మధ్య ఒక ఎడారిలా పల్లంగా ఉండి, అక్కడ నుండి జలపాతం మొదలవుతుంది. నిజ ప్రపంచంలో ఇన్ని భౌగోళిక వైరుద్యాలు ఒక్కే చోట ఉండకపోవచ్చు. సాధారణంగా జలపాతాలు కొండలమధ్యలో కనపడతాయి, ఇలా పల్లం మధ్యలో కనపడడం, నీళ్లు ఎక్కువ ఉన్నట్టు కనపడుతున్నపుడు అక్కడ నేల పొడిగా పొడిగా ఉండడం గమనార్హం.

3. ఇక్కడ బాహుబలి పాత్ర ఒక కొండ మీదనుండి ఇంకో కొండకి ఎగురుతుండగా, వెనకాల ఉన్న జలపాతం మనం చూడవచ్చు. ఇలాంటి భౌగోళిక ప్రదేశాలు మన భూమి మీద ఉండే అవకాశం ఉన్నది . కొండల మధ్యలో జలపాతాలు ఉండడం సహజమే! మన దక్షిణ భారతదేశం కేరళలో కొన్ని ప్రాంతములలో జలపాతాలు ఉన్నవి.

4. కింద చిత్రపటంలో మంచుకొండలు మంచుతో కప్పిఉండడం, వాటిమీద అవలంచే (Avalance) లాంటివి రావడం సహజమే. అక్కడ చెట్లు చూస్తుంటే ఎక్కడో ముప్పయి డిగ్రీల పైన రేఖాంశాలలో (higher lattitude) ఉన్నట్టు ఉంది. కానీ కొన్ని సన్నివేశాల్లో ఎక్కడో ఎడారిలో ఉన్నట్టు ఉంటుంది. అక్కడ తాటిచెట్లను చూస్తుంటే ఉష్ణమండలలో (tropics) ఉన్నట్టు ఉంటుంది. ఈ రెండూ ఒకేచోట , లేదా ఒకే సామ్రాజ్యములో ఉండే అవకాశం లేదు అని నా భావన.

కొన్ని ప్రదేశాలలో కొండల వెనకాల వర్షపాతం తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు హిమాలయాల వెనకాల ఉండే టిబెట్ ప్రాంతంలో కొంత వర్షపాతం తక్కువగా ఉండడం వలన కొంత పొడి పొడిగా ఉంటుంది, కానీ ఆ సినిమాలో చూపించి నట్టు మరి మంచు కొండల మధ్య కొంత ఎడారిలా, తాటిచెట్లతో ఉండే అవకాశం లేదు అనుకుంట!

చివరిగా నేను చెప్పదలచినది, బాహుబలి సినిమాలో ఉన్న భౌగోళిక ప్రదేశాలు మన ప్రపంచంలో ఉన్నవి, కానీ ఒకే సామ్రాజ్యంలో మంచుకొండలు, ఎడారులు, పల్లాలు కలసి ఉండే అవకాశం కొంత అరుదు ఏమో అని అనిపిస్తుంది!

ఏది ఏమయినా ఒక దృశ్యకావ్యం మనందరికీ అందించినందుకు మెచ్చుకోవలసినదే .

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x