టీ విత్ టూ బిస్కెట్స్

నేను ఏడూ సంవత్సరాల క్రితం ఎంటెక్ చదవడానికి కోసం ఐ ఐ టీ భుబనేశ్వర్ లో చేరాను. నా మొదటి సంవత్సరంలో బాగా చదువు ఒత్తిడి ఉండడం వలన, ప్రేమ లాంటి ఎక్సట్రా ఆక్టివిటీస్ కి కొంచెం దూరంగా ఉండాల్సివచ్చింది. చదువు ఒత్తిడికి నా జుట్టు కాస్తా తెలుపుగా మారడం మొదలయింది. పైగా నాకు ఫిలోసోఫీ అంటే కొంత ఇష్టం ఉండడం వలన ఎక్కువుగా పుస్తకాలు, వ్యాసాలు, ఈ ప్రపంచం గురించి ఆలోచించడాలు వలన కొంత ఏకాంతంగా, సీరియస్ గా సమయం గడిచిపోయింది. ఇక నా రెండో సంవత్సరంలో ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ అయ్యింది. నేను ఒక ప్రొఫెసర్ కింద ప్రాజెక్ట్ వర్క్ లో చేరాను, ఆయనకు డెభై సంవత్సరాలు ఉంటాయి, పోదున్న ఎనిమిది ఇంటికి వస్తారు, రాత్రి ఎనిమిది ఇంటికి వెళతారు. అయన ఉన్నంత వరకు నేను ల్యాబ్ లోనే ఉండేవాడిని. ఎప్పుడు పిలుస్తాడా తెలీదు! అలా సీరియస్ గా, కొంత బోరింగ్ గా సాగుతూ ఉండేది నా జీవితం.

అప్పుడే మా జూనియర్స్ జాయిన్ అయ్యారు. అందులో ఒక అమ్మాయిని కొన్ని రోజులు గమనించాను, తను ఎప్పుడు నవ్వుతూ, చాలా ఉత్సాహంగా ఉండేది. బాగా చదివేది కూడా. ఎంత వర్క్ ప్రెషర్లో (work pressure) ఉన్నా కూడా చాలా హ్యాపీ గోయింగ్ గా అనిపించేది ( నేను ఇలా ఎందుకు ఉండలేను అని అనిపించేది అప్పుడపుడు). చాలా చురుకయిన తెలివిగల అమ్మాయి అని నా స్నేహితుల నుండి విశ్వసనీయమయిన సమాచారం (అప్పుడికే చాలా మంది తనతో మాట్లాడడానికి ప్రయత్నించేవారు). తనతో నేను ఎప్పుడు ఎక్కువగా మాట్లాడలేదు. తను నన్ను ఎప్పుడు పెద్దగా పట్టించుకోలేదు (ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు అని నా భావన ). ఇలా ఒక సంవత్సరం గడిచింది.

ఇంకో నెలలో ఐ ఐ టీ భుబనేశ్వర్ వదిలి వెళ్ళాలి అనగా, నేను ఆ అమ్మాయిని పిలిచి టీ తాగుదాం వస్తారా అని అడిగాను. తను మాములుగా సరే అని నాతో పాటు వచ్చింది. షాప్ కి వెళ్ళాక నేను “టీ విత్ టూ బిస్కెట్స్” ఆర్డర్ చేశాను! నేను మెల్లగా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని అడిగాను, తను పీహెచ్డీ చేయాలనీ ఉంది అని చెపింది. నేను కూడా పీహెచ్డీ చేయాలనుకుంటున్నాను అని తనతో చెప్పాను (నేను నిన్ను అడిగానా అని బహుశా తను అప్పుడు అనుకుని ఉండొచ్చు). కొంతసేపు మాటలు కలిపిన తరువాత “నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను” అని చెప్పాను. తను ఒక్కసారిగా షాక్ అయ్యి, నన్ను కొంచెం సేపు విచిత్రంగా చూసి, అక్కడనుండి వెళ్ళిపోయింది. తరువాత నేను తనని డిస్టర్బ్ చేయలేదు. నా ఉద్దేశం చెప్పాను, ఒప్పుకుంటే మంచిది, లేదంటే తన అభిప్రాయాన్ని గౌరవిద్దాం అని అనుకున్నాను. తను నా గురించి నా స్నేహితులని అడిగినట్టు నాకు తెలిసింది (నా స్నేహితులతో చాలా మంది బీబీసీ న్యూస్ ఛానల్ లో పని చేసారు లెండి, వార్తలు అలా మోస్తుంటారు). నా స్నేహితులు పర్వాలేదు కానీ కొంచెం మూడీ పర్సన్ అని చెప్పారట (నా స్నేహితుల భావనతో నేను అంగీకరిస్తాను, నేను కొంత బోరింగ్ పర్సన్). తన స్నేహితులు మాత్రం నేను కొంచెం తేడా, ఎదో లోకంలో ఉంటాడు, ఎదో ఆలోచిస్తుంటూ ఉంటాడు అని చెప్పారట. మొత్తానికి తను కొంత సమయం తీసుకుని, నన్ను ఒక మంచి ప్రశ్న అడిగింది. నన్ను ఎందుకని పెళ్లి చేసుకుంటావ్? అని అన్నానని. నేను మనం ఇద్దరం చాలా విభిన్న వ్యక్తిత్వాలు కలవాలం, ఒకరినుండి ఇంకొకరం నేర్చుకుని, మన వ్యక్తిత్వాలను మెరుగు పరుచుకోవచ్చు అని ఎదో నాకు తెలిసిన రెండు ముక్కల ఫిలాసఫీ చెప్పాను. మళ్లీ తను నన్ను కొంచెం సేపు విచిత్రంగా చూసి, అక్కడనుండి వెళ్ళిపోయింది (zoo లో జంతువును చూసినట్టు). ఒక నెల రోజులు మాట్లాడలేదు. నెల తరువాత మరి ఏమి ఆలోచించిందో నాకు తెలియదు కానీ, తన తల్లిదండ్రులు ఒప్పుకుంటే నన్ను పెళ్లిచేసుకోవడానికి అభ్యంతరం లేదు అని చెపింది (ఇప్పుడు నేను షాక్ తిన్నాను).

అలా ఒక టీ విత్ టూ బిస్కెట్స్ మా ఇద్దరినీ కలిపాయి, పెద్దల అంగీకారం తో మా పెళ్లి జరిగింది. టీ విత్ టూ బిస్కెట్స్ నా జీవితాన్ని మార్చేశాయి , ఇప్పుడు నేను రోజు సాయంత్రం టీ తాగుతూ బిస్కెట్స్ తింటున్నాను!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x