పీహెచ్డీ చేయాలనీ ఉందా? ఐతే ..

కొంత మంది విద్యార్థులు తమకు పీహెచ్డీ చేయాలని ఆసక్తి ఉందని నన్ను సంప్రదించారు. ఇంకా చాలా మందికి ఇలాంటి ఆలోచనలు ఉంటాయని నేను నమ్ముతున్నాను. అందుకని వారి కోసం నాకున్న అనుభవం రీత్యా ఇక్కడ చిన్న వ్యాసం రాస్తున్నాను.

పీహెచ్డీ చేయాలి అనే నిర్ణయం కంటే ముందు:

మీకు సైన్స్ మీద పూర్తిగా ఆసక్తి , మంచి బేసిక్స్ , జ్ఞానం సంపాదించడమే కాక సైన్స్ యొక్క సరిహద్దులను విస్తరింపచేయాలనే తపన, సైన్స్ లో కొత్త కోణాలను అన్వేషించాలని ఆసక్తి, సమాజానికి సైన్స్ ద్వారా మేలు చేయాలన కోరిక ఉంటె మీరు తప్పకుండ పీహెచ్డీ చేయాలి.

మీకు భారతదేశంలో సైన్స్ లేదా ఇంజనీరింగ్ లో పీహెచ్డీ చేయాలని ఉంటె:

మన దేశం లో ప్రఖ్యాత కళాశాలలు అంటే ఐఐటీ, ఐఐఎస్సి , న్ఐటీ, మొదలగునవి పీహెచ్డీ చేయడానికి మీకు అవకాశాన్ని కలుగచేస్తాయి. వీటితోపాటు కొన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా మీకు పీహెచ్డీ అనుమతిస్తాయి. వెబ్సైటు లలో మరియు న్యూస్ పేపర్లలో పీహెచ్డీ ప్రకటనలు వస్తాయి, వాటికి అణుగున్నంగా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు.

కొన్ని కళాశాలలో మీరు పీహెచ్డీ చేయడానికి గేట్ (GATE )లేదా జాం (JAM) పరీక్షలలో మీరు ఉతీర్ణత సాధించి ఉండవలిసి ఉంటుంది. మీ దరఖాస్తు వారు పరిశీలించి పరిశీలించిన తరువాత మీకు ఇంటర్వ్యూ పిలుపు వస్తుంది. అక్కడ చిన్న పరీక్ష పెట్టి మీ ఇంటర్వ్యూ తీసుకుంటారు. మీరు అందులో బాగా రాణిస్తే మీకు పీహెచ్డీ సీట్ ఇస్తారు. పీహెచ్డీ చేస్తున్నందుకు మీకు స్కాలర్షిప్ లభిస్తుంది (ఇది అన్నీ కళాశాలకు వర్తించదు).

మీకు విదేశాలలో సైన్స్ లేదా ఇంజనీరింగ్ లో పీహెచ్డీ చేయాలని ఉంటె:

విదేశాలలో మన దేశం నుండి చాలామంది పీహెచ్డీ చేస్తున్న వారు ఉన్నారు. మీరు ముందుగా ఏ దేశం లో పీహెచ్డీ చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. ఒకవేళ మీరు అమెరికా లో పీహెచ్డీ చేయాలనుకుంటే, ఆ దేశంలో ఏ ఏ యూనివర్సిటీలో దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటున్నారో నిర్ణయించుకోండి. తరువాత ఆ యూనివర్సిటీ వెబ్సైటు కి వెళ్లి పీహెచ్డీ అప్లికేషన్స్ మీద క్లిక్ చేయండి. మీకు సమాచారం అంత అందులో లభిస్తుంది. చాలా యూనివర్సిటీలకు జిర్ఈ పరీక్షల్లో మంచి మార్కులతో మీరు ఉతీర్ణత సాధించాల్సి ఉంటుంది. అలాగే మీ Cirriculam Vite లో మీ మార్కులు, మీ పరిశోధన ప్రతిపాదన (research proposal) పత్రం చూసి మిమ్మలను ఇంటర్వ్యూ కి పిలవడం జరుగుతుంది.

ఐరోపా దేశాలలో GRE పరీక్ష అవసరం చాలా శాతం ఉండదు. మీరు ఐరోపా యూనివర్సిటీల వెబ్సైటు లో వెళ్లి చూడవచ్చు. కొన్ని యూనివర్సిటీలు IELTS పరిక్ష మార్కులను అడగవచ్చు. అలాగే మీ Cirriculam Vite లో మీ మార్కులు, మీ పరిశోధన ప్రతిపాదన పత్రం చూసి మిమ్మలను ఇంటర్వ్యూ కి పిలవడం జరుగుతుంది.

ఆస్ట్రేలియా దేశం లో కూడా GRE పరీక్ష అవసరం చాలా శాతం ఉండదు. కొన్ని యూనివర్సిటీలు IELTS పరిక్ష మార్కులను అడగవచ్చు. అలాగే మీ Cirriculam Vite లో మీ మార్కులు, మీ పరిశోధన ప్రతిపాదన పత్రం చూసి మిమ్మలను ఇంటర్వ్యూ కి పిలవడం జరుగుతుంది.

న్యూజిలాండ్ దేశం లో కూడా GRE పరీక్ష అవసరం చాలా శాతం ఉండదు. కొన్ని యూనివర్సిటీలు IELTS పరిక్ష మార్కులను అడగవచ్చు. అలాగే మీ Cirriculam Vite లో మీ మార్కులు, మీ పరిశోధన ప్రతిపాదన పత్రం చూసి మిమ్మలను ఇంటర్వ్యూ కి పిలవడం జరుగుతుంది.

ఈ సమాచారం మీ ప్రయత్నంలో తొలి మెట్టుగా మీకు తోడ్పడవచ్చు. కానీ మీరు యూనివర్సిటీ అప్లికేషన్ సిస్టమ్ ను బాగా పరిశోధన చేస్తే, మీ పీహెచ్డీ అప్లికేషన్ ప్రక్రియ సులువుగా మారుతుంది.

పీహెచ్డీ తరువాత:

మీరు ప్రొఫెసర్ అవ్వడానికి పీహెచ్డీ పట్టా చాలా ఉపయోగపడుతుంది. భవిషత్తులో సైంటిస్ట్ ఉద్యోగాలకు కూడా మీకు పీహెచ్డీ పట్టా బాగా తోడ్పడుతుంది. ఇప్పుడు చాలా ప్రైవేట్ కంపెనీలు పీహెచ్డీ గలవారిని నియామక౦ చేయడానికి కుడా ముందుకు వస్తున్నాయి. ప్రమోషన్ కోసం కుడా పీహెచ్డీ చేయవచ్చు.

పీహెచ్డీ కొరకు కొన్ని త్యాగాలు:

పీహెచ్డీ ఉతీర్ణత శాతం కొంచెం తక్కువే. ముందు మొదలు పెట్టి, తరువాత వారి ప్రయత్నం విరమించుకున్న వారు శాతం చాలా ఎక్కువ. ఇందుకు చాలా కారణాలు ఉన్నవి. ముందుగా ఆర్ధికంగా తక్కువ స్కాలర్షిప్ తో మన జీవితంలో ముఖ్యమైన రోజులు గడపవలసివస్తుంది. శ్రమ మరియు వత్తిడి చాలా అధికముగా ఉంటాయి. చాలా ఓర్పు సహనం కావలసి వస్తుంది. మీరు పరిశోధనలో వచ్చిన కొత్త ఫలితాలు ఒక పరిశోధన వ్యాసంగా ప్రచురించడానికి చాలా సమయము పడుతుంది. మీ ఫలితాలను అనుభవమున్న ప్రొఫెసర్లు మరియు సైంటిస్టులు పరిశీలనలో దాదాపు చాలా సమయం వాటిమీద చర్చ జరుగుతుంది (your research has to go through peer review process). దీనికి తోడు జీవితం లో స్థిరపడానికి సమాజము నుండి మరియు కుటుంబం నుండి వత్తిడి సహజం. పెళ్లికి సమయమును కేటాయించడం కొంచెం కష్టమే.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x