వాతావరణ సూచనలు మీద చాలా జోకులు ఉన్న విషయం వాస్తవమేనండి. కొన్ని సార్లు రాబోయా 24 గంటల్లో భారీ వర్ష సూచన అని టీవిలో చెప్తే, రేపు బాగా ఎండ కాస్తుంది, వర్షం ఆచూకీ కూడా ఉండదు. ఇలాంటివి చాలా సందర్భాలలో మనం గమనించి ఉండొచ్చు. వ్యక్తిగతంగా మనకు అనుభవం అయ్యుండొచ్చు. ఇది కేవలం రాబోయే వాతావరణాన్ని కచ్చితంగా అంచనా వేయలేకపోవడం వలన జరిగే తప్పిదం మాత్రమే. ఇందులో టీవీల్లో వార్తలు చదివే వారి తప్పేమి లేదండో!
(పిక్చర్ క్రెడిట్స్: skymetweather.com)
ఇప్పుడు ఉన్న విజ్ఞాన శాస్త్రంతో మనం మార్స్ గ్రహం యొక్కా స్థితిని ముందుగానే అంచనా వేసి రోవర్ను పంపగలిగాం, అలాంటిది మన భూమి మీద వాతావరణంను ఎందుకు కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నాం? ఇందుకు కారణాలు చూదాం,
వాతావరణ నమూనాలు:
వాతావరణ అంచనాలకు ముక్యంగా వాతావరణ శాస్త్రవేత్తలు ఉపయోగించేది వాతావరణ నమూనాలనను. వాతావరణ నమూనాలలో మ్యాథ్స్, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ లోని ముఖ్యమైనవి సూత్రాలను తీసుకుని గాలి యొక్క స్థితిగతులను, వర్షపాతమును, ఉష్ణోగ్రతలను మొదలైనవి అంచనా వేయడం జరుగుతుంది. మన భూమిని చిన్న చిన్న గ్రిడ్లుగా (grids) విభజించి, ఆ గ్రిడ్లలో ముఖ్యమైన సూత్రాల సమీకరలను కంప్యూటర్ లో సాల్వ్ చేయడం జరుగుతుంది. ఈ క్రింద చిత్రములో చూపించినట్టుగా
(పిక్చర్ క్రెడిట్స్:Climate Dynamics Group)
ఒక గ్రిడ్కి మరో గ్రిడ్కి దూరం సుమారు 100 నుండి 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంటే వాతావరణ నమూనాలు కేవలం కొన్ని ప్రదేశాల్లో వాతావరణం అంచనావేయడానికి ఆస్కారం ఉంది. గ్రిడ్లు పక్క పక్కనే పెట్టొచ్చు కదా, అంతదూరంలో ఎందుకు ఉండాలి అనే ప్రశ్న మీకు రావచ్చు? వాస్తవమే, గ్రిడ్లు పక్క పక్కనే (మనింటికి, మన పక్కింటిని రెండు గ్రిడ్లుగా చేయవచ్చు) ఉంటె అన్ని ప్రదేశాల్లో వాతావరణాన్ని అంచనా వేయవచ్చు, కానీ దానికి చాలా ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఉన్న వాతావరణ నమూనాలను హై పెర్ఫార్మన్స్ కంప్యూటర్లతో వాతావరన్నని అంచనా వేయడం జరుగుతుంది. గ్రిడ్లు పక్క పక్కనే పెట్టేఅంత ఆధునిక కంప్యూటర్లు మనం ఇంకా తయ్యారు చేయవలసి ఉంది. కింద చిత్రంలో జర్మనీలో ఒక సూపర్ కంప్యూటర్ ,
పిక్చర్ క్రెడిట్స్: HLRE-3 “Mistral”
ఇక రెండో ముఖ్యమయిన కారణం
బటర్ ఫ్లై ఎఫెక్ట్ : రేపటి వాతావరణంను కచ్చితంగా అంచనా వేయాలంటే ఈరోజు వాతావరణం యొక్క స్థితి మీద కచ్చితంగా పూర్తి అవగాహనా ఉండాలి. అంటే పూర్తి డేటా (data) ఉండాలి. వాతావరణ శాస్త్రవేత్తలు కొన్ని పరికరాలను ఉపయోగించి గాలి యొక్క స్థితిగతులను, వర్షపాతమును, ఉష్ణోగ్రతలను నమోదు చేస్తారు. వీటిని ఆబ్సెర్వేషనల్ డేటా అని అంటాము. ఈ డేటా కొన్ని ప్రదేశాల్లో మాత్రమే మనం నమోదు చేసుకోగలం. ఉదాహరణకు హిమాలయాల్లో అన్ని ప్రదేశాల్లో మనం ఈ పరికరాలను అమర్చలేం కదా, అలాగే మన పట్నంలో కొన్ని ప్రదేశాల్లోనే అమర్చగలం, పట్టణం మొత్తం అమర్చాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కదా? అలాగే సముద్రం మధ్యలో డేటా కావాలంటే మనకు దొరకదు కదా? అందుకనే ఈ రోజు యొక్క వాతావరణంను మనం కచ్చితంగా అంచనా వేయలేము.
ముందుగా చెప్పినట్టు, రేపటి వాతావరణము అంచనా వేయాలంటే ఈ రోజు వాతావరణం యొక్క పూర్తి డేటా అవసరం, ఈ డాటాలో చిన్న లోపం ఉంటె రేపటి వాతావరణం అంచనా చాలా కష్టం. ఈ రోజు డాటాలో చిన్న తప్పు రేపటి వాతావరణం అంచనాలను తారుమారు చేస్తుంది, దీనిని మనం బటర్ ఫ్లై ఎఫెక్ట్ అని అంటాం. ఇందుచేత వాతావరణం అంచనావేయడం అంత సులభం కాదు! బటర్ ఫ్లై ఎఫెక్ట్ మీద నేను రాసిన వ్యాసం చదవగలరు (బటర్ ఫ్లై ఎఫెక్ట్ అంటే ఏమిటి? దీనికి శాస్త్రీయ నిరూపణలు ఏమైనా ఉన్నాయా?కు ప్రవీణ్ కుమార్ (Praveen Kumar)యొక్క సమాధానం)
వాతావరణ నమూనాలలో ఫిజిక్స్:
నెల, సముద్రం, గాలి, మొక్కలు, మనుషులు, జీవులు సూర్యుడు మొదలైనవి మన వాతావరణ గమనాన్ని నిర్దేశిస్తాయి. వాతావరణ నమూనాలలో వీటిమధ్య పరస్పర చర్యలను కచ్చితంగా క్రోడీకరించాలి. వాతావరణ శాత్రవేత్తలకు వీటిమధ్య పరస్పర చర్యలకు సంబందించిన ఫిజిక్స్ మీద ఇంకా పూర్తి అవగాహనా లేదు. ఇందువలన కూడా మనం వాతావరణాన్ని కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నాం.