విమానం ఫై వర్షం కురుస్తుందా?

విమానాలు దాదాపు ఎక్కువ శాతం తేమ, వర్షం, ఐస్ పదార్దాలు కలిగిఉన్న మేఘాలలోకి వెళ్లకుండా ఫ్లైట్ పాత్ ప్లానింగ్ చేసుకుంటారు. వాతావరణ నిపుణుల సూచన మేరకు Air Traffic Controllers (ATC) పైలెట్స్ కి విమానం దట్టమైన మేఘాలలోకి వెళ్లకుండా ఆదేశాలు ఇస్తుంటారు. అంతే కాకుండా పైలెట్స్ కేబిన్ లో ఉన్న రాడార్ సహాయం తో పైలెట్స్ విమానం దట్టమైన మేఘాలలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకవేళ మేఘాలపై నుండి వెళితే వర్షం విమానం మీద కురిసే అవకాశం లేదు!

ఒకవేళ కొన్ని అనివార్య పరిస్థితుల్లో మేఘాలలో విమానం చిక్కుకున్నప్పుడు, తప్పకుండ ఆ మేఘాలలో ఉన్న వర్షపు నీళ్లను, ఐస్ పదార్దాలను, టుర్బులెన్సు ను విమానం ఎదురుకోవలసి వస్తుంది. మేఘాలలో ఉన్న ఐస్ పదార్దాలు కొన్ని సార్లు ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ కు కారణమయి పిడుగులకు కారణమవుతాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో విమానాన్ని అదుపులో పెట్టడానికి అనుభవమున్న పైలెట్స్ తప్పక అవసరం.

చాలా వరకు మేఘాలు సాధారణంగా విమానాలకు విపత్కర పరిస్థితులకు దారితీయవు, కానీ కొన్ని రకమైన మేఘాలు విమానాలకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాయి. ఉదాహరణకు “క్యూములోనింబస్” మేఘాలు.

ఇవి అరుదుగా ఏర్పడినా, ఒకవేళ ఏర్పడితే చాలా తీవ్రంగా , దాదాపు 20 వేల అడుగులవరుకు పైకి సాగగలవు. అంతే కాకుండా తీవ్రమయిన గాలి, వర్షం, ఐస్ పదార్దాలు ఉండడం వలన విమానం స్టడీ స్టేట్ లో ప్రయాణించడం చాలా కష్టంగా ఉంటుంది. పైగా పైలెట్స్ కు బయట అద్దాలనుండి ఏమి కనపడదు. అప్పుడు కేవలం ఫ్లైట్ ఇన్స్ట్రుమెంట్స్ సహాయంతోనే విమానంను పైలెట్స్ నడపవలిసి ఉంటుంది. ఇలాంటి సమయాల్లో పైలెట్స్ ఇన్స్ట్రుమెంట్ ఫ్లైట్ రూల్స్ (IFR) ఆధారంగా విమానంను నడుపుతారు.

కనుక దట్టమైన మేఘాలలోకి విమానం వెళితే తప్పకుండా వర్షమును కొన్ని సార్లు పిడుగులను కూడా ఎదురుకోవలసినదే! ఒకవేళ మేఘాలపై నుండి వెళితే వర్షం విమానం మీద కురిసే అవకాశం లేదు!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x