విమానం గాలిలో ఆగలేదు. కానీ హెలికాప్టర్ గాలిలో ఆగుతుంది.
ఈ రెండు గాలిలో తేలడానికి వాడే ఏరోడైనమిక్స్ సూత్రాలు ఒకటే అయినా, వాటి మెకానిక్స్ మాత్రం వేరు. ఇక్కడ విపులంగా రాసె ప్రయత్నం చేస్తాను.
మొదటిగా విమానం ముందుకు వెళ్ళడానికి విమానంలో ఉండే ఇంజన్లు దోహద పడతాయి. కానీ విమానం ఎగరడానికి మాత్రం విమానపు రెక్కలు ఉపయోగపడతాయి. విమానపు రెక్కలు కేవలం విమానం కొంత నిర్దష్ట వేగముతో వెళ్ళినపుడే విమానమును గాలిలో తేలగలిగేలా చేస్తాయి. ఆ వేగాన్ని స్టాల్ స్పీడ్ అని అంటారు. ఈ స్టాల్ స్పీడ్ విమానం బరువుమీద ఆదారపడి ఉంటుంది. కానీ మనం ముక్యంగా గమనించవలసినది ఏంటంటే, విమానం గాలిలో కదలకుండా ఉంటె, రెక్కలు విమానమును గాలిలో ఉంచలేవు కనుక విమానం కిందపడి కూలిపోతుంది. విమానం గాలిలో ఆగకుండా ప్రయాణం చేస్తేనే గాలిలో తేలుతుంది. కనుక విమానం కిందపడిపోకుండా ఎప్పుడు పైలెట్స్ విమానంను minimum స్టాల్ స్పీడ్ వేగంతో ముందుకు నడపవలిసి ఉంటుంది . ఇందువల్ల విమానం ఆకాశంలో ఆగడానికి ఆస్కారమే లేదు.
విమానం గాలిలో ఉన్నపుడు (cruise), కొన్ని సార్లు ఇంజన్లు ఆగిపోయే ఆస్కారం ఉంది. కానీ అప్పటికే కొంతవేగంగా కదులుతున్న విమానం, రెక్కలసహాయంతో కొంత దూరం ప్రయాణిస్తుంది (minimum స్టాల్ స్పీడ్ చేరుకునే వరకు). అలా కొంతదూరం తేలుతున్నపుడు మళ్ళీ ఇంజన్లను స్టార్ట్ చేయవచ్చు. కానీ దురదృష్టవశాత్తు, minimum స్టాల్ స్పీడ్ చేరుకునే లోపు ఇంజన్లు స్టార్ట్ చేసి వేగాన్ని పెంచుకోలేకపోతే విమానం కూలిపోతుంది.
కానీ హెలికాఫ్టర్ ముందుకు వెళ్ళడానికి మరియు గాలిలో తేలడానికి పైన ఉన్న మూడు రెక్కలు సహాయపడతాయి. అందుచేత పైలెట్స్ ఆకాశంలో కదిలే రెక్కల సహాయంతో హెలికాఫ్టర్ ను గాలిలో తేలుతూ ముందుకుపోకుండా ఆపవచ్చు.