జర్మనీ లో కార్ డ్రైవింగ్

నేను కార్ డ్రైవింగ్ జర్మనీ వచ్చాక నేర్చుకున్నాను. ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకుని లైసెన్స్ తెచ్చుకోవడం కొంత కష్టమే. కొంత సమయం, డబ్బు, ఓర్పు అవసరమే! కానీ ఒక్కసారి నేర్చుకున్న తరువాత కార్ డ్రైవింగ్ ను ఆనందంగా ఆస్వాదించవచ్చు.

మీకు నా డ్రైవింగ్ అనుభవాలు చెప్పే కంటే ముందు ఒక విషయాన్ని పంచుకోవాలి, నేను కార్ డ్రైవింగ్ ఇక్కడ చాలా కస్టపడి నేర్చుకున్న తరువాత ఒకరోజు కార్ నడుపుదామని బయటకు వెళ్ళాను, కానీ పరిస్థితి ఇదిగో ఇలా ఉంది. అపుడు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కంటే ముందు 10 నిముషాలు కార్ క్లీనింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు :p.

మొదటిగా జర్మనీ లో కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలంటే ఒక డ్రైవింగ్ స్కూల్ లో పేరును నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. నేను వెళ్లి ఒక మంచి డ్రైవింగ్ స్కూల్ లో నా పేరుని నమోదు చేసుకున్నాను. నా కంటి చూపు రీడింగ్స్, కొన్ని నా ఆరోగ్య వివరాలు కూడా ఆ డ్రైవింగ్ స్కూల్ లో నమోదు చేశాను. అన్ని వివరాలు సర్రిగా నింపిన తరువాత వరుసగా ఏడు రోజులు, ఒక రోజుకి కనీసం నాలుగు గంటల చొప్పున పాఠాలు విన్నాను ( కొన్ని సార్లు నిద్ర వచ్చినా మేల్కొగలిగాను :p).

నేను రోజు సర్రిగా సమయానికి వెళ్ళేవాడిని, పాఠాలు చాలా ఆసక్తిగా వినేవాడిని. పాఠాలలో ముక్యంగా,

1. డ్రైవింగ్ చేసేటపుడు నా మీద బాధ్యత.

2. ఓర్పు, సహనం, డ్రైవింగ్ లో ఎదుటివారిని గౌరవించడం వంటివి చెప్పారు (నేను సాధారణంగా ఎదుట వారిని గౌరవిస్తాను, కానీ నా మొహం చూసి మళ్ళీ ఎదుటివారిని గౌరవించడం గురించి మరొక్కసారి చెప్పారేమో :p).

3. వాహనం గురించి కొంత ప్రాథమిక సమాచారం.

4. ప్రతి రూల్ (rule) పూస గుచ్చినట్టు చెప్పారు.

ఉదాహరణకు రౌండ్ అబౌట్ (round about) దగ్గర తీసుకోవలసిన జాగ్రత్తలు, అంటే ఆ చక్రంలో తిరుగుతున్న వాహనాలకు మనం అడ్డం వెళ్ళకూడదు, ఒకసారి ఆ చక్రం లో వాహనాలు క్లియర్ అయ్యాకనే ఆ చక్రంలోకి మనం వెళ్ళాలి. లేదంటే ఆ చక్రం బయటనే మన వాహనాన్ని ఆపి వేచిఉండాలి [1] .

ఇలా చాలా రూల్స్ చక్కగా నేను స్కూల్ లో పాఠాల ద్వారా నేర్చుకున్నాను (నిజం చెపుతున్నాను, నేను నా చిన్నపుడు స్కూల్ లో కూడా విద్యార్థిగా పర్లేదు :p). ఆ ఏడు రోజులు నేను చాలా నేర్చుకున్నాను. మా క్లాస్ టీచర్ కొన్ని సార్లు వీడియో ప్లే చేసి ఇప్పుడు ఒకవేళ మీరు ఆ వీడియోలో కార్ నడుపుతుంటే, ఆ సందర్భం లో ఏమి చేస్తారు? లాంటి ప్రశ్నలు చాలా అడిగేవారు!

డ్రైవింగ్ స్కూల్ లో పాఠాలు అయిపోయాక, ఒక థియరీ పరీక్ష పెట్టారు. పరీక్షా కేంద్రానికి వెళ్లి పరీక్ష ఇవ్వవలసి ఉంటుంది. ఆ పరీక్ష అంత సులభం కాదు. దాదాపు పరీక్ష రాసె 30% మంది ఫెయిల్ అవుతారని ఒక నివేదిక చెప్తుంది [2]. నేను అదృష్టవశాత్తు మొదటి ప్రయత్నం లోనే పాస్ అయ్యాను! ఆ థియరీ పరిక్ష లో రూల్స్ మరియు కొన్ని పరిస్థితులను వీడియో రూపంలో ఇచ్చి మనలను ప్రశ్నల అడుగుతారు. ఉదాహరణకు ఒక ప్రశ్న ఇలా ఉంటుంది.

  • ఈ సైన్ (sign) కనపడితే మనం వేరే మార్గాల్లో వెళుతున్న వాహనాలకు ప్రయారిటీ ఇచ్చి మనం ఆగిపోవాలి. ఇలాంటి అనేక సైన్ ల మీద ప్రశ్నలు అడుగుతారు.
  • మరో ఉదాహరణ30-జోన్ (30-zone)[3] అనే ఒక ప్రాంతంలో ఎప్పుడు మన కుడి వైపు వెళ్లే వాహనాలకు ప్రయారిటీ ఇచ్చి మనం ఆగిపోవాలి.

థియరీ టెస్ట్ పాస్ అయ్యాక నేను ప్రాక్టికల్ లేసన్స్ కు (కార్ నడపడం) నమోదు చేసుకున్నాను. ఇక మొదటి సారి కార్ నడుపుతున్నప్పుడు చాలా కొత్తగా అనిపించింది (మన పక్కనే డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ ఉంటారు). ఇక్కడ కార్ ఎపుడు కుడిచేతి పక్కనే నడపాలి[4]. ఇది ముందు నాకు కొంత ఇబ్బందిగా అనిపించింది. నేను మన దేశంలో ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు ఎడమచేతి వైపు నడిపేవాడిని అందుకనే మొదట కుడిచేతి పక్కన కార్ నడపడం కొత్తగా అనిపించింది. తరువాత కొంత అలవాటు పడ్డాను. కానీ ఎక్కువగా కష్టంగా అనిపించింది మాత్రం డ్రైవింగ్ మార్గంలో ప్రతీ సైన్ బోర్డు చూడడం, దానికి అనుగుణంగా కార్ ను నడపడం.

మొదట్లో కొంచెం ఇబ్బందిపడినా తరువాత అలవాటు పడ్డాను. అలా ఒక 12 క్లాసులు తరువాత (ఒక క్లాస్ సుమారు 45 నిముషాలు ఉంటుంది), చివరిగా ఒక టెస్ట్ ఇవ్వాలి. ఆ టెస్టులో గవర్నమెంట్ నుండి ఒక ఆఫీసర్ మన కారులో కూర్చుంటారు. మనం కారును అయన చెప్పినట్టు ఊరులో మరియు హైవే మీద నడపవలసి ఉంటుంది. ఈ పరీక్ష చాలా కఠినంగా ఉంట్టుంది. సాధారణంగా ఈ పరీక్షలో మొదటి సారి పాస్ అవడం చాలా కష్టం. పైగా ఒకసారి ఈ పరీక్షకు నమోదు చేసుకోవడానికి సుమారు 300 యూరోలు ఖర్చు అవుతుంది.

మా బ్యాచ్ లో సుమారు 10 మంది ఆ రోజు పరీక్ష ఇస్తే అందులో ఇద్దరమే పాస్ అయ్యాము. అదృష్టం నేను గట్టు ఎక్కేసాను. నాకు ఆటోబాన్ లో ఫుల్ మార్కులు వచ్చాయి. జర్మనీలో ఆటోబాన్లు అంటే హైవే అని అర్ధం. ఈ ఆటోబాన్లు మీద స్పీడ్ లిమిట్స్ ఏమి వుండవు. నాకు ఆటోబాన్ మీద నడపడమంటే చాలా ఇష్టం.

ఇక్కడ ఒక అనుభవం మీతో పంచుకోవాలి, నా స్నేహితుడు ఆ రోజు డ్రైవింగ్ చాలా బాగా చేసాడు కానీ ఒక తప్పు వల్ల ఆ రోజు టెస్ట్ ఫెయిల్ అయ్యాడు. తాను ఆటోబాన్లో లేన్స్ (lanes) మారుతున్నపుడు షోల్డర్ చెక్ (shoulder check) చేయలేదు.

మనం సాధారణంగా లేన్స్ (lanes) మారాలి అంటే ముందు మన కారులో ఉన్న సైడ్ మిర్రర్స్ మరియు సెంటర్ మిర్రర్స్ ను ఉపయోగించి చూసి, ఇండికేటర్ వేసి మారుతం కదా. అవ్వన్నీ చేసాక షోల్డర్ చెక్ అని ఉంటుంది, అంటే మన చూపు మన కార్ పక్కన అద్దాల మీదగా బయటచూసి అప్పుడు లేన్స్ (lanes) మారాల్సి ఉంటుంది. ఈ చిత్రంలో చూపించునట్టుగా,

అలా మొత్తానికి నా కార్ డ్రైవింగ్ పూర్తి అయింది. ఇక్కడ కార్ నడిపేటప్పుడు నాకు చాలా సంతోషంగా మరియు సురక్షితంగా గా అనిపిస్తుంది. శిక్షణ కఠినంగా ఉంటుంది కాబట్టి అందరు వాహనాలను నియమాలు తప్పక పాటిస్తూ నడుపుతారు. తద్వారా అందరికి మంచి జరుగుతుంది.


గమనిక: “పర్యావరణ కాలుష్యం దృష్ట్యా నేను నా ఆఫీస్ కి సైకిల్ మీద, లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉపయోగించి వెళ్తాను. కానీ కోన్ని అత్యవసర పరిస్థితుల్లోనే నా కార్ వాడతాను”

చిత్రమూలం:

  1. Shoulder checks: the why, when and how

ఫుట్‌నోట్స్:

[1] Stock Photo – traffic control, panoramic view to a round-about traffic with four roads, Brandenburg, Germany

[2] Driving in Germany

[3] https://routetogermany.com/drivingingermany/city-driving

[4] https://routetogermany.com/drivingingermany/city-driving

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x