ఏదైనా వస్తువు మన భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి కారణంగా పైనుండి దాదాపు 9.81 m/s2 త్వరణంతో తన వేగాన్ని పుంజుకుని భూమి మీదకు పడుతుంది.
మనం చిన్నపుడు టేబుల్ మీద నుండి పెన్సిల్ పడేసినా, అది నేలకు 9.81 m/s2 త్వరణంతో తన వేగాన్ని పుంజుకుని నేలను చేరుకుంటుంది.
మన శరీరం, కొన్ని వేల సంవత్సరాల నుండి పరిణామం చెందుతుతూ, భూమి గురుత్వాకర్షణ త్వరణంను తట్టుకోగలిగే కొంత సామర్ధ్యాన్ని అలవరుచుకుంది. ఈ గురుత్వాకర్షణ త్వరణం సంఖ్య, అంటే 9.81 m/s2 ను ఏరోనాటికల్ భాషలో 1G ఫోర్స్ (force) అని అంటారు (1 times Gravity ==1G).
యుద్ధ విమానాలు నడిపేటప్పుడు, పైలెట్స్ గురుత్వాకర్షణ త్వరణం సంఖ్య కంటే కొన్ని రేటింపు సార్లు అధికమైన త్వరణంను ఎదురుకోవలసి ఉంటుంది. పైలెట్స్ కఠినమైన శిక్షణ ద్వారా కొంత మేరకు అధికమైన త్వరణంను తట్టుకోగలిగే సామర్ధ్యాన్ని పొందుతారు. ఈ అధికమైన త్వరణంను తట్టుకోగలిగే సామర్థ్యం సాధారణమైన వ్యక్తులకు కొంత తక్కువే ఉంటుంది.
పైలెట్స్ ఎదురుకునే త్వరణంను (G-ఫోర్సెస్) మూడు విభాగాలుగా విభజించవచ్చు[1] :
- Gx: కొన్ని సందర్భాలలో, పైలెట్ ఛాతి నుండి వీపు భాగము దిశగా ఒక శక్తి (force) ప్రభావం చూపినప్పుడు, ఈ Gx త్వరణం పైలెట్ మీద ప్రభావం చూపుతుంది. Gx త్వరణం linear acceleration[2] ద్వారా కలుగుతుంది. ఈ శక్తి పైలట్ ను తన సీట్ వెనకకు నెడుతుంది. దీనిని Gx త్వరణం అని అంటాము. ఈ Gx త్వరణం (శక్తి) పైలెట్ ను తన సీట్ వెనకకు నెడుతుంది. సాధారణంగా మనం కారులో గాని ట్రైన్లో గాని ప్రయాణిస్తున్నప్పుడు, వేగంగా అవి ముందుకు కదిలినప్పుడు కొంత Gx త్వరణం ని మనం ఎదురుకుంటాం. కానీ యుద్ధ వినామాలు కేవలం కొంత దూరం లోనే గంటకు 160 మైళ్ళును[3]చేరుకోవాల్సి ఉంటుంది, లేదా వేగంగా ల్యాండ్ అయ్యి కొంత దూరంలోనే ఆగిపోవాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు పైలెట్ నాలుగు నుండి ఎనిమిది సార్ల రేటింపు గురుత్వాకర్షణ త్వరణంను (4G-8G), Gx త్వరుణ రూపంలో ఎదురుకోవలసి ఉంటుంది.
2. Gy: Gy త్వరణం పైలెట్ కు ఒక వైపు భుజం నుండి ఇంకో భుజం వైపుకు ఒక శక్తి ప్రభావం చూపించినప్పుడు కలుగుతుంది. ఈ Gy త్వరణం కి కారణం angular acceleration [4]. యుద్ధవిమానాలు కొన్ని సార్లు రోల్ (roll)
[5]అవుతూ ముందుకు వెళతాయి, వీటిని ఏరోబాటిక్ విన్యాసాలలో మనం చూడవచ్చు. ఇలాంటి సందర్భాలలో కూడా పైలెట్ దాదాపు నాలుగు నుండి ఎనిమిది సార్ల రేటింపు గురుత్వాకర్షణ త్వరణంను (4G-8G), Gy త్వరుణ రూపంలో ఎదురుకోవలసి ఉంటుంది.
3. Gz: పైన చెప్పిన వాటికంటే ఈ Gz త్వరణం ప్రమాదకరమైనది[6]. ఇది పైలెట్ తల నుండి కాళ్ళ దిశలో పనిచేసే శక్తి వలన ఏర్పడే త్వరణం. దీని వలన కొన్ని సార్లు పైలట్ గుండె నుండి మెదడుకు రక్తం ప్రవహించడం కష్టంగా మారుతుంది. ఒకవేళ కొంత సేపటికి మెదడులోకి రక్తం ప్రవాహం ఆగిపోతే పైలట్ స్పృహకోల్పోయే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి సందర్భాలు ఎదురుకునేందుకు పైలెట్స్ కు centrufuge machines [7] లో ప్రత్యేక శిక్షణను ఇస్తారు. ప్రత్యక సూట్ కూడా పైలట్ ధరించాల్సివుంటుంది [8]. ఈ Gz త్వరణంకు కారణం angular acceleration. విమానం పైనుండి కిందకు చక్కర్లు కొట్టాల్సిన సమయంలో సాధారణంగా ఈ Gz త్వరణం ఏర్పడుతుంది.
పైలెట్స్ ఎంత బాగా ఎక్కువ ఈ G ఫోర్సెస్ (forces) తట్టుకోగలరో, యుద్ధ సమయంలో అంత బాగా విమానంను శత్రుమూక నుండి తపించగలరు.
ఫుట్‌నోట్స్
[1] https://www.faa.gov/pilots/safety/pilotsafetybrochures/media/acceleration.pdf
[3] https://www.faa.gov/pilots/safety/pilotsafetybrochures/media/acceleration.pdf
[5] Aircraft principal axes – Wikipedia
[6] https://www.faa.gov/pilots/safety/pilotsafetybrochures/media/acceleration.pdf
[7] High-G training – Wikipedia
[8] g-suit – Wikipediaయుద్ధ విమానాలు నడిపేటప్పుడు పైలట్ల