ప్రతి రంగంలో పోటీ ఉన్నటె పీహెచ్డీ పూర్తి చేసిన విద్యార్థులకు కూడా తాము ముందు ముందు ఎంచుకునే కెరీర్ లో పోటీ తప్పకుండా ఉంటుంది. కానీ ఒక మంచి పీహెచ్డీ విద్యార్థికి తన ప్రతిభకు తగ్గటే మంచి ఉద్యోగం, తద్వారా మంచి జీతం తప్పకుండా లభిస్తుంది.
సాదారణంగా పీహెచ్డీ పూర్తి చేసిన తరువాత మీ ఆసక్తికి అనుకూలంగా మీరు ఈ మూడు రంగాలలో ఒకదానికి ప్రవేశించవచ్చు,
- అకాడమిక్ రంగం
- ఇండస్ట్రీ రంగం
- బిజినెస్ రంగం
ఈ మూడు రంగాలలో ఉన్న అవకాశాలు, లోతుపాతులు , సగటు జీతాలు (మోస్తరు అంచనా మాత్రమే) ఇప్పుడు చూదాం,
1. అకాడమిక్ రంగం: మీకు పీహెచ్డీ పూర్తి చేసిన తరువాత కూడా పరిశోధన మీద ఆసక్తి ఉంటె, అలాగే విద్యార్థులకు పాఠాలు చెప్పే ఆసక్తి ఉంటె, మీరు అకాడమిక్ రంగంలో స్థిరపడవచ్చు. అకాడమిక్ రంగంలో వివిధ రకముల విభాగాల్లో మీ ఆసక్తికి తగ్గట్టు మీరు ఒక విభాగాన్ని ఎంచుకోవచ్చు. ఈ విభాగాల్లో ముఖ్యమైనవి,
a. పోస్ట్ డాక్టరేట్: ఒకవేళ మీ లక్ష్యం ఒక ప్రముఖ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పని చేయాలంటే, లేదా ప్రముఖఇన్స్టిట్యూట్ లో టీం లీడర్ గా చేరాలంటే మీకు పోస్ట్ డాక్టరేట్ అనుభవం ఉంటె మంచిది. మీరు మీ పీహెచ్డీ పట్టా పొందిన తరువాత పోస్ట్ డాక్టరేట్ గా ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ కింద చేరవచ్చు, లేదా ఒక పరిశోధన సంస్థలో పోస్ట్ డాక్టరేట్ గా ఒక రీసెర్చ్ టీం లీడర్ కింద చేరవచ్చు.
ఉదాహరణకు ప్రముఖ యూనివర్సిటీలు తీసుకుంటే భారతీయ సాంకేతిక విద్యాసంస్థ, అల్ ఇండియా ఇంస్టిట్యూయే అఫ్ మెడికల్ సైన్సెస్, ఢిల్లీ యూనివర్సిటీ మొదలైన వాటిల్లో పోస్ట్ డాక్టరేట్కు మీ పేరును దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ప్రముఖ పరిశోధన కేంద్రాలలో, ఉదాహరణకు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, ఇండియన్ఇంస్టిట్యూయే అఫ్ ఆస్ట్రోఫీసిక్స్ , ఇండియన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ మొదలైన సంస్థల్లో మీ పేరును నమోదు చేసుకోవచ్చు.
ఇక పోస్ట్ డాక్టరేటులో జీతం గురించి వస్తే, దేశాన్ని బట్టి, ఇంస్టిట్యూట్ని బట్టి జీతం మారుతుంది. ఉదాహరణకు,
- మన దేశంలో సగటు నెలకు: ₹40,000—₹70,000 వరకు మీరు సంపాదించవచ్చు.
- అమెరికా లో సగటు నెలకు : $3000—$4000 డాలర్లు సంపాదించవచ్చు.
- యూరోప్ లో సగటు నెలకు : €3000—€4000 యూరోలు సంపాదించవచ్చు.
b. టెనుర్ ట్రాక్ (Tenure Track) ఫ్యాకల్టీ లేదా గ్రేడ్ II అసిస్టెంట్ ప్రొఫెసర్: అమెరికా, యూరోప్ మరియు కొన్ని పాశ్చాత్య దేశాల్లో పీహెచ్డీ తరువాత నేరుగా టెనుర్ ట్రాక్ ఫ్యాకల్టీ గా అంటే వారి యూనివర్సిటీలో మిమ్మలను ప్రొఫెసర్ గా నియమిస్తారు. ఈ టెనుర్ ట్రాక్ లో మీరు పరిశోధనతో పాటు విద్యార్థులకుపాఠాలు చెప్పవలసి ఉంటుంది (ఎక్కువ శాతం విద్యా బోధనే ఉంటుంది). ఈ టెనుర్ ట్రాక్ ఫ్యాకల్టీ లో మీకు సుమారు 6 సంవత్సరాల వరకు ఉద్యోగ భద్రత ఉంటుంది. తరువాత మీ ప్రతిభను బట్టి మీకు ఆ యూనివర్సిటీలో శాశ్వత ప్రొఫెసర్ గా ఉద్యోగ నియమం ఉంటుంది.
మన భారతదేశంలో అయితే ప్రముఖ యూనివర్సిటీలు మిమ్ములను గ్రేడ్ II అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియమిస్తాయి. ఇందులో మీకు దాదాపు 3 సంవత్సరాల ఉద్యోగ భద్రత ఉంటుంది. తరువాత మీ ప్రతిభను బట్టి శాశ్వతనియామకం ఉంటుంది. గ్రేడ్ II అసిస్టెంట్ ప్రొఫెసర్ తరువాత గ్రేడ్ I అసిస్టెంట్ ప్రొఫెసర్, తరువాత అసోసియేట్ప్రొఫెసర్ దాని తరువాత ప్రొఫెసర్ గా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది.
ఇక జీతం విషయానికి వస్తే,
- అమెరికా లో టెనుర్ ట్రాక్ ఫ్యాకల్టీకి సగటు నెలకు : $3500—$5500
- యూరోపులో టెనుర్ ట్రాక్ ఫ్యాకల్టీకి సగటు నెలకు : €3000—€4500
- భారత దేశంలో గ్రేడ్ I అసిస్టెంట్ ప్రొఫెసర్కి సగటు నెలకు : ₹70,000—₹90,000
c. దేశ ప్రముఖ పరిశోధన కేంద్రాలలో శాస్త్రవేత్తగా: మీరు పీహెచ్డీ తరువాత నేరుగా మీకు నచ్చిన దేశంలో ఉన్న ప్రముఖ పరిశోధనా కేంద్రాలలో శాస్త్రవేత్తగా చేరవచ్చు. సాధారణంగా శాస్త్రవేత్తల పోస్ట్లు అవసరం ఉన్నపుడు ఆ కేంద్రాల నుండి అధికారిక ప్రకటన వస్తుంది. మీ ఆసక్తికితగ్గట్టు మీ అప్లికేషన్ ను మీరు దరఖాస్తు చేసుకోవచ్చు.
భారత దేశంలో అయితే సైంటిస్ట్ D స్థానాలకు మీరు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు పీహెచ్డీ పట్టా ఉండి ఇంటర్వ్యూలో మంచి ప్రతిభ కనపరిస్తే మీకు సెలక్షన్ లిస్టులో ప్రాధాన్యత ఉంటుంది.
అలాగే ఇతర దేశాలలో ఉన్న పరిశోధనా కేంద్రాలలో పేర్మనంట్ శాస్త్రవేత్తగా మీరు మీ అప్లికేషన్ ను దరఖాస్తుచేసుకోవచ్చు. ఉదాహరణకు నాసా, చైనీస్ అకాడమీ అఫ్ సైన్సెస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ హెల్త్ (యూ.స్), స్పానిష్ నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్ మొదలైనవి.
- భారత దేశంలో సైంటిస్ట్ C స్థానానికి మీకు సగటు నెలకు ₹67700— ₹90,000/-
- అమెరికా లో టెనుర్ ట్రాక్ ఫ్యాకల్టీకి సగటు నెలకు : $4500—$5500/-
- యూరోపులో టెనుర్ ట్రాక్ ఫ్యాకల్టీకి సగటు నెలకు : €3000—€4500/-
d. ప్రైవేట్ యూనివర్సిటీ లేదా కళాశాలలో బోధన: మీకు ఆసక్తి తగ్గ దేశంలో ప్రైవేట్ యూనివర్సిటీ లేదా కళాశాలలో మీకు పీహెచ్డీ తరువాత చక్కని అవకాశాలు ఉంటాయి. కొన్ని యూనివర్సిటీలో ఎక్కువగా విద్యాబోధనకు ప్రాధాన్యం ఇస్తాయి, కొన్ని యూనివర్సిటీలు పరిశోధనా మరియు విద్య బోధనకు సమాన ప్రాధాన్యం ఇస్తాయి. కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు ప్రబుత్వ ఉద్యోగాలకన్నా అధిక జీతం ఇస్తాయి, కానీ పని వత్తిడి కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఉదాహరణకు మన దేశంలో కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు, అమిటీ యూనివర్సిటీ, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, వెల్లూర్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ, బిర్లా ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ మొదలైనవి.
కొన్ని యూరోప్ మరియు యునైటెడ్ స్టేట్స్ యూనివర్సిటీలు కేవలం గ్రాడ్యుయేట్ డిగ్రీ వరకే బోధన ఉంటుంది, మీకు పీహెచ్డీ తరువాత ఇలాంటి చోట్ల ఉపాధ్యాయ పదవికి మీరు నేరుగా అప్లికేషన్ పంపవచ్చు.
యూనివర్సిటీ పేరుకు తగ్గట్టుగా జీతాలు ఉంటాయి, కాబ్బటి ఇక్కడ జీతాలు మధ్య వ్యతాసం చాల ఎక్కువ ఉంటుంది.
భారత దేశంలో మీకు సగటు నెలకు ₹40000 — ₹1,20,000/-
అమెరికా లో ఫ్యాకల్టీకి సగటు నెలకు : $3500—$4500/-
యూరోపులో ఫ్యాకల్టీకి సగటు నెలకు : €2800—€3500/-
2. ఇండస్ట్రీ రంగం : చాల మంది తమ బాచిలర్స్ లేదా మాస్టర్స్ డిగ్రీ అవ్వగానే ఇండస్ట్రీ లో మంచి జాబ్ సంపాదిస్తారు. వారికి మంచి జీతం కూడా లభిస్తుంది. కానీ ఇండస్ట్రీ రంగంలో కూడా పీహెచ్డీ చేసిన వారి ఆవశ్యకత చాల ఉంటుంది. ఉదాహరణకు కొన్ని MNC కంపెనీలలో డిపార్ట్మెంట్ అఫ్ రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ లో నిప్పుల అవసరం ఉంటుంది. ఒకవేళ మీకు పీహెచ్డీ ఉంటె, మీరు నేరుగా ప్రాజెక్ట్ లీడ్, లేదా పరిశోధన గ్రూప్లో ప్రముఖ స్థానం లభిస్తుంది. ఉదాహరణకు మైక్రోసాఫ్ట్ ఇండియా, ఇన్ఫోసిస్, విప్రో, టాటా, రిలయన్స్, ప్రముఖ బయో టెక్నాలజీ, ఫార్మా సంస్థల్లోమీ దరఖాస్తును నమోదు చేసుకోవచ్చు. ఇక వేరే దేశాల్లో ఆపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ప్రముఖ బ్యాంకులు మొదలైనసంస్థల్లో మీకు అవకాశం ఉంటుంది.
సాధారణంగా మీకు అకాడమిక్ రంగంలో కంటే ఇండస్ట్రీలో జీతాలు కొంత ఎక్కువగానే ఉంటాయి. సంస్థకు తగ్గట్టుమీ జీతం ఉంటుంది. మన దేశంలో నెలకు సగటు ₹100000/- నుండి ₹200000/- వరకు రావచ్చు, విదేశాల్లో కూడాఅకాడమిక్ రంగంలో కంటే ఇండస్ట్రీలో జీతాలు కొంత ఎక్కువగానే (5%-20%) ఉంటాయి.
3. బిజినెస్ రంగం: మీ పీహెచ్డీ చేసిన రంగాల్లో ఉన్న ప్రముఖ కంపెనీలలో మీరు బిజినెస్ కన్సల్టెంట్ గా కంపెనీ బోర్డుకి సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు. మీ ఎక్సపెర్టిస్ కంపెనీ బిజినెస్ స్ట్రాటజీస్ కి చాల ఉపయోగ పడతాయి. ఈమధ్యకాలంలోపీహెచ్డీ పూర్తి చేసి బిజినెస్ కన్సల్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అప్లికేషన్స్ సంఖ్య పెరిగన్నటు కొన్ని వార్తా పత్రికలూ తెలియచేశాయి. సాధారణంగా అకాడమిక్ రంగాలలోకంటే బిజినెస్ రంగంలో మీకు జీతం ఎక్కువలభిస్తుంది. మీకు మంచి ఆలోచనలు ఉంటె మీ సొంతకంపెనీ కూడా పెట్టుకోవచ్చు.
4. మరి కొన్ని అవకాశాలు:
ఈ మధ్య డేటా సైన్స్ , డేటా అనలిటిక్స్ , బిగ్ డేటా ప్రాముఖ్యత పెరగడంతో ఎక్కువ శాతం కంపెనీలు పీహెచ్డీ చేసినవారిని డేటా సైంటిస్టులుగా నియామకాలు చేపడుతున్నాయి. మీకు డేటా సైన్స్ మీద ఆసక్తి ఉంటె ఇది మంచి అవకాశం.
పరిశోధనా పత్రాల ప్రచురణ కంపెనీలలో మీరు సైంటిఫిక్ ఎడిటోరికాల్ అండ్ పబ్లిషింగ్ స్టాఫ్ లో ఉద్యోగాలకు కూడా దరకాస్తు చేసుకోవచ్చు.
చివరిగా ..
పీహెచ్డీ చేయడానికి ఎంతో ఆసక్తి, కుతూహలం, కష్టం, మరియు నిరంతర ప్రయత్నం ఉండాలి. ఒక్కసారి మీ పీహెచ్డీ పూర్తి అయినా తరువాత అవకాశాలు మిమల్ని వెతుకుంటూ వస్తాయి. కాని నా దృష్టిలో నిజమైన పీహెచ్డీ లక్ష్యం — “ఇప్పటికి మానవాళికి ఉన్న జ్ఞానాన్ని మన ప్రయత్నంతో ఇంకొంత విస్తరింపచేయడం, కొత్త జ్ఞానాన్ని అన్వేషించడం” .
ధన్యవాదాలు,