- డేవ్ పేటెలీ[1] యూనివర్సిటీ అఫ్ షెఫిల్డ్ ఇంగ్లాండ్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. వారు అమెరికన్ జీఒఫీసికల్ యూనియన్న్ లో (American Geophysical Union, AGU) రాసిన బ్లాగ్ నుండి సేకరించిన సమాచారం మీకు అందించే ప్రయత్నం చేస్తాను.
- హిమాలయ పర్వత శ్రేణుల్లో నంద ఘున్తి (Nanda Ghunti) అనే మంచు కొండ పై భాగం మీద సుమారు ఒక నెల ముందు భారీ పగుళ్లు ఏర్పడినట్టు శాస్త్రవేత్తలు ఉపగ్రహ ఛాయా చిత్రమును బట్టి కనుగున్నారు.
- అ మంచు కొండ పైన ఏర్పడిన పగుళ్లు బలహీనపడి, ఫిబ్రవరి 7వ తారీఖున కొండచరియలు విరిగిపడటంతో [2]భారీ మోతాదులో రాళ్ళూ, మంచు కొండ పైనుంచి సుమారు రెండు కిలోమీటర్లు లోతుకు జారి పడటం జరిగింది. ఇంగ్లీష్ లో దీన్ని ల్యాండ్ స్లైడ్స్ (Land Slides) అని అంటారు.
- స్కాట్ వాట్సన్ గారు ట్విట్టర్లో [3] పంచుకున్న 3-D చిత్రం సహాయంతో ఉత్తరాఖండ్లో గ్లేసియర్ ప్రమాదం మూలకారణమైన కొండ భాగాన్ని మనం చూడవచ్చు. సుమారు 200 చదరపు మీటర్లు గల మంచుపలక విరిగి సుమారు 2 కిలోమీటర్ల కిందకి జారిపడినట్టు మనకు కనపడుతుంది. దీని వల్లన భారీగా మట్టి, రాళ్ళ పగుళ్ళు, మంచు, దుమ్ము దూళి కిందకి జారి పడడం జరిగింది.
- భారీసంఖ్యలో మంచు, నీళ్లు, దుమ్ము కొండ పైనుండి లోయలో పడడం వలన, కింద ఉన్న రిషిగంగా నది, ధౌలిగంగా నది, అలకనంద నదులలో నీళ్ళని భారీసంఖ్యలో ముందు నెట్టడం జరిగింది. దీని వలన చమోలి జిల్లాలో వరదలు సంభవించాయి[4].
- దురదృష్టవశాత్తు చమోలి ప్రాంతంలోని రెండు జలవిద్యుత్ కేంద్రాలలో పనిచేస్తున్న కార్మికులు, మరియు జలవిద్యుత్ కేంద్రాలకు సంబందించిన సొరంగాల్లో పనిచేస్తున్న కార్మికులు, ఈ అకస్మాత్తు వరదలలో చిక్కుకుని ఉన్నారని సమాచారం[5]. సహాయక చర్యలు ఇంకా జరుగుచున్నవి.
కొండ చర్యలు విరిగి పడడానికి కారణం ఏంటి?:
- వాలుగా మరియు పొడవుగా ఉన్న కొండ ప్రాంతాలలో, లేదా కఠినమైన పర్వత ప్రాంతాలలో కొన్ని సార్లు తమ సొంత బరువు తట్టుకోలేక కొండచరియలు విరిగిపడే అవకాశం ఉంది.
- కొండ రాయాలో నాణ్యత తగ్గడం, లేదా భూకంపం రావడం, వాతావరణ మార్పు, అధిక వర్షపాతం, లేదా మంచు కురవడం వంటివి కొండ చర్యలు విరిగి పడడానికి కొన్ని చెప్పుకో దగ్గ కారణాలు[6].
ముందుగానే ఇలాంటివి పసిగట్టలేమా?
- ఆనూహ్యంగా విరిగిపడే కొండచరియలను ముందుగా పసిగట్టటడం కొంత కష్టమే. అనేక కారణాలు వలన ఏర్పడే ఇలాంటి సంఘటనల కోసం ఎంతో లోతయిన పరిశోధన అవసరం.
- సాంకేతిక పరికరాలను ఉదాహరణకు ఉపగ్రహాలు, insitu ఆబ్సెర్వేషన్స్, సెన్సార్లు ఇలాంటి ప్రాంతాలలో అమర్చడం చాలా ముఖ్యం.
- చివరిగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చెప్పటాల్సిన చర్యలను, NDFR బృందాలకు మరియు సహాయ సిబందికి ప్రత్యేక శిక్షణ, హెలికాప్టర్స్ సహాయంతో దట్టమైన కొండప్రాంతాలకి వెళ్లి సహాయ చర్యలను చేపట్టడం చాలా అవసరం.
ఫుట్నోట్స్
[1] The catastrophic landslide and flood in Chamoli in Uttarakhand
[5] Uttarakhand glacier burst updates: At least 30 workers trapped in tunnel, rescue efforts on, says official – India News , Firstpost
[6] Geology Cafe.com2021 ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్లో గ్లేసియర్ ప్రమాదం