హబుల్ టెలిస్కోప్ 1990వ సంవత్సరంలో నాసా సంస్థవారు మన విశ్వాన్ని అనేక కోణాల నుండి పరిశోధన జరపడానికి ఈ టెలిస్కోప్ ను భూమి ఉపరితలం నుండి దాదాపు 500Km దూరంలో ఉన్న కక్ష లోకి ప్రవేశపెట్టారు[1] .
ఇప్పటివరకు హబుల్ టెలిస్కోప్ లో అమర్చిన శాస్త్రీయ పరికరాలు ఖగోళ శాస్త్రంలో అనేక కొత్త విషయాలను అర్థంచేసుకునుటకు దోహదపడ్డాయి. సోలార్ రేడియేషన్ యొక్క వివిధ లక్షణాలను కొలవగల అనేక సాంకేతిక పరికరాలు టెలిస్కోప్ యొక్క ముఖ్య కంప్యూటర్ తో అనుసందంచిబడినవి. ఈ కంప్యూటర్ పరికరాల నుండి వచ్చే సమాచారాన్ని దాచి కింద ఉన్న కంట్రోల్ స్టేషన్ కు తరంగాల ద్వారా సమాచారాన్ని పంపుతుంది[2] .
జూన్ 16 , 2021 న నాసా వారి వెబ్-సైటులో పెట్టిన సమాచారం మేరకు, జూన్ 13 , 2021 న హబుల్ టెలిస్కోప్ యొక్క ముఖ్య కంప్యూటర్లో తలెత్తిన సాంకేతిక సమస్యలవల్ల హబుల్ టెలిస్కోప్ సేవలను తాత్కాలికంగా నిలిపి వేశారు. అన్ని సాంకేతిక పరికరాలను సేఫ్ మోడ్ లో పెట్టారనికూడా తెలియచేసారు[3] .
జులై 16, 2021 న దాదాపు నెల నిరంతర పరిశోధన మరియు అనేక పరీక్షల తరువాత హబుల్ టెలిస్కోప్ ముఖ్య కంప్యూటర్ కి విద్యుత్ శక్తిని అందించే ఒక పరికరంలో సాంకేతిక సమస్య ఉందని గమనించారు. ఈ సమస్యకు పరిష్కారంగా హబుల్ టెలిస్కోప్ లో ఉన్న బ్యాక్అప్ (backup ) విద్యుత్ శక్తిని అందించే పరికరాన్ని మరియు అదనంగా అమర్చిన రెండో కంప్యూటరుని మొదలుపెట్టి తిరిగి హబుల్ టెలిస్కోప్ ని ప్రారంభించారు.
మన విశ్వ రహస్యాలను అందించడానికి జులై 17 న తిరిగి హబుల్ టెలిస్కోప్ సేవలు ఎదావిదిగా ప్రారంభం అయ్యాయి. తిరిగి ప్రారంభం అయిన తరువాత హబుల్ టెలిస్కోప్ తీసిన ఒక చిత్రం ఇదిగో మీరే చూడండి[4] ,
ఫుట్‌నోట్స్
[1] Hubble Space Telescope – Wikipedia
[3] NASA Returns Hubble Space Telescope to Science Operations
[4] First Images from Rebooted Hubble: Astronomers Peer at Oddball Galaxies