స్వీయ మూల్యాంకనం!


ఎటువంటి పరిస్థితులలోనూ మీరు తప్పకుండా పాటించేవి, మీకు మీరే పెట్టుకున్న నియమాలు ఏమిటి?

నా అంతరాత్మ: మాస్టారు, సమయం వచ్చింది, ఇక మోగించండి….

భలే మంచి ప్రశ్న. చాలా నియమాలు పెట్టుకున్నాను అండి. అందులో కొన్ని ముఖ్యమైనవి మీ ముందుకు తీసుకువస్తాను.

నా అంతరాత్మ: ముందుకి తీసుకురావడానికి నువ్వేమన్నా TV9 యాంకర్ వా , తెలుగు చలన చిత్ర నిర్మాతవా? ఎక్కువ చేయకుండా ముందు మొదలెట్టు….

  • మొదటిగా జీవితంలో మందు, సిగ్గరెట్టు ఎప్పుడు తాగకూడదు అనే నియమం పెట్టుకున్నాను అండీ.

నా అంతరాత్మ: నీకు అంత సీను ఉందారా? శుక్రవారం సాయంత్రమే మొదలెడతావుగా , నిజం చెప్పు కాస్త….

అంటే ఎదో స్నేహితులు ఉన్నపుడు అప్పుప్పుడు ఎస్తుంటాను, అది కూడా పెద్దగా ఎం లేదు, ఏదో రెండు పెగ్గుల విస్కీ లేదా ఒక గ్లాసు వైన్.

నా అంతరాత్మ: ఇవి మందులే కదా?

అవును అనుకో ….

సర్లే సర్లే ఈ మొదటి నియమం తూచ్!

  • రెండో నియమం, నేను చాలా మంచి విద్యార్థిగా ఉండాలని . నన్ను చూసి అందరు ఆదర్శం గా తీసుకోవాలి.

నా అంతరాత్మ: మనిషన్న తరువాత కాస్త బుద్ధి ఉండాలి రా! ఏడో తరగతిలోనే ఎక్కాలు తప్పావు , ఇంజనీరింగ్ లో ఒక బ్యాక్ లాగు ….. ?

సర్ సర్లే రెండోది కూడా తూచ్ …

  • మూడోది, అస్సలు అమ్మాయిల వంక ఎప్పుడు చూడను అండి!

నా అంతరాత్మ: ఎనిమిదొవ తరగతిలోనే నీకు “రీటా మీఠా బాటా” ఉన్నారు కదా! ఓవర్ ఆక్షన్ చేస్తున్నావ్ ఏంది రా వేస్ట్ ఫెలో, ఇప్పటికి చూస్తుంటావ్ కదా!

రీటా మీఠా తెలుసు, ఈ బాటా ఎవరు …? ఒహ్హ్ ఇంజనీరింగ్ లో కదా …

సర్ సర్లే మూడోది కూడా తూచ్ …

  • నాల్గొవది, నేను ఆకాశం రంగు చిత్రాలు అస్సలు చూడను అండి.

నా అంతరాత్మ: అబ్బో ఇది మరీను రా బాబు, నువ్వు జానీ సీన్స్ అభిమాన సంఘ నాయకుడని విన్నాను?

వామ్మో, వాయ్యో ఎందుకులే , ఈ విషయం పక్కనపెటెదాం! ఇది పెద్ద తూచ్!

  • అయిదోవది, సమాజం, తల్లిదండ్రులు బంధాలు అంటే చాల గొరవం!

నా అంతరాత్మ: “బందిపోటు సమాజం, అవసరానికి బంధుత్వాలు” అనే పుస్తకం రాసింది నువ్వే కదా?

అంటే అది, అది …. సర్లే ఇది కూడా తూచ్!

నా అంతరాత్మ: ఇన్ని తూచ్ ల ముందు ఇంకా నీకేం నియమాలు ఉన్నాయి రా పిచ్చి నా డాష్ గా

ఛీ ఛీ ఈ అంతరాత్మగాడు నన్ను చంపేస్తునాడు! సార్ పవన్ గారు ఈ ప్రశ్నకు సమాధానం రాసె ఇంట్రెస్ట్ దొబ్బేసింది సార్….

నా డవలాలో అంతరాత్మగాడు నన్ను విసిగించేస్తున్నాడు సార్!

నా అంతరాత్మ: నువ్వు చెప్పలేవు గాని, నీ Quora మిత్రులకు నేను చెప్తాను నువ్వు పాటించే నియమం.

మిత్రులారా, “వీడు సమాజంలో కొంత నటించాలి కాబట్టి నటిస్తాడు కానీ, వాడు వాడ్ని ఎప్పుడు మోసంచేసుకోడు

స్వస్తి,

ప్రవీణ్.

ఈ సమాధానానికి నాకు నచ్చిన ఒక కొటేషన్ :

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x