విలన్

శర్వానంద్: చంపు ….. ఇంకా నిజమేంటో తెలియని భ్రమలో ఉన్నాను….నిజాన్ని జీర్ణించుకునే లోపు చంపు!

చావుకన్నా నిజమే భారమని వదిలేస్తున్నావా?

పాతికేళ్ళు నువ్వు చేసిన పాపాన్ని, చేసిన గూటిలోనే పాతిపెట్టావ్…..

ఎన్ని పురాణాలూ వెతికిన నిన్ను తెలగొట్టే పాత్రలేదు. నీకు తీర్పు ఇచ్చే శాశనం లేదు.

సాయి కుమార్: ఒక్కసారి ఆ పురాణాలూ దాటివచ్చి చూడు, అవసరాలకోసం దారులు తొక్కే పాత్రలు తప్ప, హీరోలు విలన్లు లేరు ఈ నాటకం లో!

మనిషిలో కూరుకుపోయిన ధర్మం ఒక్కటే ….. అహం…

ప్రతి పురుగును కదిలించే నిజం ఒక్కటే…. ఆకలి….

తపించే ఆత్మనల్లా శాసించే శక్తీ ఒక్కటే….. ఆశ…..

ఆ ఆశ ముసిరినప్పుడు ఆలోచన మసకబారుతుంది, నీతి నిజాయితులు కొలిమిలో కొవ్వొత్తుల కరిగిపోతాయి.

ఈ సంభాషణ ప్రస్థానం సినిమాలో తండ్రికి ( సాయి కుమార్), పెంచుకున్న కొడుకుకి మధ్య జరుగుతుంది (శర్వానంద్). ఈ సినిమాలోని ప్రతినాయకుడు పాత్ర ( సాయి కుమార్) తెలుగు చెలనచిత్రసీమలోనే ఒక అద్భుతం అని నేను భావిస్తున్నాను. ఈ కధ చాల లోతుగా ఉంటుంది, క్లిష్టమైన మానవ సంబంధాల మధ్య జరిగే సంఘర్షణను, ఈ ప్రకృతి తత్వమును, దర్శకుడు (దేవా కట్ట) సునాయాసంగా తెరమీదకు ఎక్కించారు. ముఖ్యముగా, ఈ సినిమాలోని పాత్రల మధ్య ఆలోచనల సంఘర్షణ ప్రేక్షకులను ఆలోచింపచేస్తాయి. ప్రతినాయకుడు పాత్ర లో సాయి కుమార్ గారు జీవించారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. Dialogue డెలివరీ, నటన, భావ వ్యక్తీకరణలలో సాయి కుమార్ గారు చేసిన ప్రయత్నం ప్రశంశనీయం. ఇలాంటి క్యారెక్టర్ సృష్టించిన దేవా కట్ట గారికి కృతజ్ఞతలు ఎలా చెప్పాలో అంతుచిక్కడం లేదు.


ఈ సన్నివేశం జోకర్ ను Batman తలమీద కొట్టిన తరువాత జరుగుతుంది (The Dark Knight)

Joker: Never start with the head, the victim will get fizzy and can not feel the pain further!

ఎప్పుడు తలమీద కొట్టి మొదలుపెట్టకు, బాధితుడికి తర్వాత నువ్వు కొట్టిన దెబ్బలు సరిగా అనిపించవు.

Batman: You wanted me, here I am.

నీకు కావలిసింది నేనే కదా, ఇప్పుడు నేను నీ ముందున్నాను!

Joker: I wanted to see what you do? And you dint disappoint. You let five people die. You let dent take your place. Even to a guy like me thats cold.

నువ్వు ఏం చేయగలవో నేను చూడాలనుకున్నా, నన్ను నువ్వు డిస్సపాయింట్ చేయలేదు. నీ వళ్ళ 5 మంది చనిపోయారు. హార్వే డెంట్ నీ స్థానం లో కుర్చోపెట్టావ్, నాలాంటి వాడికికూడా ఇది దారుణంగా అనిపిస్తుంది.

Batman: Where is Harvey Dent?

హార్వే డెంట్ ఎక్కడ?

Joker: Those mob fools thinks once you were gone, so that they can get back things as they were. But I know the truth. There is never going back. You have changed things. Forever.

ఇక్కడ క్రిమినల్స్ అందరూ నువ్వు చచ్చిపోయాక మల్లి వాళ్ళ పాత వ్యాపారాలను మొదలుపెడదాం అనుకుంటున్నారు. కానీ నిజమెంతో నాకు తెలుసు, అది ఎప్పటికి జరగదు.

Batman: Then why do you want to kill me?

మరి నన్ను ఎందుకు చంపాలని అనుకున్నావ్?

Joker: Ha Ha, I dont wanna kill you, what would I do without you? Go back to those mob dealers. No No, You complete me.

(వెకిలిగా నవ్వుతూ), నేను నిన్ను చంపాలనుకున్నానా? నేను నిన్ను ఎప్పటికి చంపను, నువ్వు లేకుండా నేను ఇక్కడ ఎం చేస్తాను, చూడు ….నువ్వు నన్ను పూర్తి చేస్తావ్ (నా ఆలోచనలను సంపూర్ణం చేస్తావని దీని అర్ధం).

Batman: You are garbage who kills for money.

నువ్వు కిరాయికోసం మనుషులను చెంపే హంతకుడివి.

Joker: Do not talk like one of them, you are not. Even if you would like to be. To them you are just a freak. Like me, they need you right now, when they don’t, they will cast you out. See their morals, their ethics, … bad joke. They are only good until the world allows them to be. When the chips are down, these civilized people they will eat each other. See I am not a monster, I am just ahead of curve.

నువ్వు కూడా అందరిలాగా మాట్లాడకు. వారి దృష్టిలో నాలాగా నువ్వు ఒక పిచ్చివాడివే. ఇప్పుడు ని అవసరం వాళ్లకు వుంది, ఎప్పుడైతే ని అవసరం తీరిపోతుందో వాళ్ళు నిన్ను వెలివేస్తారు. వారి నీతి నిజాయితీలు, వారి ధర్మం ఒక పెద్ద జోక్! ఈ ప్రపంచం వారిని మంచిగా ఉంచినంత సేపే వారు మంచివాళ్ళు, అవసరమయితే ఈ నాగరిక మనుషులు ఒకారికిఒకరు పీకు తినుకుంటారు. చూడు నేను అందరూ అనుకుంటున్నటు మృగాన్ని కాదు, మీ అందరికంటే ఆలోచనలో ముందువున్నాను అంతే!

ఈ సంభాషణ బట్టే అర్ధమవుతుంది , ఇక్కడ రెండు భావాల సంఘర్షణ జరుగుతుందని. ఈ ప్రపంచంలో స్వార్ధం, చెడు మాత్రమే ఉన్నాయి అని, మనుషులు అవసరం కొరకే మంచిగా నటిస్తూవుంటారని జోకర్ నమ్మకం. మరో పక్క Batman కు నీతి నిజాయితీ, మానవత్వం మీద చాల నమ్మకం. Batman భావజాలం తప్పు అని రుజువు చేయడానికి ఈ సినిమాలో చాల ప్రయత్నాలు చేస్తువుంటాడు జోకర్. చివరికి గెలుపు ఎవరిది ( భావజాలంలో గెలుపు) అనే అంశం మీరు ఈ సినిమాలో చూస్తే బాగుంటుంది. జోకర్ వేషం వేసిన హీత్ లెడ్జెర్ అద్భుత నటన కనపర్చారు. ఈ వేషం కోసం దాదాపు ఆరునెలలు రీసెర్చ్ చేసి, తనని తాను జోకర్లా పరకాయప్రవేశం చేసాడు. దురదృష్టవ శాత్తు హీత్ లెడ్జెర్ సినిమాలో చేసిన నటనకు వచ్చిన ఆస్కార్ అందుకోలేకపోయారు (చనిపోవడం వల్ల). ఈ సినిమాకు హైలైట్ ప్రతినాయకుడు జోకర్!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x