ప్రపంచ వ్యాప్తంగా విమానాలు కొన్ని స్టాండర్డ్ (standard) మార్గాలలోనే దాదాపుగా ప్రయాణించ వలసి వస్తుంది. ఈ స్టాండర్డ్ మార్గాలను మనం ఫ్లైట్ పాత్స్ (flight paths) అని అనవచ్చు. ఎక్కువ శాతం ఈ మార్గాలలోనే విమానాలు ప్రయాణం చేయవలసి వస్తుంది. ఇందుకు కొన్ని కారణాలు:
1. ప్రపంచ దేశాల పైనుండి విమానాలు వెళ్ళవలసి ఉన్నందున, వేరు వేరు దేశాల మిలిటరీ స్థావరాలమీద విమానాలను వెళ్లనివ్వకుండా ఆంక్షలు విధిస్తారు.
2. కొన్ని ముఖ్యమయిన మరియు రహస్య స్థావరాల మీద నుండి విమానాలను వెళ్లనివ్వరు.
3. జెట్ స్ట్రీమ్స్, అంటే ఆకాశం పైన ఎత్తులో కొన్ని వేగంగా వీచే గాలి దిశలను బట్టి ఫ్లైట్ పాత్స్ నిర్ణయిస్తారు.
4. విమానపు రాడార్ కింద నెల మీద ఉండే కొన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ రాడార్ పరిధిలోనే ఉండవలసిన కారణంగా, కొన్ని చెక్ పాయింట్స్ మీద నుండే వెళ్లవలిసి ఉంటుంది.
ఈ కారణం చేత కొన్ని స్టాండర్డ్ ఫ్లైట్ పాత్స్ ను ముందుగా నిర్ణయిస్తారు. అన్ని విమానాలు ఈ ఫ్లైట్ పాత్స్ మీదనే ప్రయాణం చేయవలసి వస్తుంది, అవి ఎలా పడితే అలా వెళ్లే వీలు లేదు. కింద చిత్రములో కొన్ని స్టాండర్ ఫ్లైట్ పాత్స్ మీరు చూడవచ్చు.
Image: https://gis.icao.int/gallery/TRAFFICFLOW2019zoomsimpOP.pdf
పైన చెప్పిన విషయాలతో పాటు మరి కొన్ని నియమాలు ఏమిటంటే , విమానాల మధ్య కనీసం మూడు నుంచి అయిదు మెయిళ్ల దూరం వుండవలసి ఉంటుంది, అలాగే ఒక విమానం పైన గాని కింద గాని ఇంకో విమానం వెళ్ల వలిసి వస్తే కనీసం వెయ్యి ఆడుగులు దూరం ఉండవలసి ఉంటుంది..
కొన్ని సార్లు వాతావరణం అనుకూలించని కారణంగా విమానాశ్రయాల్లో విమానాలు ల్యాండ్ అవ్వడానికి వీలు పడదు. ఇల్లాంటి సందర్భాలలో స్టాండర్డ్ ఫ్లైట్ పాత్స్ లో ట్రాఫిక్ జాం అవ్వడం సాధారణం. ఇలాంటప్పుడు విమానాలుకు గో అరౌండ్ (go around) ఆదేశాలు ఇవ్వబడతాయి. ఆ విమానం కొంత ట్రాఫిక్ క్లియర్ అయ్యేవరకు చూట్టు చక్కర్లు కొట్టాల్సిందే. మరి కొన్ని సార్లు విమానం దిశను మర్చి వేరే ప్రాంతాలకు పంపడం జరుగుతుంది. తుర్బులెన్స్, తూఫాను, బీకరమయిన వర్షపాతం నమోదవినప్పుడు ఈ ట్రాఫిక్ జాంలు అవ్వడం సహజమే. ఎలాంటి ట్రాఫిక్ జాం సందర్భాలలో అయినా ఒక విమానం కు మరో విమానంకు మధ్య కనీస దూర నియమం పాటించవలసి ఉంటుంది.
Image: Flightradar24 Data for FlyDubai Flight 981 | Flightradar24 Blogవిమానాల ట్రాఫిక్ జామ్!