విద్యావ్యవస్థ, నా అనుభవం

విద్యావ్యవస్థలో మార్పులు సూచించే అంత గొప్ప ఆలోచనలు నాకు లేవు.

నేను లెక్చరర్ గా (ఇంజనీరింగ్ విద్యార్థులకు) మంగళూరులో కొన్ని రోజులు పనిచేసాను. అక్కడ నా అనుభవాలు రాస్తాను. అప్పుడు నా వయసు సుమారు 24 సంవత్సరాలు అనుకుంట!

మొదటి రోజు పాఠం చెప్పడానికి క్లాసుకి బయలుదేరాను. కొంత భయం వేసింది! కానీ మొత్తానికి ఏదోలా క్లాసులోకి వెళ్ళాను.

నన్ను చూడగానే వీడు లెక్చరర్ ఏంటి అనుకున్నారేమో! ఎందుకంటే అప్పుడు నేను చాలా చిన్నగా ఉండేవాడిని.

I was certainly the youngest faculty there! Perhaps the most weirdest too!

నేను వెళ్ళగానే అందరు లేచి నించున్నారు. గుడ్ మార్నింగ్ సార్ అనే ఆర్తనాదాలు కూడా మొదలయ్యాయి. నాకు బీపీ పెరిగిపోయింది.

ఆ క్లాస్ రూంలో నా మొదటి వాక్యం,

“could you please stop standing and wishing me good morning from tomorrow?, and for heaven sake please stop calling me sir, call me Praveen” అనే సరికి వారు నావంక విచిత్రంగా చూసారు!

తరువాత నన్ను నేను పరిచయం చేసుకుని, విద్యార్థులను పరిచయం చేసుకోమని చెప్పాను. పరిచయంతో పాటు వారి లక్ష్యాలను కూడా చెప్పమని చెప్పాను. చాలా మంది విద్యార్థులు వారు చదివే చదువుకు వారి జీవిత లక్ష్యాలకు పెద్దగా సంబంధం లేదు అని నాకు అనిపించింది.

“Ok, ladies and gentleman thank you for introducing. For those of you who are not interested to listen to me, go back and do something which you like. But do not disturb me and your friends while I teach”

అని చెప్పేసరికి, మొదట విద్యార్థులు కొంచెం సిగ్గుపడ్డా, తరువాత నిదానంగా వెనకకు వెళ్లి కొంత మంది ఫోన్ చూసుకోవడం, లాప్టాప్ చూసుకోవడం , వేరే పుస్తకాలు చదువుకోవడం లాంటివి చేసారు.

వారానికి అయిదు క్లాసులు ఉన్నాయి కదా, నేను మీకు మూడు క్లాసులే చెప్తాను, రెండు క్లాసులు మాత్రం మనం సినిమా కానీ వీడియోస్ కానీ చూదాం అని చెప్పాను. మొదట్లో ఇది విద్యార్థులకు కొత్తగా అనిపించినా తరువాత నిదానంగా అలవాటు పడ్డారు.

ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో ఫ్లైట్ మెకానిక్స్ మరియు కొంత ఏరోడైనమిక్స్ చెప్పే క్రమంలో నావిర్ స్టోక్స్ సమీకరణాలు చెప్పే ప్రయత్నం చేశాను.

PC: [1]

ఈ సమీకరణం చెప్పే సమయంలో ప్రతి term ఏమి చెపుతుందో , దానిని మనం ఎలా అర్ధం చేసుకోవాలో, కొంత దాని చరిత్రను కూడా చెప్పాను.

ఉదాహరణకు మీరు ఇంటి మేడపైకి వెళ్లి మీరు గాలి తీవ్రతను రాబోయే సమయంలో అంచనా వేయాలంటే మనకు నావియర్ స్టోక్స్ ఈక్వేషన్స్ సహాయపడతాయి అని చెప్పి,

మొదటి టర్మ్ గాలి తీవ్రత కాలాన్ని బట్టి ఎలా మారుతుంది అని అంచనా వేయడానికి,

రెండోది అడ్వేక్షన్ అంటే చుట్టుపక్కలనుండి మన వైపు వస్తున్న గాలి ప్రభావం,

pressure difference , viscous friction , diffusion , gravity మొదలైన terms కూలంకుషంగా చర్చించాను.

తరువాత పుస్తకం లో ఉన్న ఒక లెక్క చేసాం. ఆ లెక్కలో భూమి మీద వుండే గాలి తీవ్రత, గాలి స్వభావం వంటి అంకెలను వేసి Navier-Stokes solve చేసాము. కానీ విద్యార్థులలో అంత స్పందన కనపడలేదు.

నేను ఒకసారి అలోచించి, ఒక పని చేదాం మనం ఇదే లెక్కను Mars planet లో పరిస్థితులను బట్టి అంచనా వేసి solve చేదాం అనగానే చాల మంది విద్యార్థులు ఆశక్తి కనపరిచారు.

వెంటనే వాళ్ళ ఫోనులు తీసి మార్స్ లో కొన్ని obervations వెతికి లెక్క కట్టారు. దాదాపు ఇరవయి నిముషాలు ఆసక్తితో పని చేసారు.

ప్రతి శుక్రవారం మరియు శనివారం aircraft crash investigations లాంటి డాక్యూమెంటరీస్ మరియు science movies చూసే వాళ్ళం నా క్లాసులో.

కొన్ని రోజులు తరువాత విద్యార్థులతో పాటు ఒక చిన్న ఏరోప్లేన్ డిజైన్ చేసి ఎగరువేశాము (ఇది వేరే కళాశాలలో). ఆ చిన్న నమూనా చేయడానికి చాల చర్చించాం, నేర్చుకున్నాం కొన్ని పుస్తకాలు తిరగేశాం. ఇది ఒక చిన్న వీడియో!

నేను ఎప్పుడు ఆ కళాశాల లైబ్రరీ లో ఉండేవాడిని, స్టాఫ్ రూంలో ఎప్పడు ఉండేవాడిని కాదు. కొంత మంది విద్యార్థులు నన్ను కలవడానికి వచ్చి అక్కడే ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడేవారు.

కొన్ని రోజులకు నాకు అక్కడ ప్రిన్సిపాల్ కి కొన్ని అభిప్రాయభేదాలు వచ్చి నేను resign చేశాను. వాళ్ళు మీరు సిలబస్ మొత్తం చెప్పలేదు, చెప్పాలి, మరియు మీరు పరీక్షా విధానం తగ్గట్టుగా బోధించాలి అని పేచీపెట్టారు. కానీ నాకు ఆ విషయాల పట్ల ఆసక్తిలేక ఉద్యోగం మానేసాను.

నేను ఎంతవరకు లెక్చరర్ గా సక్సెస్ అయ్యానో నాకు తెలియదు. కానీ మొదట్లో నా క్లాస్ లో చాల మంది వెనక కూర్చుని వేరే పనులు చేసుకున్న విద్యార్థులు నిదానంగా కొంత ముందుకు వచ్చి క్లాస్ ఆసక్తితో వినడం ప్రారంభించారు.

“I do not know how much the students have learned from me, but I have learned a lot from them.

The best thing that I have done is to let them fly on their own”


ఫుట్‌నోట్స్

[1] 

Navier–Stokes equations – Wikipedia

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x