వాతావరణ అంచనాలో శాటిలైట్ వ్యవస్థకూ కొన్ని పరిమితులు …

శాటిలైట్ వ్యవస్థ రాబోయే వాతావరణాన్ని అంచనా వేయడంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. అలాగని శాటిలైట్ వ్యవస్థ పూర్తిగా వాతావరణ శాస్త్రం లో ఉన్న సమస్యలన్నీ తీర్చలేదు. శాటిలైట్ వ్యవస్థకు చాలా పరిమితులు ఉన్నవి. అవి ఏంటో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను.

మన భారత వాతావరణ శాఖ (IMD) మన దేశంలో వాతావరణ అంచనా నివేదికను ఇస్తుంది. వాతావరణ అంచనాను మనం కొన్ని విభాగాలుగా విభజించవచ్చు. అవి,

  1. నౌకాస్టింగ్ (nowcasting)
  2. స్వల్పకాలిక వాతావరణ అంచనా (short term weather forecast)
  3. మధ్యకాలిక వాతావరణ అంచనా (medium range weather forecast)
  4. సుదూరకాలిక వాతావరణ అంచనా (long range weather forecast)
  • నౌకాస్టింగ్ : నౌకాస్టింగ్ లో రాబోయే రెండు నుండి నాలుగు గంటలలో వాతావరణం ఏ విదంగా ఉండబోతుందో అంచనా వేసి ప్రజలకు చెప్పే ప్రక్రియ. ఇందులో ఎక్కువుగా శాటిలైట్ వ్యవస్థ నుండి మరియు రాడార్లతో సేకరించిన సమాచారం ఉపయోగించి రాబోయే రెండు గంటలలో మన వాతావరణంలో జరగబోయా మార్పులను అంచనా వేస్తారు. దీనికి ఒక మంచి ఉదాహరణ, వైశాఖపట్నం తీరంను తాకబోయే రెండు గంటల ముంది హుద్ హుద్ తుపాను యొక్క స్థితిగతులను, వర్షపాతమును అంచనాను వేయడంలో విశాఖపట్నం రాడార్ స్టేషన్ మరియు మచిలీపట్టణం రాడార్ స్టేషన్ లోనుండి వచ్చిన డేటా చాలా ఉపయోగపడింది అని చెప్పుకోవచ్చు. అదేవిదంగా జీఓస్టేషనరీ (geostationary) శాటిలైట్ వ్యవస్థ మరియు పోలార్ శాటిలైట్ వ్యవస్థ కూడా చాలా ఉపయోగపడ్డాయి.

పిక్చర్ క్రెడిట్స్: Weather Satellite Images: If the Earth Took a Selfie

  • స్వల్పకాలిక వాతావరణ అంచనా: ఇందులో సాధారణంగా రాబోయా ఒక రోజు నుండి ఏడు రోజులవరకూ వాతావరణంని అంచనా వేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో ఎక్కువగా వాతావరణ నమూనాలు వాడడం జరుగుతుంది. ఈ వాతావరణ నమూనాలు ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు గణితంలోని సూత్రాలు ఆధారంగా కంప్యూటర్ సహాయంతో వాతావరణాన్ని అంచనా వేయడం జరుగుతుంది. ఇందులో శాటిలైట్ వ్యవస్థ నుండి లభించిన డాటాను పాక్షికంగా వాతావరణ నమూనాలతో వాడి వాతావరణం అంచనా వేయడం జరుగుతుంది. ఇందులో ప్రధాన పాత్ర వాతావరణ నమూనాలదే, అయితే శాటిలైట్ వ్యవస్థ నుండి లేదా రాడార్ డేటా నమూనాలకు కొంత సహాయపడగలవు అంతే!
  • మధ్యకాలిక (కొన్ని నెలలముంది వాతావరణం అంచనావేయడం) మరియు సుదూరకాలిక (సంవత్సరాలు లేదా దశాబ్దాలు) ప్రక్రియలోకూడా వాతావరణ నమూనాలదే ముఖ్యపాత్ర, శాటిలైట్ వ్యవస్థ కొంత సహాయపడగలదు అంతే!

మన దేశ వాతావరణ శాఖ ఉపయోగిస్తున్న కొన్ని శాటిలైట్ పేర్లను ఇక్కడ ప్రస్తావించదలచాను!

కల్పనా (Kalpana) -1 : ఈ శాటిలైట్ మన దేశం మీద కమ్మునుకున్న మబ్బులను ప్రతి అరగంటకు ఒకసారి ఫోటో తీసి వాతావరణ శాఖకు అందిస్తుంది. అంతేకాకుండా వాతావరణంలో తేమ శాతం, గాలి దిశా మరియు తీవ్రత, వర్షపాతం, సముద్రపు నీరు ఉపరితల ఉష్ణోగ్రత మొదలైన ముఖ్యమని వాతావరణ రీడింగ్స్ చేసి వాతావరణ శాఖకు అందిస్తుంది

పిక్చర్ క్రెడిట్స్: INSAT- 3D, KALPANA-1 : A REVOLUTIONARY TRIUMPH . . . . .

ఇంసెట్ (INSAT)-3A : ఈ శాటిలైట్ కూడా ఎక్కువ రెసొల్యూషన్ తో ఫోటో తీసి భూమిఉపరితలం మీద ఆకుపచ్చ శాతం మరియు ఏరోసోల్ (గాలిలో చిన్న చిన్న పదార్థాలు) ఒక్క శాతం కొలుస్తుంది.

చివరిగా శాటిలైట్ వ్యవస్థ వాతావరణం అంచనా వేయడంలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది, కానీ ఈ వ్యవస్థకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయని మనం అర్థంచేసుకోవడం కూడా చాలా ముఖ్యమైన అంశమే!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x