దురదృష్టం!
ఇప్పుడు ఏ క్షణాన ఏమి జరుగుతుందో తెలియని ఇలాంటి పరిస్థితులు చూస్తుంటే ఈ ప్రశ్నకు ఎందుకో సమాధానం రాసేయాలని ఉంది! సో రాసేస్తున్న ……..
- ముందు నా ఫామిలీ డాక్టర్స్ ని సంప్రదించి, నా శరీరంలో అవయవాలు ఎవరికన్నా ఉపయోగపడితే తీసుకోవడానికి ఒక ఫారం మీద సంతకం పెట్టేస్తాను.
- నేను మరణించిన తరువాత నా శరీరం ఒక ఆసుపత్రిలో డాక్టర్ చదివే విద్యార్థులకు డెమొగా ఉపయోగ పడితే, నా శరీరాన్ని నా కుటుంబం చూసింతరువాత ఆసుపత్రి వారు స్వాధీనం చేసుకోవాలని ఫారం లో సంతకం పెటేస్తాను.
- నా శ్రీమతి గారికి నా అకౌంట్లో ఉన్న మొత్తంలో 50 % మరియు నా తల్లిదండ్రులకు 50 % అందేలా బ్యాంకు వాళ్లకు పత్రాన్ని అందిస్తాను.
ఇక నా పర్సనల్ విషయాలకు వస్తే
1 . మా ఊరి రైల్వేస్టేషన్లో పిట్ట గోడ ఎక్కి , శ్రీను గాడి కొట్టులో కలిపిన ఒక మంచి కాఫీ తాగుతూ, వచ్చి పోయేవారిని ఒక అరగంట చూడాలి.
2. అక్కడ నుండి సరాసరి మా ఊరి సముద్రం ఒడ్డులోకి చేరుకొని, కొంతే సేవు ఏకాంతం గా సముద్రంతో గడపాలి. సముద్రాన్ని ఒక ప్రశ్న కూడా అడగాలి, “కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద మొట్టమొదటి జీవించే క్రిములను తయ్యారు చేసి, జీవితం అనే ఒక పెద్ద నాటకానికి తెరలేపి, రేపు నన్ను తీసుకుపోతున్నావ్. ఇంతకీ ఈ నాటకంలో పాత్రలకి, వాటి మధ్యలో బందాలకి, బాధలకి , కోరికలకు ఉన్న ఆంతర్యం నీకైనా తెలుసా? “
3 . వివాహం జరిగిన తరువాత కొన్ని నియమాలకు కట్టుబడి ఉండాలి, కానీ మనం పోతున్నాం అని తెలిసింతరువాత కొంత స్వేచ్ఛ వచ్చేస్తుంది కదా!! అందుకే యవ్వనంలో నేను ప్రేమించిన ఇద్దరి అమ్మాయిలను (10 వ తరగతిలో ఒకరు, ఇంజనీరింగ్ లో ఒకరు) కలిసి ఒక గంట మాట్లాడాలని ఉంది!
4 . సిగరెట్ ఒక పాకెట్ తాగాలి (నేను సిగెరెట్ కొన్ని సందర్భాలలో తాగిన మాట వాస్తవం, కానీ మానేసి చాలా సంవత్సరాలు అవుతుంది)!
5. నా జీవితంలో జరిగిన బాధలన్ని ఒకసారి తలుచుకుని, జోకర్ సినిమాలో “ఆర్థర్ ఫ్లెక్” డ్రెస్ వేసుకుని, మొఖానికి మేకప్ వేసుకుని , I want to dance down through the steps. In every step, I would like to throw my hard-time memories one after the other out of my heart! I shall relinquish all my pain through my dance!
6. నా డైరీలో నేను చనిపోయే ముందు రాసె చివరి లైన్ “I lived my life, I loved my life and I have no regrets”. Love, Praveen!