శ్యామల పెద్దాపురంలో పేరు పొందిన రికార్డింగ్ డాన్సర్. వాళ్ళమ్మ, అమ్మమ్మలు ఆ రోజుల్లో పెద్దాపురం చుట్టుపక్కల గ్రామ్మాన్ని ఒక ఊపు ఊపారు. వారిద్దరికంటే శ్యామల పదిరెట్లు అందంగా ఉంటుంది. ఊరిలో వారందరు పెద్దాపురం మాధురి దీక్షిత్ అనేవారు శ్యామలను. పెద్ద పండక్కి పెద్ద పెద్ద వాళ్లంతా వారి ఊర్లకి పిలిపించుకుంటారు శ్యామలను. పక్క ఊర్లల్లో పెసిడెంట్ దగ్గరనుండి తాగుబోతు రాయుళ్లదాకా అందరు శ్యామల అందానికి మంత్రముగ్దులు అయినవాళ్లే! శ్యామల “ఆ అంటే అమలాపురం” పాటకు స్టెప్పు ఏస్తే గాని పెద్ద పండగ జరిగినట్టు కాదు ఆ ఊర్లల్లో!
శ్యామల మన చెరుకూరులో రేపు రాత్రి డాన్స్ పోగ్రామ్ పెట్టుకుంటారంట, నిన్ను అడగమని చెప్పారు, రాత్రి ఒంటిగంటకు మొదలెట్టాలంట, వస్తావా మరి అని అడిగాడు శ్యామల బావ. నేను రాలేను బావ, రేపు ఉదయాన్నే మన ఎస్పి గారి ఇంటికి రామన్నారు అని శ్యామల బదులిచ్చింది. ఓసనీ, ఎం పెట్టావే ఎస్పి గారికి నిన్ను వదలడం లేదు, బలే గేలం వేశావు, బాగా సుఖపెడుతున్నావు అనుకుంట కదా?. నువ్వు నోరుమూసుకో బావ, ముందు పని చెప్పు అని శ్యామల గట్టిగా అనేసరికి, సరేలే ఇవ్వాళ రాత్రి డాన్స్ వేసి రేపు ఉదయాన్నే పది గంటలకు వెల్దువులే ఎస్పి గారి దాగరకు! అవతల మంచి బేరం, పాతిక వేలు ఇస్తామంటున్నారు.
సరే మంచి డబ్బే కదా అని బేరం ఒప్పుకుంది శ్యామల. రాత్రికి తన బావతో కలసి చెరుకూరి బయలుదేరింది శ్యామల. స్టేజి మీదకు చేరుకోగానే, ఆ ఊరి జనం అంత ఎగిరెగిరి శ్యామలను చూడడం మొదలెట్టారు. ఒసే శ్యామల ఒక సారి ఎత్తి చూపి అని ఒకడు, రాత్రికి ఎంత తీసుకుంటావే అని ఇంకోడు, “నీ పెట్టకు తాళం తీసి” అనే పాటకు స్టెప్ వేయవే లంజ అని ఇంకోకడు.
జనాల అరుపులకు చలించని శ్యామల, తన బావతో కలసి డాన్స్ వేయసాగింది. ఇంతలో పోలీసువారు జీపు శబ్దం వినగానే సగం మంది జనం అక్కడనుండి పారిపోయారు. పోలీసువాళ్ళతో బేరానికి దిగిన చెరుకూరి పెసిడెంటు గారు అయిదువెలు ముట్టజెపి పోలీసులకు సర్దిచెప్పారు. ఆ వూళ్ళో అందరిని వదిలి పెట్టి శ్యామలను తన బావను అరెస్ట్ చేసి బండి ఎక్కిస్తుండగా, శ్యామలను గుర్తుపట్టిన ఒక పోలీసోడు, ఇది మన ఎస్పి గారి లపాకిరా అని మిగతా పోలీసు వారితో చెప్పి, ఎందుకు వచ్చిన గోల అని శ్యామలను తన బావను వదిలేసాడు.
మరుసటి రోజు ఉదయం 10 గంటలకు ఎస్పి గారి ఇంటికి వెళ్లిన శ్యామల, కాళ్ళు లేని ఎస్పి గారి 10 ఏళ్ళ కుమారుడికి బట్టలు మార్చి, అన్నం పెట్టి స్కూల్ కి తయారు చేసింది.