కుంకుడి వాసన పోక మునుపే తోటలో కోసిన మందారాన్ని తన పొడవాటి జడకు జత చేసింది సంధ్య. తన మేడలో కొత్తగా చేరిన పసుపు తాడును అద్దంలో చూసుకుంటూ, ఎర్ర కుంకుమను నుదుటిమీద అద్దుకునసాగింది. ఇష్టంగా కొనుకున్న చెవిపోగులు కోసం తన అలంకార పెట్టిలో వెతుకుతుండగా ….,
సంధ్య, సంధ్య అని పిలుపులు వినపడ్డాయి సంధ్యకు.
తలుపు తీసేలోగానే లోపలికి వచ్చి సంధ్యను ఎత్తుకుని గిరా గిరా తిప్పి మంచం మీద పడుకోబెట్టాడు అరవింద్.
ఏంటి అరవింద్ చాలా సంతోషంగా ఉన్నావ్ ఈరోజు?
ఈరోజు మరి మన మొదటి రాత్రి కద సంధ్య, అందుకే …,
చిన్నపటి నుండి ఒకే హాస్టల్లో పెరిగాం, ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నాం, ఇప్పుడు కొత్తగా మొదటి రాత్రి ఏంటి అరవింద్?
అలా కాదు సంధ్య, మన స్నేహతులు, హాస్టల్ వార్డెన్లు, దాతలు అందరు కలిసి మన పెళ్లి నిన్ననే చేసారు కదా, ఏంటో మొదటిసారిగా ఒక కుటుంబం, బాధ్యత , మనకంటూ ఒక సంఘం అనే లోతయిన భావాలు కలిగుతున్నాయి. ఈరోజు ఒక పరిపూర్ణ మనిషిగా అనిపిస్తుంది సంధ్య, అందుకేనెమో ఈ సంతోషం.
అరవింద్ నన్ను చెత్తబుట్టలో వదిలేసి వెళ్లిపోయిన కన్నవారిని తలుచుకుని ఏడవని రోజంటూ లేదు, కానీ గత ఆరు సంవత్సరాలుగా నాకు వాళ్ళు గుర్తేలేరు! నీతో గడిపిన ప్రతి క్షణం నాకు ప్రత్యేకమే. నువ్వు ఏంటో కుటుంబం, బాధ్యత, సంఘం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావ్. నాకు అవ్వన్నీ తెలియవు అరవింద్, నాకు నువ్వు తప్ప వేరే ప్రపంచం తెలియదు అని చెపుతూ అరవింద్ ను తన గుండెకు గట్టిగా హత్తుకుని అరవింద్ జుట్టు నిమర సాగింది సంధ్య.
సంధ్య కురిపిస్తున్న ప్రేమ అరవింద్ కు ఊపిరి ఆడనివ్వకుండా చేస్తుంది. అరవింద్ ఒక్కసారి నన్ను గట్టిగా పట్టుకోవా అని సంధ్య అడగగా, తన జీవితంలో ఎప్పటికి సంధ్య దూరం కాకూడదు అన్నంత గెట్టిగా పట్టుకుని ప్రేమించ సాగాడు అరవింద్. వారిరువురి సంగమంలో సంధ్య నుదుట మీద ఎర్ర కుంకుమ సైతం కరిగి సంధ్య కనుబొమ్మల మీదకు ప్రవహించ సాగింది.
చీర అంచున దాగిన సంధ్య కాళ్ళను అరవింద్ తన పెదవులతో ముద్దాడగా, సంధ్య తన ఇంటి నుండి ఉత్తరం వైపు పరుగులు తీస్తు హిమాలయ పర్వత శ్రేణులలో ఉన్న ఎత్తైన మంచుకొండల మీద నాట్యం చేస్తున్న అబ్దుతమైన అనుభూతికి లోనయింది. సంధ్య కాళ్ళ మీద ఉన్న చీరను నెమ్మిదిగా పైకి తీస్తున్న అరవింద్ , సంధ్య కాళ్ళ రోమాలు నిక్క పొడుచుకోటం గమనించి తన చేతులతో సంధ్య కాళ్లను నిమరడం మొదలుపెట్టాడు. అరవింద్ సంధ్య రెండు కాళ్ళను పైకెత్తి సంధ్య మీదకు వెళ్లగా, సంధ్య అరవింద్ ను గట్టిగా పట్టుకుని, అరవింద్ మొట్టమొదటి సారి నా జీవితంలో నా కాళ్లు నా ఆదీనంలో ఉన్న అనుభవం కలుగుతుంది, నేను మొట్టమొదటి సారి నా జీవితంలో నడుస్తున్న అనుభవం కలుగుతుంది, మొదటి సారి నా కాళ్లతో నాట్యం చేస్తున్న అనుభవం కలుగుతుంది అని చెపుతూ, అరవింద్ ను తనలో ఏకం చేసుకుంది సంధ్య.
మరుసటిరోజు ఉదయాన్నే తన వీల్ చైర్ లో కూర్చుని తిరిగి వంట గది వైపుకు వెళ్ళసాగింది సంధ్య!
ఫుట్‌నోట్స్
[1] First Night of Farewell Metal Print by Bobby Dar