మేఘాలు …

తప్పకుండా వర్షిచే మేఘాలు మరియు వర్షించని మేఘాల రంగులు వేరే వేరుగా ఉండే అవకాశం ఉంది. ఇందుకు మూల కారణాలు, మేఘం యొక్క ఎత్తు, మేఘంలో ఉన్న ఐస్ మరియు నీటిచుక్కల మోతాదు.

ముందుగా మేఘం ఎలా ఏర్పడుతుందో తెలుసుకుందాo:

భూమి మరియు సముద్రం ఉపరితలం మీద ఉన్న తేమను గాలి వాతావరణ పై భాగానికి కొన్ని సందర్భాలలో మోసుకెళ్తుంది. తేమ ఆకాశం పై భాగములో ప్రయాణిస్తున్నపుడు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడం వలన, తేమ చిన్న చినుకులుగా ఏర్పడి మేఘాలుగా ఏర్పడుతుంది. అయితే ఈ మేఘాలు ఏర్పడిన ఎత్తును బట్టి, ఏర్పడిన విస్తారమును బట్టి వేరు వేరు పేర్లతో పిలవబడతాయి (స్ట్రాటస్, క్యూములోనింబస్, సిఱుస్, ఆల్టోస్ట్రేట్స్).

చిత్ర మూలం: The types of clouds: everything you need to know

మేఘాలు నలుపు మరియు తెలుపుగా ఉండడానికి గల కారణాలు:

మేఘాలలో కాంతి విక్షేపణ (dispersion of light) సాధారణ౦గా వాతావరణం కంటే కొంత అధిక శాతంలో ఉంటుంది. దీనికి మూల కారణాలు మేఘాలలో ఐస్ మరియు వర్షపు చినుకులు శాతం. వీటి వలన కాంతిలో అన్ని రంగులు దాదాపు సమానంగా విక్షేపణ జరుగుతుంది. అన్నీ రంగులు సమానంగా విక్షేపణ జరిగినప్పుడు, ఆ రంగుల సమూహణం మన కంటికి తెల్ల రంగుగా కనపడుతుంది. ఇందువల్ల మనకు మేఘాలు తెల్ల రంగులో కనపడతాయి

ఆకాశంలోని వాయువులు ఎక్కువగా బులుగు రంగుని విక్షేపణ చేస్తాయి. ఇందువలన మనకు ఆకాశం బులుగు రంగులో కనపడుతుంది.

కొన్ని మేఘాలు ఎక్కువ ఎత్తు ఉండడం వలన, పైభాగంలో కాంతి మొత్తం విక్షేపణ జరిగి, మేగం లోపల భాగానికి కాంతి వెళ్లే వీలు ఉండదు. ఇందువలన మేగం కింది భాగం మనకు నల్లరంగులో కనపడుతుంది. ఉదాహరణకు ఈ క్యూములో నింబస్ మేఘాలు చూడండి, కింది భాగం నలుపుగా కనపడుతుంది.

అంత ఎత్తులో కాకుండా కొంత సాధారణ ఎత్తు మేఘం ( ఐస్ మరియు వర్షపు చినుకుల శాతం తక్కువుగా ఉండడం వలన కూడా) మనకు తెల్లగా కనపడుతుంది.

వర్షించే మేఘాల రంగు:

ఎక్కువ ఎత్తులో ఏర్పడిన మేఘాలలో ఐస్ మరియు వర్షపు చినుకుల శాతం ఎక్కువుగా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి మేఘాలు కొంత నలుపుగా మనకు కనపడతాయి మరియు ఎక్కువ వర్షపాతం నమోదు చేస్తాయి. తక్కువ ఎత్తులో ఏర్పడిన మేఘాలలో ఐస్ మరియు వర్షపు శాతం తక్కువుగా ఉంటుంది, ఇవి కొంత తెలుపుగా మనకు కనపడతాయి మరియు ఇవి తక్కువ వర్షపాతం నమోదు చేస్తాయి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x