అర్ధరాత్రి వేళ పున్నమి చంద్రుడు చూస్తుండగా మానస ఒంటి మీదకు హఠాత్తుగా రెండు చేతులు పాకడం ప్రారంభించాయి. ఉదయం నుండి పని ఒత్తిడిలో అలసిపోయిన మానసకు పాకుతున్న రెండు చేతులను ఆపడానికి శక్తి సరిపోలేదు. ఉలిక్కిపడి లేచే లోపే తన మీద ఒకరు ఉన్నట్టు గమనించింది మానస. వద్దు వద్దు అని మానస కేకలు వేస్తుందుండగా, ఎక్కడ మానస అరుపులకు బయట వాళ్ళు లేచి వస్తారో అని అతను మానస చెంప మీద గట్టిగా కొట్టడం మొదలుపెట్టాడు. మానస కొన్ని నిముషాలకే బలహీనురాలైనది.
మానసను పూర్తిగా అదుపులోకి తీసుకుని, ఒంటి మీద బట్టలను తీసి మానస మీదకు వెళ్ళసాగాడు. నిద్రపోతున్నావేందే, లేచి నా ఫోన్ చూడు అని మానస జుట్టుపట్టి మరీ తన ఫోన్లో ఉన్న నీలి చిత్రాన్ని చూపించసాగాడు. బలహీనురాలైన మానస ఆ అరాచకాన్ని అడ్డుకునే శక్తి కోసం ప్రయాస పడుతూనే ఉంది. ఇంతలో వసెయ్ నీ నోరు తెరువు, తెరిచి ఇది నోట్లో పెట్టుకో అని బలవంతంగా మానసకు ఊపిరి ఆడనివ్వకుండా చేయసాగాడు అతను. కొంతసేపటికి, వసెయ్ ఆ ఫోన్లో ఉన్న దానిలాగా వంగు అని చెప్పి మానసాను బలాత్కారం చేయసాగాడు. మానస నెప్పితో అరుస్తుండగా, ఆ అరుపులను వింటూ తన మగాధిపత్యాన్ని ఆస్వాదించసాగాడు.
ఉదయాన్నే తలుపు గట్టిగా కొడుతూ, మానస అత్తగారు “అమ్మాయి మానస ఎంతసేపు నిద్ర?, లేచి మీ ఆయనకు కాఫీ పెట్టి ఇవ్వు” అని తన అత్త పెత్తనం చేయసాగింది. మానస పొత్తి నెప్పితో లేచి, కాఫీ కాచి తన అత్తమామలకు, తన భర్తకు కాఫీ ఇచ్చి, తన పవిత్ర వివాహ జీవితాన్ని తలుచుకుని మౌనంగా శోకసంద్రంలో మునిగింది.
[1] marital rape Archives – Indian Women Blog – Stories of Indian Women