పి.హెచ్.డి కి సబ్జెక్ట్‌ను ఎంచుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తన 12వ సంవత్సరంలోనే ఆల్జీబ్రా మరియు యూక్లిడియన్ (Euclidean) జామెంట్రీని తన సొంతంగా నేర్చుకున్నాడు, పైథాగరియన్ సూత్రాన్ని సొంతంగా అధ్యాయనం చేసి అర్ధం చేసుకోగలిగాడు. గణితం మీద ఉన్న ఆసక్తి మేరకు ఈ విశ్వాన్ని ఒక గణిత నమూనా ద్వారా అర్ధం చేసుకోవచ్చు అని ఐన్‌స్టీన్ భావించాడు.

తన 12 ఏటా జర్మనీ, మునిచ్ నగరంలో ఉన్న కళాశాలలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువే క్రమంలో అక్కడ విద్యావిధానం, పిల్లల్ని కేవలం బట్టి కోటించి చదివించే విధానాన్ని పూర్తిగా వ్యతిరేకించి అ కళాశాలకు స్వస్తి చెప్పాడు[1].

అప్పటినుండి తాను పూర్తిగా గణితం మరియు భౌతిక శాస్త్రం మీద ద్రుష్టి సారించాడు.

అనంతరం ఐన్‌స్టీన్ స్విట్జర్లాండ్లో భౌతిక శాస్త్రం మీద తన పీహెచ్డీని నమోదు చేసుకుని, 1905 లో పూర్తి చేసాడు. తాను 1905 లో ప్రచురించిన పరిశోధన పత్రాలు భౌతిక శాస్త్రంలో విప్లవాత్మకమైన మార్పులకు తోడ్పడ్డాయి.

In 1905, which has been called Einstein’s annus mirabilis (amazing year), he published four groundbreaking పేపర్స్.

1905 లో ఐన్‌స్టీన్ ప్రచురించిన నాలుగు ముఖ్యమైన పరిశోధన పత్రాలు[2] :

ఫోటోఎలెక్ట్రిక్ ఎఫెక్ట్:

  1. A heuristic point of view of the production and transformation of light

బ్రౌనియన్ మోషన్:

2. On the movement of small particles suspended in a stationary liquid, as required by the molecular-kinetic theory of heat.

స్పెషల్ రిలేటివిటీ:

3. On the Electrodynamics of Moving Bodies

మాస్ -ఎనర్జీ ఎక్వివలెన్స్

4. Does the inertia of a body depend on its energy content

ఐన్‌స్టీన్ తన పీహెచ్డీ పూర్తి చేసింతరువాత యూనివర్సిటీ అఫ్ బెర్న్ లో భౌతిక శాస్త్రం మీద పాఠాలు చెప్పడానికి లెక్చరర్గా (habilitation) నియామకం చెందారు[3].

ఇప్పుడు మనకు ఐన్‌స్టీన్ కథ నుండి తెలుసుకోగలిగిన కొన్ని ముఖ్యమైన అంశాలను చూదాం.

  • ఐన్‌స్టీన్ తన చిన్నపటి నుండి గణితం మరియు భౌతిక శాస్త్రం మీద బాగా ఆసక్తి కనపరిచాడు. ఆ ఆసక్తితోనే తన పీహెచ్డీ భౌతిక శాస్త్రం లో చేసాడు. భౌతిక శాస్త్రం లో లోతయిన గణితం వాడి ప్రకృతి రహస్యాలను కనుగొనే ప్రయత్నం చేసాడు. అలాగే మనం పీహెచ్డీ సబ్జెక్టు ఎంచుకునేటప్పుడు మనకు ఆ సబ్జెక్టు మీద పూర్తి ఆసక్తి ఉండడం ప్రధమం.
  • అలాగే ఐన్‌స్టీన్ పరిశోధనా పత్రాలు మనం చూచినట్లయితే మనకు తన నిలకడ కనపడుతున్నది. అంటే భౌతిక శాస్త్రంలో ఒక అంశంతో (the light- quantum hypothesis) మొదలుపెట్టి నిలకడగా క్వాంటమ్ ఫిజిక్స్, రెలెటివ్ ఫిజిక్స్ వైపు తన ప్రయాణాన్ని సాగించాడు. అంటే మనం తీసుకున్న ఒక పరిశోధనా అంశం తో మనం నిలకడగా ప్రయాణించాలి. కనుక మరోసారి మనం సబ్జెక్టు ఎంచుకున్న తరువాత దాని మీద నిలకడ చాల ముఖ్యం.
  • ఐన్‌స్టీన్లో మనం నిరంతర ఆసక్తిని మరియు పట్టుదలను మనం చూడవచ్చు. తన పీహెచ్డీ పూర్తి అయిన తరువాత కూడా తిరిగి ఆ సబ్జెక్టు లోనే లెక్చరర్ గా కొనసాగి భౌతిక శాస్త్రంలో పరిశోధనను తన మరణం వరకు కొనసాగించాడు. తన సబ్జెక్టు పట్ల నిరంతర ఆసక్తి జీవితాంతం ఐన్‌స్టీన్లో గమనించవచ్చు. కనుక మనం కూడా జీవితాంతం మన ఆసక్తి ఆ సబ్జెక్టు పట్ల ఉంచుకునేలా పీహెచ్డీ సబ్జెక్టును ఎంచుకోవాలి.
  • చివరిగా ఐన్‌స్టీన్ ఎంతోమంది శాస్త్రవేత్తల సలహాలు మరియు సహాయం తీసుకున్నారు. కొన్ని సార్లు కష్టపరమైన గణితంను తన సహచరులచెంతకు వెళ్లి నేర్చుకుని, వారితో కలిసి పనిచేసారు. అంటే మనకు మనం తీసుకున్న సబ్జెక్టు కాకుండా ఇంకా చాలా సబ్జెక్టులు మన పరిశోధనకు అవసరం పడతాయి. కనుక మనం కొంతమేరకు వేరే సబ్జెక్టు నేర్చుకోడానికి కూడా సిద్ధపడాలి.

కొన్ని యూనివర్సిటీలు ప్రస్తుతం పీహెచ్డీ లో చేరగానే కొంత సమయం పాఠాలు నేర్పించి (course work), విద్యార్థి ఆసక్తి మేరకు తమ పీహెచ్డీ సబ్జెక్టును ఎంచుకోడానికి అవకాశం ఇస్తాయి. అప్పుడు మనం ఎక్కువ పరిశోధన పత్రాలు చదివి, మనకు ఏ సబ్జెక్టు ఆసక్తిగా అనిపిస్తే ఆ సబ్జెక్టులో మన పీహెచ్డీ మొదలపెట్టవచ్చు. కొన్ని యూనిర్సిటీలు తాము చేస్తున్న పరిశోధన మీదే తమ విద్యార్థులు పనిచేయాలని నియమాలు పెట్టవచ్చు. అప్పుడు ముదుంగా విద్యార్థులు ఆ యూనివర్సిటీలో ఏ పరిశోధనలు జరుగుతున్నాయో తెలుసుకుని తమ పీహెచ్డీలో తమ పీహెచ్డీ కొరకు ఆ యూనివర్సిటీలో చేరితే బాగుంటుంది.

నాకు వ్యక్తిగతంగా “సబ్జెక్టు పట్ల ఆసక్తి, నిరంతర అధ్యాయనం”, ఇదే పీహెచ్డీ సబ్జెక్టు పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు.


ఫుట్‌నోట్స్

[1] Albert Einstein – Wikipedia

[2] Einstein’s Miracle Year | OpenMind

[3] The Einstein forgery

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x