నమస్తే అండి! దైర్యంగా ఈ సమాధానం నన్ను అడిగినందుకు మీకు ముందుగా అభినందనలు.
ఈ ప్రశ్నకు సమాధానమిచ్చే వయస్సు నాకు లేకపోవచ్చు, నాకు వివాహం జరిగి నాలుగు సంవత్సరాలే అయ్యుండచ్చు, కానీ నాకు కొంత అనుభవం ఉంది అని నేను భవిస్తూ, మీరు నన్ను అభ్యర్దించిన ఈ ప్రశ్నకు సమాధానం రాస్తున్నాను.
మీరు మీ భాగస్వామి నుండి దూరం అయ్యారు అని రాసారు, అలాగే మీ భాగస్వామి మీ పట్ల ప్రవర్తించాల్సిన విదంగా ప్రవర్తించలేదు అని కూడా రాసారు. మీరు మీ భాగస్వామి నుండి దూరం కావాలనే నిర్ణయం చాల సుదీర్ఘంగా అలోచించి తీసుకున్నారని నేను విశ్వసిస్తున్నాను.
ప్రస్తుతం మీకు మీ నిర్ణయం పట్ల కొంత భయం, మీ పిల్లల జీవితం పట్ల ఆవేదన కలుగుతుందని నాకు అర్ధం అవుతుంది.
నాకు తెలిసి ఇలాంటి సందిగ్ధత ఒక పెద్ద నిర్ణయం తరువాత రావడం సర్వ సాధారణం. మీరు మీ మనసు విప్పి ఈ సమాధానం ద్వారా నా మాటలు వినడం, లేదా ఇంకొంత అనుభవజ్ఞుల నుండి వినడం మీకు చాల మంచింది అని నా అబిప్రాయం. మీకు కౌన్సిలింగ్ ఈ సమయంలో చాల అవసరం.
కొంచెం సేపు మీ పిల్లల మీద ప్రభావం గురించి మాట్లాడుకుందాం:
నిజానికి తల్లి దండ్రులు బాల్యంలోనే దూరం అయితే పిల్లలు పడే నరకం అంత ఇంత కాదు. పిల్లలు పెరిగేకొలది తల్లి దండ్రుల ప్రేమ, ఆప్యాయత పిల్లలకు చాల అవసరం.
కానీ నా దృష్టిలో ,
కలిసి బ్రతుకుతూ పిల్లలను మానసిక వేదనకు గురి చేసే తల్లి దండ్రులు ఇంకా ప్రమాదం. ఉదాహరణకు ఒక పిల్లవాడు తన తల్లి దండ్రులు కొట్టుకుపోవడం రోజు చూస్తున్నాడు అనుకుందాం, చిన్న చితక గొడవలు అయితే కొంత వరకు అ పిల్లవాడు దర్యంగా ఉండగలడు, కానీ పెద్ద గొడవలు, కొట్టుకోవడం, పెద్ద పెద్దగా అరుసుకోవడం , తాగి సామాన్లు విరగకొట్టడం ఇతర ఇతర కారణాలు ఏవైనా, పిల్లల మీద తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తాయి (వ్యక్తిగతంగా నాకు ఇలాంటి సంఘటనలు నా బాల్యం లో ఎదురుకున్నాను, ఇందాక నాకు అనుభవం ఉంది అన్నది ఇందుకే, ఇంకా వివాహ జీవితాలకు సంబందించిన పుస్తకాలు, సినిమాలు చూడడం ద్వారా కొంత అనుభవం).
మీ ప్రశ్నకు నా దగ్గర కచ్చితమైన సమాధానం లేకపోయినా, మీరు మీ భాగస్వామి కలిసి ఉంటె (కేవలం పిల్లల కోసం అలోచించి) పిల్లలు సంతోషంగా కలిసి ఉంటారని హామీ ఏమి లేదు. మీరు, మీ భాగస్వామి ప్రేమతో మీ సంసారాన్ని కొనసాగిస్తేనే మీ పిల్లలు సంతోషంగా ఉండగలరు. బాగా అలోచించి నిర్ణయం తీసుకోండి.
ఇప్పుడు మీ గురించి మాట్లాడుకుందాం:
మీరు మీ పిల్లల జీవితం గురించి ఎంత ఆలోచిస్తున్నారో, మీ జీవితం గురించి కూడా మీరు అంతే ఆలోచించాలి.
నిజంగా మీ భాగస్వామి పట్ల ఇంకా ప్రేమ ఉంటె, మీరు వెంటనే ఒక వివాహ కౌన్సిలింగ్ సెంటర్ను ఆశ్రయించాలి. మీ ఇద్దరికీ కౌన్సిలింగ్ చాల అవసరం. ఈ కౌన్సిలింగ్ సెంటర్ లో మీకు మరియు మీ భాగస్వామికి విడివిడిగా కౌన్సిలింగ్ చేసి మీలో మనోధైర్యం నింపే ప్రయత్నం చేస్తారు. అలాగే మీరు మీ భాగస్వామి తిరిగి జీవితం కొనసాగించడానికి తోడ్పాటును అందిస్తారు.
ఒకవేళ కానిపక్షంలో మీరు విడాకులకు దరఖాస్తు చేసుకోవచ్చు (మీరు ఒక సంవత్సరం ఒకరికొకరు దూరంగా ఉంటె, Indian marriage act). విడాకులు ఇచ్చే ముందు మన కోర్టు వారు కూడా సాధ్యమైనంతవరకు మీ ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి, కలిపే ప్రయత్నం చేస్తుంది. కానిపక్షంలో మీకు విడాకులు మంజూరు చేస్తారు. మీ ఆర్థికస్థోమత మేరకు కోర్ట్ వారు మీకు మీ పిల్లలకు రావాల్సినవి గురించి కూడా చర్చిస్తారు.
ఒకవేళ మీరు విడాకులు తీసుకుంటే:
మానవ సమాజంలో పెళ్లి చాల ముఖ్యమైనది. కానీ పెళ్లి మీ జీవతాన్ని ఆనందమయం చేయాలి కాని కష్టాలపాలు చేయకూడదు. మన భారత రాజ్యాంగం మనకు స్వేచ్ఛగా బ్రతికే హక్కు ఇస్తుంది. మీ పిల్లలు మీతో కొంత వరకే ఉండగలరు కదా? కొంత కొంత పెద్ద అయ్యాక వారి జీవితం వారు చూసుకుంటారు కదా? అప్పుడు మరి మీ పరిస్థితి ఏంటి?
మంచి వ్యక్తిని చూసి పెళ్లిచేసుకోండి. మీ జీవితం (మనందరి జీవితం) చాల చిన్నది. జీవితంలో మీరు ప్రేమను, అనురాగాన్ని నిరంతరం పొందుతూనే ఉండాలి. దీనికి మనం ఎవ్వరం అతీతులం కాదు. అలోచించి మంచి నిర్ణయం తీసుకోండి.
ఇక పిల్లలకు తన తండ్రి నుండి దూరం చేస్తున్నాను అని మీరు భావిస్తే, పిల్లలకు కొంత నిర్దిష్ట సమయం వారి తండ్రిగారి దగ్గర ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. మీరు విడిపోయినంత మాత్రాన మీ భాగస్వామి శత్రువు కానవసరం లేదు. పరిపక్వతతో కలిగిన స్నేహితులులాగా మెలగండి. మీరు ఈ చిత్రాన్ని మీకు సమయం ఉన్నపుడు చూడండి (Oscar nominated, 2020).
గమనిక : ఈ సమాజం, కుటుంబం, బంధువులు ఏమనుకుంటారో అని మీ జీవితం మీరు పాడుచేసుకోవలసిన అవసరం లేదు. “ప్రపంచం చాలా పెద్దది, ప్రేమతో చేతులు చాపండి, మనసున్న జీవులు వచ్చి మీ ముందు నిలబడతాయి”.