జీవితంలో అత్యంత విలువైన సమయం..

రవి ఒక ప్రభుత్వ ఉద్యోగి. అందరి మనుషుల్లాగానే రవిలో మంచి చెడు రెండు ఉన్నాయి.

పిల్లల్ని కస్టపడి చదివించాడు, కొంతమేరకు కుంటుంబ భారాన్ని మోశాడు.

తన భార్యతో తరుచు విభేదాలు రావడం, కొన్ని సార్లు కోపం ఆపుకోలేక కొట్టడం చేస్తుండేవాడు.

జీవితంలో అలసిపోయాడోయేమో, నిదానంగా తాగుడుకు అలవాటు పడ్డాడు. ఉద్యోగం కూడా మానేశాడు.ఇంట్లో వస్తువులు అమ్మడం ప్రారంభించాడు . భార్య పిల్లల్ని వేధించడం మొదలుపెట్టాడు. స్నేహితులను దూరం చేసుకున్నాడు.

భార్య, పిల్లలు రవి ప్రవర్తనను భరించలేక రవికి దూరమయ్యారు.

ఇంట్లో ఒక్కడే మిగిలిపోయాడు రవి. ఇంటి చుట్టూ మందు సీసాలు, సిగేరేట పాకిట్లు.

రవి నిదానంగా డిప్రెషన్లోకి వెళ్ళాడు. తినడానికి తిండి లేదు. తాగడానికి నీళ్లు అందించే తోడు లేదు. నెల నుండి ఒకే దుస్తులు ధరించి ఉన్నాడు. కేవలం పాడుబడిన తన ఇంటికే సంవత్సరం పాటు పరిమితమయ్యాడు.సమాజం జాలిపడింది, రవి పిచ్చోడైపోయాడని కోడై కూసింది. కానీ ఒక్క గలాసు మంచి నీళ్లు కూడా రవికి ఎప్పుడు ఇవ్వలేదు ఈ సమాజం!

జీవితంలో తాను చేసిన పొరపాట్లు, ఇతరులను బాధపెట్టిన క్షణాలు రవికి నిద్రపట్టకుండా చేసాయి. కనీసం పలకరించడానికి ఒక్క మనిషికూడా నాకు లేకుండా పోయాడంటే నేను ఎంత దురదృష్టవంతుడను అని కుమిలిపోయాడు రవి. తనను తానూ బాధపెట్టుకోవడం ప్రారంభించాడు. ఆకలికి చెలించని శరీరం, భావోద్వేగాలు లేని మనస్తత్వం, శుభ్రతకు నోచుకోని దేహం, వెలుగును చూడలేని కంటి చూపు, బంధానికి అర్ధం తెలియని మనస్సు , ఎక్కడ నివసిస్తున్నాడో తెలియని మైకంలోకి వెళ్లి పోయాడు రవి.

సంవత్సరం పాటు గమ్యంలేని జీవితాన్ని గడిపిన రవి, తన ప్రస్తుత స్థితికి దిగజార్చిన తన లోపాల్ని సరిచేసుకునే ప్రయత్నం చేయసాగాడు. తన పరిస్థితిని నిధానంగా అర్ధం చేసుకోవడం ప్రారంభించాడు. మత్తులో మునిగితేలే బానిసత్వాన్ని విడిచి పెట్టాడు. ఉద్యోగానికి వెళ్లే ప్రయత్నం చేసాడు. మనిషిగా మారడానికి నిరంతర పోరాటం చేస్తూనే ఉన్నాడు ……!

రవి ఎంతవరకు జీవన సాగరాన్ని ఎదురీదుతాడో ఎవ్వరికీ తెలియదు! కానీ రవికి సంబంధించినంతవరకు తనని తానూ శిక్షించుకున్న సంవత్సరం రవి “జీవితంలో అత్యంత విలువైన సమయం.”

చిత్రం[1]


ఫుట్‌నోట్స్

[1] Sketch of man sleeping on bed with arm on his forehead without clothing upper body, Hand drawn line art illustr… | Sleeping man, Sleeping drawing, How to draw hands

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

0
Would love your thoughts, please comment.x
()
x