ముందుగా ఒకసారి చిరపుంజి వంటి ప్రదేశంలో భౌగోళిక విశేషాలను చూదాం.
- దాదాపు సముద్ర నీటి మట్టం నుండి 1500 మీటర్ల ఎత్తు[1], దట్టమైన అడివి, ఎత్తయిన కొండలు.
- చిరపుంజి కొండలకు దగ్గరగా బంగాళాఖాతం సముద్రం.
- బంగాళాఖాతం సముద్రమును తాకుతూ చిరపుంజి కొండల వైపుకు వీచే నైరుతి రుతుపవనాలు[2].
Image Source: (a) Map North-East India (b) Cherrapunji hills [3]
ఇక విషయం లోకి వెళ్తే,
- ఒరొగ్రఫీ లిఫ్టింగ్ (Orography Lifting):
దాదాపు కొండలు ఉన్న ప్రదేశాల్లో ఒరొగ్రఫీ లిఫ్టింగ్ జరుగుతుంది.
అంటే కొండలవైపు బలంగా వీస్తున్న గాలి కొండ కింద భాగం నుండి మొదలయ్యి కొండ పైభాగం వరకు ప్రయాణం చేస్తుంది. గాలి ప్రయాణించే ప్రక్రియలో తనతో పాటె తేమను కొండపైకి మోసుకు వెళ్తుంది. కొండ పైభాగంలో వాతావరం చల్లగా ఉంటుంది కనుక ఆ తేమ వర్షంగా మారి కిందకు కురుస్తుంది.
ఈ విధంగా కురిసే వర్షాన్ని Orography lifting induced rainfall అని అంటారు. ఈ ప్రక్రియ (ఒరొగ్రఫీ లిఫ్టింగ్[4] ) చిరపుంజిలో అధికంగా జరుగుతుంది!
కొండల దగ్గర ఓరోగ్రఫీ లిఫ్టింగ్ జరిగి సాధారణంగా కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుంది. మరి ప్రపంచంలో ఉన్న అన్ని కొండలకంటే చిరపుంజి వంటి ప్రదేశంలో ఎక్కువ వర్షపాతం ఎందుకు నమోదు అవుతుంది?
ఈ ప్రశ్నకు సమాధానం — “నైరుతి రుతుపవనాలు”
2. నైరుతి రుతుపవనాల తాకిడి (South-West Monsoon Winds):
మన భారతదేశంలో మనందరికీ దాదాపు నైరుతి రుతుపవనాల గురించి తేలిసిందే! జూన్ , జులై, ఆగష్టు నెలల్లో రుతుపవనాల ద్వారా నమోదయ్యే వర్షపాతం మన వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేస్తుంది. దక్షణ బంగాళాఖాతం నుండి మొదలయ్యి , కేరళ మీదగా ఉత్తర హిమాలయాల వైపుకు ప్రయాణించే బలమైన గాలులు సముద్రం మీద ఉండే తేమను మోసుకుని మన దేశం మీద కురిసే వర్షంగా మనకు అందిస్తాయి!
ఈ గాలులే చిరపుంజి చుట్టపక్కల కొండను మొదటగా తాకి (హిమాలయాల కంటే ముందు అని అర్ధం) Orography lifting induced rainfall కు దోహదపడతాయి
[5] . అందుకనే చిరపుంజి వంటి ప్రదేశంలో జూన్ , జులై, ఆగష్టు నెల్లలో అత్యధిక వర్షపాతం నమోదు అవుతుంది.
Image Source[6]
3. ఆక్టివ్ & బ్రేక్ (Active & Break Monsoon Rainfall)[7] :
ఇంకా లోతుగా విశ్లేషిస్తే…….
ముక్యంగా నైరుతి రుతుపవనాలు సెంట్రల్ ఇండియా (మధ్యప్రదేశ్ చుట్టుపక్కల ప్రాంతం) లో నమోదు చేసే వర్షపాతం చాలా ముక్యంగా చెప్పుకుంటాం. అక్కడ ఎక్కువ వ్యవసాయం జరుగుతుంది కనుక! కొన్ని సందర్భాలలో సెంట్రల్ ఇండియాలో సాధారణంగా కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుంది. దీన్నే శాస్త్రవేత్తలు ఆక్టివ్ మాన్సూన్ (active Monsoon or Active Spell ) అని పిలుస్తారు. ఆక్టివ్ మాన్సూన్ సమయంలో చిరపుంజి లో కొంత తక్కువ వర్షపాతం నమోదు అవుతుంది.
కానీ కొన్ని సందర్భాలలో సెంట్రల్ ఇండియాలో సాధారణంగా కంటే తక్కువ వర్షపాతం నమోదు అవుతుంది. దీన్ని బ్రేక్ మాన్సూన్ (break monsoon or break spell) అంటారు. బ్రేక్ మాన్సూన్ సందర్భంలో చిరపుంజి లో చాలా ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుంది.
ఒక సంవత్సరంలో బ్రేక్ మాన్సూన్ రోజులు ఎక్కువ నమోదు అవుతాయి, అప్పుడు చిరపుంజి లో ఆ సంవత్సరం తీవ్రమైన వర్షపాతం నమోదువ్వుతుంది
[8]. ఆక్టివ్ అండ్ బ్రేక్ మాన్సూన్ సాదరంగా బంగాళాఖాతం, హిమాలయ అంచులమీద ఏర్పడే అల్పపీడనం స్థితి గతుల మీద ఆదారిపడి ఉంటుంది.
Image Source[9] : Picture showing Active and Break Monsoon Rainfall
చివరిగా,
ప్రపంచంలో అన్ని ప్రదేశాల కంటే చిరపుంజిలో వర్షపాతం చాలా అధికంగా ఉంటుందన్న విషయం మనకు విధితమే. కానీ ప్రస్తుత వాతావరణ మార్పు కారణంగా ఇప్పుడు చిరపుంజి వర్షపాతంలో మార్పులు జరిగాయి. ప్రస్తుతం మొదటి స్థానంలో Mawsynram
[10] అనే ప్రదేశం ఉంది. ఇది చిరపుంజికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఫుట్‌నోట్స్
[3] Dominant Synoptic Disturbance in the Extreme Rainfall at Cherrapunji, Northeast India, Based on 104 Years of Rainfall Data (1902–2005)
[4] https://brainly.in/question/26744291
[5] Dominant Synoptic Disturbance in the Extreme Rainfall at Cherrapunji, Northeast India, Based on 104 Years of Rainfall Data (1902–2005)
[7] Dominant Synoptic Disturbance in the Extreme Rainfall at Cherrapunji, Northeast India, Based on 104 Years of Rainfall Data (1902–2005)
[8] Active and break events of Indian summer monsoon during 1901–2014 – Climate Dynamics
[9] Active and break events of Indian summer monsoon during 1901–2014 – Climate Dynamics