దయచేసి ఒకసారి బ్రిటిష్ పత్రికా విలేకరి చంద్రయాన్ -3 విజయం వలన అసూహ్యతో మాట్లాడిన, కించ పరిచిన ఆ వీడియో ఎక్కడుందో ఈ ప్రశ్న అడిగిన వారు ఒకసారి ఇక్కడ పంచుకుంటే బాగుంటుంది.
నా అనుభవంలో, నేను పనిచేస్తున్న యూనివర్సిటీలో జరిగిన సంఘటన ఇక్కడ ప్రస్తావిస్తాను. (ఇక్కడే ప్రముఖ శాస్త్రవేత్త డా॥ ఆల్బర్ట్ ఐన్‌స్టెయిన్ చదువుకున్నారు, ప్రొఫెసర్ గా పని చేశారు)[1].
మా టీం అందరం కలసి భోజనం చేస్తున్న సమయం లో మా సహ ఉద్యోగులు ” ఇస్రో సాదించింది చాలా గొప్ప విజయం”, భారత దేశంలో చాలా ఉన్నతమైన స్పేస్ రీసెర్చ్ జరుగుతుంది అని, అక్కడ నుండి వచ్చి పనిచేస్తున్న వారంతా చాలా తెలివిగా, ఒక కమిట్మెంట్ తో పని చేస్తారని అన్నారు (ఇందులో అన్నీ అగ్రదేశాల వారు ఉన్నారు).
ఇది ఒక ఉదాహరణే. నేను చూచినా, చదివిన ప్రముఖ పత్రికల్లో మన ఇస్రోను ప్రపంచ వ్యాప్తంగా కొనియాడిన చానళ్ళు , పత్రికలు కోకొల్లలు [2][3]. ప్రపంచ ప్రముఖ శాస్త్రవేత్త నీల్ డి గ్రాస్సే టైసన్ చంద్రయాన్ ప్రాముఖ్యతను ప్రపంచానికి వివరిస్తున్న ఒక వీడియో ఇక్కడ జత చేస్తున్నాను.
నేను ఇదివరకు రాసిన ఒక వ్యాసంలో చెప్పినట్టుగా, సైన్స్ మరియు టెక్నాలజీ యావత్ ప్రపంచ మానవాళికి చెందినవి. సైన్స్ మరియు టెక్నాలజీ ప్రపంచ మానవాళి విజ్ఞ్యాన విజయానికి నాంది. మనదేశంలో ఆర్యభట్టతో మొదలుకుని, న్యూటన్, ఐన్‌స్టెయిన్, విక్రమ్ సారాభాయ్ , హోమీబాబా , కలామ్ వంటి మేధావులు మానవ ప్రగతికి స్పేస్ సైన్స్ ను ముందుకు నడిపారు.
ఇస్రో మొదటి ఉపగ్రహం రష్యా స్పేస్ సెంటర్ సహాయంతో “low earth orbital” కు పంపగలిగాం[4]. NASA మరియు ISRO మన భూమి ఉపరితలం మరియు వాతావరణాన్ని పరిశీలనకు త్వరలో కలిసి పనిచేయనున్నాయి[5] . చంద్రయాన్ -3 విజయం కావడానికి ప్రపంచ వ్యాప్త సంస్థలు ఇస్రో స్పేస్ మానిటరింగ్ సెంటర్ కు ముఖ్యమైన సమాచారాన్ని అందించాయి[6] . ఈ ప్రపంచంలో స్పేస్ కు సంబదించిన ఎలాంటి మిషన్ చేపట్టాలన్న ప్రపంచం లో అన్ని దేశాలు దాదాపు ఇస్రో సహాయం తీసుకోవలసిందే (కక్షలో వారి ఉపగ్రహ లొకేషన్ కొరకు). అదేవిదంగా ఇస్రో ఇతర దేశ స్పేస్ సెంటర్స్ నుండి సహాయం దాదాపు పొందవలసిందే. వీటినే సైంటిఫిక్ కోలాభరేషన్స్ అంటారు. సైన్స్ మరియు టెక్నాలజీ కి ఇదే పునాది.
దీని బట్టి సైన్స్ యావత్ విశ్వానికి చెందిందని అర్ధం అవుతుంది. ఒకవేళ అమెరికా లేదా ఐరోపా వారు సైన్స్ అండ్ టెక్నాలజీ మా సొంతం అంటే , ఆర్యభట్ట[7], బ్రహ్మగుప్త[8] లేనిదే మీ సైన్స్ ఎక్కడిది? అని అడగవలసి వస్తుంది. ఇది అన్ని దేశాలకు వర్తిస్తుంది, మన దేశంతో సహా.
ఇక పోతే, దేశ ప్రభుత్వాలు, నాయకులు వారి రాజకీయాలకు సైన్స్ మరియు టెక్నాలజీని వాడుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రపంచ యుద్ధాలల్లో సైన్స్ మరియు టెక్నాలజీని వాడుకుని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రాజ్యాలు ఎంత అఘాయిత్యాలకు పాల్పడినవో మనకు తెలియంది కాదు. వీరికి జాతీయవాదం ఒక అస్త్రం. ఒక దేశం సైన్స్ అద్భుతాలను చేస్తూ ఉంటె , ఇతర దేశాలు వారి స్వలాభం కోసం రాజకీయ ఎత్తుగడలు వేయడం సాధారణం. అందుకోసం ప్రజల మధ్యలో విద్వేషాలు రెచ్చ గొట్టడానికి ప్రయత్నిస్తారు.
విదేశాలలో ఉంటూ, అక్కడ ప్రజలందరూ ఒకేలాగా ఇస్రోను, భారతదేశాన్ని విమరిశిస్తూ ఉంటారని ఇక్కడ రాయడం బహుశా సరి అయిన వాధన కాదేమో. విజ్ఞత కలిగిన ప్రజలు అన్నీ దేశాల్లో ఉంటారు, సైన్స్ అద్భుతాలను చేసిన ప్రతి ఒక్కరిని అభినందిస్తారు. నాకు అర్ధం అయినంతవరకు ప్రపంచ వ్యాప్తంగా విజ్ఞత కలిగిన ప్రతి ఒక్కరు ఇస్రో సాధించిన విజయానికి హర్షద్వానాలతో పాటు ఇక ముందు జరగ బోయే స్పేస్ మిషన్ సఫలీకృతం కావాలని కోరుకుంటున్నారు. ఇస్రో భారత దేశంలో జరుగుతున్న సైన్స్ కి ఒక నిదర్శనం.
దయచేసి కోరా మిత్రులు ఆలోచించవలసిన ఒక అంస్యం ఇక్కడ ఒకటి ఉంది. సైన్స్ ప్రపంచ శాంతి దిశగా ముందుకు అడుగువేయాలని అందరం కోరుకోవలసిన సమయం ఇది. ఈ ప్రశ్నలో అన్నటుగా నాకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలలో ఇస్రో విజయం పట్ల అసూహ్య, ద్వేషం కనపడలేదు.
స్వస్తి
ప్రవీణ్.