క్రీస్తు పూర్వం కొన్ని దశాబ్దాలదాకా భూమి చదునుగా (flat) ఉంటుందని నమ్మేవారు. గ్రీకు రాజ్యానికి చెందిన పైథాగరస్ (Pythagorus) భూమి గుడ్రంగా ఉంటుందని గ్రహణముల ఆధారంగా కనుగున్నారు. ఇది మానవులు ప్రపంచాన్ని చూసే దృక్కోణము మార్చివేసింది.
చిత్ర మూలం: వికీపీడియా
క్లాజుడిస్ టోలెమీ (Tolemy) 2 AD (క్రీస్తు తర్వాత రెండో దశాబ్దంలో), జియోసెంట్రిక్ థియరీ (Geocentric theory) , అంటే మన భూమి విశ్వం మధ్యలో ఉండి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు భూమి చుటూ గుండ్రంగా తిరుగుతున్నాయి అని ప్రతిపాదించాడు. భూమి నుండి చూస్తే సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు అని టోలెమీ గ్రహించాడు. మానవ చరిత్రలో విశ్వం యొక్క మొదటి ఊహా చిత్రం క్లాజుడిస్ టోలెమీ రోపొందించారు. జియోసెంట్రిక్ థియరీని 1500 సంవత్సరాలవరకు మానవులు విశ్వసించారు.
చిత్ర మూలం: వికీపీడియా
1543వ సంవత్సరంలో నికోలస్ కోపర్నికస్ (Nicolas Copernicus) హీలియోసెంట్రిక్ థియరీని (Heliocentric theory) ప్రతిపాదించారు. ఇందులో సూర్యుడు విశ్వం మధ్యలో ఉండి, భూమి , చంద్రుడు నక్షత్రాలు సూర్యుని చుట్టూ గుండ్రంగా, తదేక ధృతిగతిన (uniform velocity) తిరుగుతాయని ప్రతిపాదించారు. హీలియోసెంట్రిక్ థియరీని అప్పటి చాలామంది భూమి తిరుగుతువుండడం కొంత వింతగా భావించి తిరస్కరించారు. టైకో బ్రహే (Tycho Brahe) కోపర్నికస్ ప్రతిపాదించిన థియరీని గ్రహాల కదిలికలను జాగ్రత్తగా పరిశీలించి ధృవీకరించారు. ఇది సైన్స్ చెరిత్రలో ఒక మైలు రాయిగా పరిగణించవచ్చు.
చిత్ర మూలం: వికీపీడియా
1605 వ సంవత్సరంలో జాహ్న్స్ కెప్లెర్ (Joannes Kepler) సూర్యుడు చుట్టూ గ్రహాలు గుండ్రంగా కాక, దీర్ఘవృత్తాకార కక్ష్యలులో తిరుగుతాయని గమనించారు. దీని ఆధారాంగా మూడు సూత్రాలు ప్రతిపాదించారు. ఈ సూత్రాలకు అనుగుణంగా ఇప్పటి ఉపగ్రహాల కక్షలను లెక్క కట్టవచ్చు.
1608 లో Hans Lippershey టెలీస్కోప్ని కనుగున్నారు. టెలిస్కోప్ ఆధారంగా గెలీలియో గురుడు చుట్టూ తిరిగే చంద్రుడిని గమనించారు. టెలిస్కోప్ ఉపయోగించి గ్రహాలను గమనించడం ఇక్కడితో మొదలయి మన విశ్వం యొక్క రహస్యాలను వెలికితీసే గొప్ప పరికరంగా ఉపయోగపడుతుంది.
1668 వ సంవత్సరంలో న్యూటన్ టెలిస్కోప్ సహాయంతో కోపర్నికస్ థియరీని రుజువు చేసి, కెప్లెర్ సూత్రాలద్వారా గురుత్వాకర్షణ శక్తిని ప్రతిపాదించారు. మానవ చరిత్రలో ఈ సంఘటన ఒక అద్భుతం. ఇప్పటి రాకెట్ మరియు ఉపగ్రహాల టెక్నాలజీ ఇంత బాగా వాడగలుతున్నాం అంటే న్యూటన్ దయ వల్లనే!
కృష్ణ బిలాలను గుర్తించటం, హుబల్ టెలిస్కోప్ ద్వారా విశ్వం విస్తరణ చెందడం, మిల్కీవే గాలక్సీ , Einstein సాపేక్ష సిద్ధాంతం, స్పేస్- టైం గ్రావిటీ, టైం ట్రావెలింగ్ వంటివి ఈ విశ్వం మనం చూసే ధృకొన్నాని మర్చివేసాయి అని చెప్పుకోవచ్చు.
ఈవెంట్ హోరిజోన్ టెలీస్కోప్ ప్రాజెక్ట్ — ప్రపంచ నలుమూలల ఎనిమిది టెలీస్కోప్స్లు కలిసి తీసిన ఈ కృష్ణ బిల్లాల ఫోటో మన సైన్స్ యొక్క పురోగమనానికి నిదర్శనం.
చిత్ర మూలం: వికీపీడియా
బిగ్ బాంగ్ ధృవీకరిస్తూ ఈ మైక్రో వేవ్ బాక్రౌండ్ రేడియేషన్ (Cosmic Micro Wave background radiation) చిత్రం విశ్వం పుట్టుకను అర్ధంచేసుకోవడానికి మానవజాతి చేసిన ప్రయత్నంకు నాంది.
చిత్ర మూలం: గూగుల్