కోవిడ్ అప్పుడు వాతావరణంలో మార్పులు ఇలా ..

Covid 19 వ్యాధి వ్యాప్తిని నివారించడానికి అనేక దేశాలు లాక్‌డౌన్ నియమాలు కఠినంగా అమలుచేయడం ద్వారా మన వాతావరణంలో కొన్ని కచ్చితమయిన మార్పులు సంభవించాయి. వాటివలన మనం ఏమి నేర్చుకోవచో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ సమాధానంలో ఆధునిక సాంకేతికత సాధనాలను ఉపయోగించి పరిశీలించిన డేటా ఆధారంగా శాస్త్రవేత్తలు ప్రచురించిన పరిశోధనా పత్రాల నుండి కొన్ని ముఖ్యమయిన అంశాలను పొందుపరిచాను, గమనించ గలరు.

కార్బన్ డయాక్సైడ్ (Co2): మానవ ప్రేరిత వాతావరణ మార్పుకు సంబందించిన ముఖ్యమయిన వాయువు ఈ కార్బన్ డయాక్సైడ్. మన వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ వాయువులు మోతాదుకు మించి ఉండడం వలన మన వాతావరణo వేడిగా మారె సంకేతాలు చాల స్పష్టంగా కనుపడుతున్నాయి. 2019లో ప్రపంచం అంతటిలో రోజు విడుదలవుతున్న కార్బన్ డయాక్సైడ్ వాయువులతో పోలిస్తే ఈ లాక్‌డౌన్ వలన సుమారు ప్రపంచవ్యాప్తంగా 17% తగ్గుముకం పట్టినవి (2020 ఏప్రిల్ నాటికి).

దీనికి ముఖ్యమయిన కారణాలు:

  1. ఉపరితల రవాణా రంగం నుండి ప్రపంచ వ్యాప్తంగా కార్బన్ డయాక్సైడ్ వాయువులు సుమారు 36% తగ్గుముఖం పట్టడం వలన.
  2. పరిశ్రమ రంగంలో నుండి ప్రపంచ వ్యాప్తంగా కార్బన్ డయాక్సైడ్ వాయువులు సుమారు 19% తగ్గుముఖం పట్టడం వలన.
  3. విద్యుత్ రంగంలో నుండి ప్రపంచ వ్యాప్తంగా కార్బన్ డయాక్సైడ్ వాయువులు సుమారు 7.4% తగ్గుముఖం పట్టడం వలన.
  4. విమానయాన రంగం లో నుండి ప్రపంచ వ్యాప్తంగా కార్బన్ డయాక్సైడ్ వాయువులు సుమారు 60% తగ్గుముఖం పట్టడం వలన.

(Image: Quere et al., 2020. Nature Climate Change)

దీనివలన కార్బన్ డయాక్సైడ్ వాయువులు 17% తగ్గుముకం పట్టాయి. కానీ మళ్ళీ లాక్ డౌన్ ఎత్తివేయవలడం ద్వారా తిరిగి మళ్ళీ మన వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ వాయువుల శాతం పెరిగినవి.

ఇంకా ఈ లాక్ డౌన్ వలన ఏర్పడిన కొన్ని ముఖ్యమయిన అంశాలు ఏమిటంటే, మన భారతదేశ ముఖ్యపట్టణాలలో కాలుష్యం మరియు విషవాయువుల శాతం చాల తగ్గినది అని ఒక అంచనా. 
ఉదాహరణకు పెట్రోల్ డీసెల్ వాడడం వలన వాతయరణంలోకి సన్నని పదార్ధాలు (సుమారు 2.5 మిక్రోన్స్ వెడల్పు గల PM 2.5 ఏరోసోల్స్) తగ్గుముఖం పట్టాయి. ఆ PM 2.5 ఏరోసోల్స్ మనం పీల్చడం వలన మన ఊపిరితిత్తులు బలహీన పడే అవకాశం లేకపోలేదు. అలాగే nitrogen (NOx) విషవాయువులు తగ్గుముఖం పట్టడం గమనించడం జరిగింది.

Image: PM 2.5 ఏరోసోల్స్ (Aerosols Impact Cloud Formation)

కానీ మళ్ళీ లాక్ డౌన్ ఎత్తివేయవలడం ద్వారా తిరిగి మళ్ళీ మన వాతావరణంలో విషవాయువుల శాతం పెరిగినవి. లాక్‌డౌన్ వల్ల విషవాయువుల మరియు కార్బన్ డయాక్సైడ్ శాతంలో తగ్గుముకం దీర్ఘకాలంలో మన వాతావరణం మార్పు మీద పెద్దగా ప్రభావం పడే అవకాశం లేదని శాస్త్రవేత్తల అంచనా.

ఈ శాతాన్ని కొనసాగించడానికి ప్రపంచదేశాలు కొన్ని ముఖ్యమయిన చర్యలు తీసుకోవాలి. క్లైమేట్ చేంజ్ పారిస్ ఒపందం (climate change paris agreement) ప్రకారం మన వాతావరణ కాలుష్య నివారణకు కఠినచర్యలు అమలు పరచాలి. ఉదాహరణకు క్లీన్ ఎనర్జీ సెక్టార్ (clean energy sector) వైపుకు అడుగులు అంటే బొగ్గు ఉపయోగించకుండా సోలార్ ఎనర్జీ (solar energy) తో విద్యుత్తు తయ్యారు చేయడం, పరిశ్రమలనుండి వచ్చే వాతావరణ కాలుష్యo మీద నిఘా, రవాణా రంగం లో విప్లవాత్మక మార్పులు (సోలార్ కార్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, సైకిల్ ఉపయోగించడం) , అడవులను కాపాడుకొనుట లాంటివి అమలు పరచాలి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x