వంటగదిలో ఉల్లిపాయలు తరుగుతున్న సుష్మకు గట్టిగా తన ఇంటి తలుపు గోడకు కొట్టుకున్న శబ్దం వినపడగానే హాల్ లోకి పరుగులు తీసింది. తన భర్త చేతి గడియారం తీసి నేలకేసికొట్టగా, ఏమైందండీ అంత కోపంగా ఉన్నారు అని అడిగింది సుష్మ.
మీ నాన్నకి ఎంత కొవ్వే, నాకే ఫోన్ చేసి ఉద్యోగం ఎందుకు మానేసాను అని అడుగుతాడా? నా ఉద్యోగం నా ఇష్టం, చేస్తే చేస్తా లేకపోతే లేదు, వాడికేంటి?
అదేంటి అలా అంటారు, తన కూతురిని ఇచ్చిన్నపుడు తండ్రి అడిగారా?
అవును ఇచ్చాడు ఒక కుదిబండను, ఇస్తానన్న పది ఎకరాల పొలం ఇంతవరకు ఇవ్వలేదు, నీకు పదిహేను సంవత్సరాలనుండి తిండి పెడుతున్నాను , కట్నం ఇవ్వాలన్న జ్ఞానం లేదుగాని నా ఉద్యొగం గురించి మాట్లాడతాడా మూర్కుడు?
ఏంటి ఊరుకుంటుంటే తెగ మాట్లాడుతున్నారు, నన్నేమన్నా అన్నండి, మా కుటుంబాన్ని మాత్రం ఏమి అన్నదు.
ఏంటి నీ కుటుంబాన్ని ఏమి అనకూడదా? నిన్ను ఏమన్నా అనవచ్చా …. అంటూ,
చెంపమీద రెండు గట్టిగా కొట్టి సుష్మాను కిందకి నెట్టాడు తన భర్త.
నన్ను కొడతావా, నాశనం అయిపోతావు , ఏమి బాగుపడతావ్ నువ్వు అని తన భర్తను అంది సుష్మ.
దాంతో ఇంకా రెచ్చిపోయిన తన భర్త, దొంగ ముండా, నీ వల్లే నా జీవితం నాశనం అయ్యింది. తిని కూర్చోడం తప్ప ఏమి చేసావ్ ఇన్ని సంవత్సరాలు? దున్నపోతులా బలిసావ్, నన్నే అంటావా అని తన కాలితో భార్యను కొట్టసాగాడు సుష్మ భర్త. దాంతో సుష్మ ఇన్ని రోజులు నేను ఇంట్లో పనులు చేస్తుంటే తింటున్నావ్ కదా, నేను ఎందుకు పానికిరాను అని అంటావా? అని భర్తతో వాదించింది.
లంజ ముండా ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావ్, నా సంపాదన, నేను తింటాను నీకేంటి? అని తిరిగి సుష్మాను కొడుతూ, తూ నువ్వు నా గురించి మాట్లాడుతున్నావా? అంటూ తన భార్యతో గొడవపడుతుండగా ……
తన తల్లిదండ్రుల గొడవకు ఎక్కడ తన ఆటబొమ్మ బయపడుతుందో అని, “బయపడకమ్మా నేను ఉన్నాను కదా నీకు” అంటూ ఆ ఆట బొమ్మకు దైర్యం చెపుతూ, ఆ ఆట బొమ్మపై పడిన తన కన్నీటిచుక్కలను తుడిసింది పదేళ్ల కీర్తి.