కాల్ బోయ్

కిందటి వారం మన తెలుగు Quora లో “నేను కాల్ బాయ్ సర్వీస్ మొదలపెట్టవచ్చా?” అని ఎవరో ఒక ప్రశ్న వేశారు.

దీనిని అడిగిన వారు ,

  • కొంటెగా అడిగివుండొచ్చు.
  • అమాయకంగా అడిగివుండొచ్చు
  • ఈ సమాజం ఎలా స్పందిస్తుందో తెలుసుకుందామని అడిగి ఉండొచ్చు.
  • ఇతర కారణాలు కావొచ్చు.

ప్రశ్న అడిగిన “టోన్” సరిగా లేదు అని ఆ ప్రశ్నను, దానికి స్పందించి ఎవరో రాసిన ఒక సమాధానం ను Quora తెలుగు నుండి తీసివేశారు.

కానీ ఈ ప్రశ్నను ఏ ఉదేశంతో అడిగినా, ఈ కాల్ బాయ్ సర్వీసెస్ అనే సమస్య మన సమాజంలో ఉన్నటు అనేక కధనాలు వెలుగులోకి వచ్చాయి. ఎంతో మంది మగ పిల్లలు ఇలాంటి కార్యకలాపాలలోకి కొంటెగా, లేదా సరదాగా, లేదా డబ్బు సంపాదించవచ్చు అనే మైకంలో చేరిజీవితాలను నాశనం చేసుకుంటున్న సంగతి మనం గ్రహించాలి. వ్యభిచారానికి ఆడ, మగ లేదా ఇతర జెండర్లు బలికావాల్సిందే, ఇది కఠిన వాస్తవం. అందుకని ఎంతో బాధ్యతగా నేను ఈ సమాధానం రాస్తున్నాను. అన్యదాగా భావించకండి అని నా తోటి Quora సభ్యులను వేడుకుంటూ ….

నేను ఆ ప్రశ్నకు నా పూర్తి సమాధానం డ్రాఫ్ట్ చేసే లోపే ఆ ప్రశ్న తీసివేశారు కనుక, నేను అపుడు రాసిన ఈ డ్రాఫ్ట్ ని ఇక్కడ జత చేస్తున్నాను, ———

నేను కాల్ బాయ్ సర్వీస్ మొదలపెట్టవచ్చా?

“వ్యభిచారం మన దేశంలో చట్ట పరంగా నేరం కాకపోయినా, ఒక బ్రోతల్ లేదా online సర్వీసెస్ నడపడం చట్ట విరుద్ధం అన్న సంగతి మీరు ముందుగా గ్రహించాలి. కనుక మీరు మీ ఆలోచనను విరమించుకుంటే మంచింది.

ఒకవేళ మీకు మరింత సమాచారం కావాలంటే, చట్ట పరంగా అది ఎలా సాధ్యమో మీరు The Immoral Traffic (Prevention) Act, 1956 లో చదవవచ్చు

[1] .

ఈ చట్టానికి లింగ బేధాలు ఏమి లేవు.

Section 2 (f) of the Immoral Traffic(Prevention) Act, 1956, was amended twice through Act 46 of 1978 and then Act 44 of 1986(wef 1987) defined ‘prostitution’, wherein phrase ‘sexual exploitation or abuse of persons for commercial purposes’ was substituted.”

[2]

దురదృష్టవశాత్తూ వ్యభిచారానికి మూల కారణం పేదరికం అనే సంగతి మనకు విదితమే. అరుదుగా సంపన్న కుటుంబం నుండి ఇలాంటి వృత్తికి వస్తారు. వ్యభిచారంలో జీవితం ఎన్నో ఆటుపోటులకు గురి కావల్సివస్తుంది. బయటకు కనపడే అంత రంగుల జీవితం మాత్రం కాదు.ఇక ఈ వృత్తిలో వచ్చే మానసిక మరియు శారీరిక అనారోగ్యాల సంగతి మనకు తెలిసిందే కదా!

పులి రాజాకు ఎయిడ్స్ వస్తుందా? పులి రాజా సంగతి ఏమో కానీ, ఇలాంటి వృత్తిలో ఇలాంటి అనారోగ్యం రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాల్ బాయ్ సర్వీసెస్ (illegal) ఎక్కువగా ఉన్న ఆఫ్రికాలో HIV ఇన్ఫెక్షన్స్ చాల ఎక్కువగా ఉన్నవి.

ఒకవేళ మీరు ఇవ్వన్నిటికి సిద్ధపడ్డాను అనుకుంటే మాత్రం, ఎలాంటి దేశాల్లో మీకు చట్టపరంగా ఉద్యోగాలు ఉన్నాయో మీరు వెతుక్కోవచ్చు.

వ్యభిచారం సమాజానికి మంచిదా, లేదా అన్న సంగతి మీద చాలా పెద్ద ఫిలోసోఫికల్ డిస్కషన్ జరుగుతుంది. అందుకని “వ్యభిచారం” మీద మీరు స్వయంగా కొంత పరిశోధన చేసి మీ వ్యక్తిత్వం మేరకు ఒక నిర్ణయం తీసుకోండి. “మీ జీవితం మీ ఇష్టం”. దురదృష్టవశాత్తు వ్యభిచారం పేరు ఎత్తగానే యెగిరి యెగిరి పడి నీతులు చెప్పి, పోర్న్ వీడియో చూసే వారి సంఖ్య మన సమాజంలో ఎక్కువ కాబట్టి మీరు స్వయం పరిశోధన చేయవలసినదిగా మనవి. నెథర్లాండ్స్, అమెరికా వంటి దేశాల్లో “వ్యభిచారం” మీద వస్తున్న పరిశోధనలను చదవండి.

మీకు కుదిరితే హిందీలో వచ్చిన B.A pass అనే సినిమా చూస్తే, కాల్ బాయ్స్ యొక్క జీవితం గురించి మరింత తెలిసే అవకాశం లేకపోలేదు.”


ఫుట్‌నోట్స్

[1] 

https://web.archive.org/web/20150502184617/http://wcd.nic.in/act/itpa1956.htm

[2] IS LAW SILENT ON MALE PROSTITUTION?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x