కవరింగ్ లెటర్

కవరింగ్ లెటర్ అంటే ఏమిటి? ఈ లెటర్ రాయడానికి నియమ, నిబంధనలు ఏమిటో వివరించగలరా?

ఒక ఉద్యోగానికి లేదా ఒక కోర్స్ నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్నపుడు మన అప్లికేషన్తో పాటు మన ఆసక్తి తెలుపడానికి ఒక కవర్ లెటర్ రాయవలసి ఉంటుంది.

కవర్ లెటర్ రాయడానికి ఒక నిర్దిష్టమైన నియమ నిబంధనలు నాకు తెలిసినంతవరకు ఏమి లేవు. మన కవర్ లెటర్లో మనకు ఆ ఉద్యోగం పట్ల ఎంత ఆసక్తి ఉందొ, ఆ ఉద్యోగం ఒకవేళ మనకు వస్తే మనం ఏమి చేయదలుచుకున్నామో, ఆ ఉద్యోగం చేయడానికి మన దగ్గర ఉన్న స్కిల్ సెట్స్ ఏంటో మనం రాయవచ్చు.

ఈ సమాధానంలో నేను సైంటిస్ట్ ఉద్యోగానికి oxford యూనివర్సిటీకి పంపిన కవర్ లెటర్ను మీకు వివరిస్తాను.

కవర్ లెటర్ ఎంత ప్రొఫెషనల్ గా మనం తీర్చిదిద్దితే మన కవర్ లెటర్ చదివేవారికి అంత సులభం అవుతుంది. ప్రొఫెషనల్ అంటే నా ఉదేశ్యం, పేరాగ్రాఫ్స్, ఫాంట్ , స్పేసింగ్స్ , సంకరణం (alignment) మొదలైనవి అనమాట. ఉద్యోగం ఇచ్చే సంస్థ కొన్ని వందల దరఖాస్తులు చదవాలి కాబట్టి మీరు తక్కువ అక్షరాలతో ఎక్కువ సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తే మంచిది అనేది నా అభిప్రాయం.

Section 1:

మొదటగా నేను ఆ ఉద్యోగానికి ఎందుకు పనికి వస్తానో రాసాను. ఉదాహరణకు ఆ ఉద్యోగానికి వాతావరణ నమూనాల మీద పరిశోధనా అనుభవం అవసరం కావడం వలన, నేను నాకున్న అనుభవం రాసాను. మరి కొన్ని ముఖ్యమైన అనుభవాలు రాసాను. మొదటి పేరాగ్రాఫ్ లోనే ఇలా రాయడం చేత మన దరఖాస్తు చాల ముఖ్యమైనదిగా ఆ సంస్థవారు పరిగణించే అవకాశం ఉంది.

Section 2:

నేను ఆ సంస్థలో చేరిన తరువాత నేను ఏమిచేయగలనో, నా ఐడియాస్ ఏంటో , ఎలా పరిశోధన చేయగలనో లాంటి ముఖ్యమైన అంశాలను ప్రస్తావించాను. ఇలా చేయడం వలన మీరు ఆ సంస్థలో చేరడానికి ఎంత ఆలోచిస్తున్నారో, మీరు వినూత్నమైన ఐడియాస్ ఎలా ఆలోచిస్తున్నారో వారికి అర్ధం అవుతుంది.

Section 3:

చివరిగా పైన చెప్పిన కారణాలచేత నేను ఈ ఉద్యోగానికి అర్హుడను అని చెప్తూ, మీరు ఇంటర్వ్యూ అవకాశం ఇస్తే మరింత మీ ఆలోచనలు వారితో పంచుకునే ప్రయత్నం చేస్తాను అని రాస్తే ఆ సంస్థ వారికి మన మీద కొంత ఆసక్తి కలిగి ఇంటర్వ్యూ కి పిలిచే అవకాశం ఉంది.

నేను ఈ కవర్ లెటర్ పంపిన తరువాత ఆ ఉద్యోగం కోసం నాకు పిలుపు వచ్చింది. కానీ వ్యక్తిగత కారణాల వలన వెళ్లలేక పోయాను. కనుక నేను రాసిన కవర్ లెటర్లో కొన్ని అంశాలు మీకు కొంత ఉపయోగ పడతాయేమో ఆలోచించండి.

గమనిక: ఒక కవర్ లెటర్ ఇలానే ఉండాలి అనే నియమం ఏమి లేదు అని నేను మొదటగా మీకు చేప్పాను. మీ ఆలోచనలు తగ్గట్టు మీరు వినూత్నంగా అలోచించి రాయవచ్చు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x