ఓ జీవిత సత్యం

హరిత ఆదివారం సాయంత్రం లేడీ బర్డ్ సైకిల్ మీద తన తాతగారిని కలవడానికి వెళ్తుంది.

ఆదివారం సాయంత్రం కావడంతో చాల మంది జనాలు చల్లని సముద్రపు గాలి కోసం బీచ్ రోడ్ కి చేరుకున్నారు. ఐస్ క్రీం బండ్లతో, బుడగలు అమ్మేవారితో, గులాబీ పూలు అమ్మేవారితో, మసాలా మురి చేసేవాళ్ళతో కిటకిటలాడుతోంది బీచ్ రోడ్. సినిమా షూటింగ్ కూడా జరుగుతుండడం తో ఏగిరిఏగిరి చూస్తున్నారు కొంత మంది జనాలు.

హరితకి తెల్లరంగు అంటే బాగా ఇష్టం. అందుకని తెల్ల రంగు సైకిల్ మీద తెల్లని స్కర్ట్ వేసుకుని, తెల్లని ముత్యాల దండ ధరించి, తెల్ల బ్యాగ్ వేసుకుని అదే రోడ్ మీద వెళ్తుంది. సముద్రపు చల్లని గాలి ఆ గులాబీ పూల పరిమళాన్ని జతచేసుకొని అటుగా వెళ్తున్న హరితను తాకాయి. గాలి గట్టిగా వీస్తుండడంతో హరిత తన స్కర్ట్ ను సరిచేసుకుంటూ తన ప్రయాణాన్ని సాగిస్తుంది.

దారి పక్కనే కూర్చున్న పరిమళ ఆంటీ, ఈ పిల్లకు ఎంత స్టయిలు, ఆ బట్టలేంటి పాడు అని వారి భర్తగారితో అంది.

అటుపక్కనే కూర్చున్న రవి తన స్నేహితులతో అబ్బా ఎం పోరిరా, అదిరిపోయింది అని అన్నాడు.

గులాబీ పూలు అమ్మే కాంతమ్మ గారు, ఈ పిల్లకు గులాబీ పూలు అవసరమేమో, కొన్ని పూలు కొంటె బాగుండు అని అనుకుంది.

సినిమా లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న వేణు, ఈ అమ్మాయి నా నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ అయితే ఎంత బాగుణ్ణో అని అనుకున్నాడు.

శకుంతల గారు, చూడు పిన్ని అచ్చం మా మరిది కూతురిలాగా ఎంతచక్కగా ఉందొ ఆ పిల్ల అని వాపోయారు.

ఇంతలోపల ఎదురుగా ఆటో హఠాత్తుగా అడ్డురావడంతో హరిత సైకిల్‌ను ఆపింది. హఠాత్తుగా ఆగడంతో తన తెల్లని బ్యాగు రోడ్డు మీద పడిపోయింది. హరిత బ్యాగులో వున్న కొన్ని వస్తువులతో పాటు ఒక గోల్డ్ ఫ్లేక్ సిగరెట్ ప్యాకెట్ కూడా కింద పడిపోయింది. కింద పడిన వస్తువులను సర్దుకుంటూ, దురదృష్టవశాత్తు గాలికి కిందపడిపోయిన తూనిగను రోడ్ మీద గమనించి, పక్కనే ఉన్న మట్టిదిబ్బ మీద వేసింది హరిత. కొంతసేపటి తరువాత హరిత తిరిగి ప్రయాణం కొనసాగించింది, మట్టిదిబ్బ మీద వున్న తూనీగ కూడా అక్కడనుండి ఎగిరిపోయింది.

అక్కడ ఏమి జరిగిందో గమనించిన పెందుర్తి కొండలు, ఈ కాలం పిల్లలు పూర్తిగా చెడిపోయారు.సిగ్గిరెట్లు, మందు అనుకుంటూ సంస్కృతిని చెడగొడుతున్నారు అని మనసులో అనుకున్నాడు.

హరి తేజ తూనీగ ఎగిరిపోవడం చూసి ఆ అమ్మాయిది ఎంత జాలిగుండె అని అనుకున్నది.


తాతగారి ఇంటికి చేరుకున్న హరిత, తాతగారిని ఆప్యాయంగా పలకరించి, ఇందిగో ఇదే నీకు చివరి సిగరెట్ ప్యాకెట్. ఇక నాన్నగారి దగ్గర నుండి దొంగతనం చేయడం నా వల్ల కాదు అని చెప్పింది.

ప్రయాణంలో ఎన్నో కళ్ళు హరిత మీదపడి, వాటికి అనుగుణంగా హరిత మీద అభిప్రాయాలను ఏర్పరచుకున్నాయి. కానీ హరిత గురించి, హరిత మనసు గురించి వీరెవరికీ తెలీదు .

అలాగే, ఎంతోమంది మన ప్రయాణంలో వారి విజ్ఞత మేరకు, మన మీద అభిప్రాయం ఏర్పరచుకుంటారు. కాని హరిత లాగ మనo కూడా ఆ కళ్ళను పట్టించుకోకుండా, మన ప్రయాణం మనం సాగించాలి, మనo అనుకున్నది సాధించాలి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x